Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ స్కూఫ్


నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ స్కూఫ్ భారత ప్రధానమంత్రి శ్ర నరేంద్ర మోదీతో ఫోన్ లో సంభాషించారు.

ప్రజాస్వామ్యం, న్యాయపాలనల్లో ఉమ్మడి విలువలు, విశ్వాసం ప్రాతిపదికలుగా భారత్, నెదర్లాండ్స్ మధ్య విశ్వసనీయమైన, విలువైన భాగస్వామ్యం అంశంపై వారిద్దరూ ప్రధానంగా చర్చించారు.

నీరు, వ్యవసాయం, ఆరోగ్య రంగాలలో ప్రస్తుత సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలపై వారు చర్చించారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచుకోవాలనీ.. వాణిజ్యం, రక్షణ, భద్రత, ఆవిష్కరణలు, గ్రీన్ హైడ్రోజన్, సెమి కండక్టర్లు సహా వివిధ రంగాల్లో వ్యూహాత్మక సహకారం ఉండాలనీ వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. సన్నిహిత ప్రజా సంబంధాల నిర్మాణం, విద్య-సాంస్కృతిక రంగాల్లో పరస్పర వినిమయం ప్రాధాన్యాన్ని ఇరువురు నేతలూ ప్రముఖంగా చర్చించారు.

ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించిన ఇరువురు నేతలూ.. శాంతి, భద్రతా పరమైన సహకారం, స్థిరత్వాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు.

సంప్రదింపుల్లో ఉండేందుకు ఇరువురు నేతలూ అంగీకరించారు.