Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు… థాయిలాండ్ ప్రధానికి భారత ప్రధానమంత్రి ధన్యవాదాలు


భారత్ 76వ గణతంత్ర దినోత్సవం ఈ రోజుఈ సందర్భంగా థాయిలాండ్ ప్రధాని పైతాంగ్‌తార్న్ చినవత్ర శుభాకాంక్షలు తెలియజేశారుదీనికి ప్రతిగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమెకు ధన్యవాదాలు వ్యక్తం చేశారు.

 

థాయిలాండ్ ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

 

‘‘మేం భారత గణతంత్రం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొన్న సందర్భాన్ని వైభవోపేతంగా నిర్వహించుకొంటున్న క్రమంలో ప్రధాని @ingshin, మీరు శుభాకాంక్షలు తెలియజేయడం ముదావహంథాయిలాండ్‌తో మా సంబంధాలకు మేం చాలా ప్రాముఖ్యాన్నిస్తున్నాంప్రాంతీయ సంధానంతోపాటు రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంచుకోవడంలో మా సహకారాన్ని కొనసాగించాలని మేం ఆశిస్తున్నాం’’.