Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత దేశం యొక్క దౌత్య ప్రయాస లు, ప్రాంతీయ నిబద్ధత లు ప్రపంచ రంగస్థలం మీద ఒక ఆత్మవిశ్వాసం కలిగిన మరియు దక్షత కలిగిన దేశాన్ని ఆవిష్కరిస్తున్నాయి: ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం లో భారతదేశం యొక్క కార్యసాధనల ను వివరించేటటువంటి ఒక వ్యాసాన్ని ఈ రోజు న శేర్ చేశారు. ఆ వ్యాసం లో భారతదేశం జి-20 కి అధ్యక్షత ను వహించి సాధించినటువంటి సాఫల్యాలు, చంద్ర గ్రహం పైకి జరిపిన సాహస యాత్ర, కోవిడ్-19 అనంతర కాలం లో తిరిగి పుంజుకోవడం తో పాటు గా పటిష్ట వృద్ధి ని సాధించడం గురించి వివరించడం జరిగింది. ఆ వ్యాసాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్ వ్రాశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

 

‘‘విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @DrSJaishankar వ్రాసిన వ్యాసం 2023 లో భారతదేశం యొక్క కార్యసాధనల ను గురించి వివరిస్తున్నది; జి-20 కూటమి కి భారతదేశం అధ్యక్షత వహించిన సందర్భం లో ఒనగూరిన సాఫల్యాలు, చంద్ర గ్రహం పైకి జరిపిన సాహస యాత్ర, కోవిడ్-19 అనంతర కాలం లో తిరిగి పుంజుకోవడం తో పాటు గా పటిష్టమైన వృద్ధి ని సాధించడం వంటి అంశాల ను గురించి ఈ వ్యాసం తెలియజేస్తున్నది.

 

ఈ వ్యాసం భారత దేశం యొక్క దౌత్య ప్రయాసల ను గురించి, ప్రాంతీయ బంధాన్ని గురించి, ఆత్మవిశ్వాసం తో కూడిన మరియు దక్షత కలిగిన దేశాన్ని గురించి ప్రపంచ రంగస్థలం మీద చాటిచెబుతున్నది.’’ అని పేర్కొన్నారు.