భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్‌కు, ఐర్లాండ్ ప్రధాని శ్రీ మేఖేల్ మార్టిన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ధన్యవాదాలు తెలియజేశారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ:
‘‘నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ (@EmmanuelMacron), భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఎంతో ఆప్యాయంగా మీ శుభాకాంక్షలను తెలియజేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. కిందటి ఏడాది ఇదే రోజు మీరు భారత్‌కు వచ్చి, ఈ వేడుకల్లో పాలుపంచుకోవడం మన వ్యూహాత్మక భాగస్వామ్యంలోనూ, చిరకాలంగా కొనసాగుతూ వస్తున్న మైత్రిలోనూ నిజంగా ఓ మేలిమలుపు. మానవాళికి మేలైన భవిష్యత్తును అందించే దిశగా మనం కలిసి కృషి చేస్తున్న క్రమంలో, త్వరలోనే ప్యారిస్‌లో నిర్వహించే ఏఐ యాక్షన్ సమిట్ లో మీతో భేటీ కావడానికి నేను ఆసక్తితో ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఐర్లాండ్ ప్రధాని పోస్టుకు శ్రీ మోదీ సమాధానమిస్తూ:
‘‘ప్రధాని శ్రీ మైఖేల్ మార్టిన్ (@MichealMartinTD), మీరు ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ప్రజాస్వామ్యం పట్ల ఉమ్మడి విశ్వాసం, నమ్మకం పునాదులుగా భారత్‌కు, ఐర్లాండుకు మధ్య చాలాకాలంగా కొనసాగుతూవస్తున్న సంబంధాలు రాబోయే కాలాల్లో సైతం మరింత బలపడతాయని నేను నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు.
My dear friend, President @EmmanuelMacron, your kind greetings on India’s 76th Republic Day are deeply appreciated. Your august presence last year on this day was indeed a high point in our strategic partnership and enduring friendship. See you soon at the AI Action Summit in… https://t.co/5AU5SSntA8
— Narendra Modi (@narendramodi) January 27, 2025