యువర్ ఎక్సలెన్సీ, ప్రధానమంత్రి షేక్ హసీనా గారూ, నమస్కారం !
బిజోయ్ దిబ్షేర్ ఔనెక్ ఔనెక్ అభినందన్ ఆర్ పోష్ పర్బోనర్ శుభేచ్చ !
నేడు, ప్రపంచం మొత్తం వర్చువల్ సమ్మిట్ లు చేస్తోంది. కానీ ఈ మాధ్యమం మీకు, నాకు కొత్తకాదు. చాలా ఏళ్లుగా వీడియో మాధ్యమం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాం.
చాలా సార్లు మనం వీడియో ద్వారా ప్రాజెక్టులను ఆవిష్కరించాం, ప్రారంభించాం.
యువర్ ఎక్సలెన్సీ,
విజయ్ దివస్ తరువాత, ఇవాళ మన సమావేశం మరింత ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
విముక్తి వ్యతిరేక శక్తులపై బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయాన్ని మీతో విజయ్ దివస్ గా జరుపుకోవడం మాకు గర్వకారణం.
ఈ రోజు, బంగ్లాదేశ్ నలభై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా, ఈ సందర్భం కై వారి జీవితాలను అర్పించిన ఇరు దేశాల అమరవీరులకు నేను నివాళులర్పిస్తున్నాను.
విజయ్ దివస్ సందర్భాన్ని పురస్కరించుకొని నిన్న రాష్ట్రీయ సమర్ స్మారక చిహ్నం వద్ద నేను నివాళులర్పించడం జరిగింది. గోల్డెన్ విక్టరీ టార్చ్ వెలిగించడం కూడా జరిగింది.
ఈ నాలుగు ‘విక్టరీ టార్చ్ లు ‘ భారతదేశం అంతటా ప్రయాణిస్తాయి, గ్రామ గ్రామానికి మా అమరవీరులను తీసుకువెళతారు.
డిసెంబర్ 16 నుండి మేము ‘గోల్డెన్ విక్టరీ ఇయర్’ జరుపుకుంటున్నాము, దీనిలో భారతదేశం అంతటా అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
ఎక్సలెన్సీ,
ముజీబ్ బర్షో సందర్భంగా, భారతీయులందరి తరఫున నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
వచ్చే ఏడాది బంగ్లాదేశ్ సందర్శించడానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మీతో కలిసి బంగబంధుకు నివాళి అర్పించడం నాకు గర్వకారణం.
ఎక్సలెన్సీ,
మన పొరుగున ఉన్న వారికే తొలి ప్రాధాన్యత విధానానికి బంగ్లాదేశ్ ఒక ప్రధాన స్తంభం.. బంగ్లాదేశ్ తో సంబంధాలను బలోపేతం చేయడానికి, వేగవంతం చేయడం అనేవి మొదటి రోజు నుంచి నాకు ఉన్న ప్రత్యేక ప్రాధాన్యతలు.
ప్రపంచ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం సవాలుగా ఉంది అనేది నిజం.
అయితే ఈ క్లిష్ట సమయంలో భారత్, బంగ్లాదేశ్ ల మధ్య మంచి సహకారం ఉండటం సంతృప్తిని కలిగించే విషయం.
మందులు లేదా వైద్య పరికరాల్లో లేదా ఆరోగ్య నిపుణులతో కలిసి పనిచేయడానికి ఇరు దేశాల మధ్య సహకారం ఉంది. వ్యాక్సిన్ రంగంలో కూడా మన మధ్య మంచి సహకారం ఉంది. ఈ విషయంలో మీ అవసరాల పై కూడా మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.
సార్క్ ఫ్రేమ్ వర్క్ కింద బంగ్లాదేశ్ అందించిన సహకారానికి మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
కేవలం ఆరోగ్యం విషయంలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఈ ఏడాది మా ప్రత్యేక భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది.
భూ సరిహద్దు వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తగ్గించాం. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ ని విస్తరించారు. కొత్త మార్గాలు జోడించబడ్డాయి.
ఇవన్నీ మన సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే మా ఉద్దేశ్యాలను ప్రతిబింబిస్తాయి.
“ముజిబ్ చిరంతర్” – బంగబందు సందేశం శాశ్వతమైనది.మరియు ఈ స్ఫూర్తితోనే ఆయన వారసత్వాన్ని కూడా మనం గౌరవిస్తాం.
బంగబంధు వారసత్వం మీ అద్భుతమైన నాయకత్వంలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, మా ద్వైపాక్షిక సంబంధాలపట్ల మీ వ్యక్తిగత నిబద్ధత కూడా స్పష్టంగా ఉంది.
బంగబంధు గౌరవార్థం ఇవాళ మీతో ఒక తపాలా బిళ్ళను విడుదల చేయడం, బాపూ, బంగబంధులపై డిజిటల్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం నాకు గర్వకారణం. బాపూ, బంగబంధు లకు సంబంధించిన ప్రదర్శన మన యువతకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. ఇందులో ప్రత్యేక విభాగం కస్తూర్బా గాంధీజీ మరియు పూజ్య బంగామాతాజీ లకు అంకితం చేయబడింది.
ఎక్సలెన్సీ,
ఇప్పుడు నేను మీ ప్రారంభ వ్యాఖ్యలకై మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను.
Addressing the India-Bangladesh virtual summit with PM Sheikh Hasina. https://t.co/ewHLRWvVLZ
— Narendra Modi (@narendramodi) December 17, 2020