Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ సహాయంతో రూపుదిద్దుకొన్న రైల్వే మౌలిక సదుపాయ ప్రాజెక్టులు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం


భారత్ సహాయంతో అనురాధపురాలో నిర్మాణం పూర్తిచేసిన రెండు రైల్వే ప్రాజెక్టులకు ఈ రోజు ప్రారంభోత్సవాన్ని నిర్వహించగా, ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనురా కుమార దిసనాయకేతో పాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.

 

భారత్ అందించిన 91.27 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన సహాయంతో నవీకరణ పనులను చేపట్టి పూర్తి చేసిన 128 కిలోమీటర్ల పొడవైన మాహో-ఓమాన్‌థాయి రైల్వే లైనును నేతలు ప్రారంభించారు. మాహో నుంచి అనురాధపురా వరకు 14.89 మిలియన్ డాలర్ల రూపంలో భారత్ అందించిన గ్రాంటుతో ఏర్పాటు చేస్తున్న ఉన్నత ప్రమాణాల సిగ్నలింగ్ వ్యవస్థ నిర్మాణ పనులను కూడా వారు ప్రారంభించారు.

 

భారత్, శ్రీలంకల మధ్య అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యంలో భాగంగా చేపడుతున్న ఈ మహత్తర రైల్వే ఆధునికీకరణ ప్రాజెక్టులు శ్రీలంకలో ఉత్తర, దక్షిణ రైల్వే సంధానాన్ని బలపరచడంలో ఓ ముఖ్యఘట్టాన్ని ఆవిష్కరించనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలతోపాటు సరకు రవాణా సైతం వేగవంతంగా, సమర్థంగా సాగేందుకు అనువైన స్థితిని ఈ ప్రాజెక్టులు ఏర్పరచనున్నాయి.

 

***