ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గౌరవనీయులైన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్‌లో సంభాషించారు. కోవిడ్-19 ప్రపంచ మహమ్మారిపై పోరాటంలో తమతమ ప్రభుత్వాలు అనుసరించిన ప్రతిస్పందన వ్యూహాల గురించి దేశాధినేతలిద్దరూ ఈ సందర్భంగా చర్చించారు. ఈ ప్రపంచ మహమ్మారి నిర్మూలన దిశగా రెండు దేశాల సంయుక్త కృషికిగల అవకాశాలను అన్వేషించాలని వారు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఔషధ సరఫరాలు మెరుగుపరచడంసహా వినూత్నరీతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపైనా సమాలోచన చేశారు. ఇటువంటి ఏకాభిప్రాయ అంశాల్లో నిరంతర సమాచార ఆదానప్రదాన మార్గం ఏర్పరచుకోవడంపై అంగీకారానికి వచ్చారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో కోవిడ్-19 ఒక ముఖ్యమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించగా గౌరవనీయ ఇజ్రాయెల్ ప్రధాని ఆయనతో పూర్తిగా ఏకీభవించారు. అలాగే మానవాళి ఉమ్మడి ప్రయోజనాలపై దృష్టిసారిస్తూ ప్రపంచీకరణపై ఒక కొత్త దృక్పథం రూపకల్పనకు ఇదొక అవకాశం కల్పించిందన్న ప్రధాని వ్యాఖ్యను కూడా నెతన్యాహు అంగీకరించారు.
*****
Had a telephone conversation with PM @netanyahu. We spoke about the situation arising due to COVID-19 and ways to fight the pandemic. https://t.co/NxdEO411b9
— Narendra Modi (@narendramodi) April 3, 2020