Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్- సౌదీ అరేబియా బంధం బలపడుతోంది: ప్రధానమంత్రి


భారత్- సౌదీ అరేబియాల అనుబంధం వృద్ధిచెందుతోందని ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ ‘అరబ్‌న్యూస్’కు ఇచ్చిన ఒక ఇంటర్‌వ్యూలో స్పష్టం చేశారు. సౌదీ అరేబియా ఒక విశ్వసనీయ నేస్తం, వ్యూహాత్మక మిత్ర దేశమని ఆయన అభివర్ణించారు. 2019లో వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పాటు చేసినప్పటి నుంచి ద్వైపాక్షిక సంబంధాలు చెప్పుకోదగిన స్థాయిలో విస్తరించాయని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో ఇలా తెలిపింది:

‘‘భారత్‌- సౌదీ అరేబియా బంధం అంతకంతకు బలపడుతోందని అరబ్‌న్యూస్ (@arabnews)కిచ్చిన ఒక ఇంటర్‌వ్యూలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi) స్పష్టం చేశారు. సౌదీ అరేబియాను ‘ఒక విశ్వసనీయ నేస్తంగా, వ్యూహాత్మక మిత్ర దేశం’’గా ప్రధాని అభివర్ణిస్తూ, 2019లో వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పాటు చేసినప్పటి నుంచి ద్వైపాక్షిక సంబంధాలు చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరించాయన్నారు.’’

ఇంటర్‌వ్యూను చదవండిక్కడ: https://arabnews.com/node/2597904/saudi-arabia

 

***