Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ప్రతిభాశాలి యువత వివిధ రంగాల్లో గతంలో లేని స్థాయిలో వృద్ధికి తోడ్పడుతోంది: ప్రధానమంత్రి


వివిధ రంగాల్లో భారతదేశం గొప్ప విజయాల్ని సాధిస్తుండడాన్ని ప్రధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ విజయాల ఖ్యాతి అంతా మన దేశ యువతీయువకుల్లోని శక్తీ, ప్రతిభలదే అని ఆయన అన్నారు.

వేరువేరు రంగాల్లో భారత్ సాధించిన ప్రశంసనీయ విజయాలపై మైగవ్ (MyGov) కొన్ని తాజా సందేశాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో నమోదు చేయగా, దీనిపై శ్రీ మోదీ స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘భారత్ ఒక విశిష్ట మార్గాన్ని నిర్దేశిస్తోందంటే అందుకు కారణం మన ప్రతిభావంతులైన యువతీయువకులే. అంతేకాదు, మనం రాబోయే కాలాల్లో కూడా మరిన్ని మేలైన ఫలితాల్ని సాధించబోతున్నాం.’’

 

***