Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్-ఫ్రాన్స్ ఉమ్మడి ప్రకటన


గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో మధ్యాహ్న భోజనంలో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబరు 10న న్యూ ఢిల్లీలో జరిగిన జి-20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా 2023 జూలైలో పారిస్‌లో జరిగిన చివరి సమావేశం నుండి ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యమైన అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం-ఫ్రాన్స్ భాగస్వామ్యం, వ్యూహాత్మక 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2023 జూలై 14న ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం సందర్భంగా గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పారిస్‌కు చారిత్రాత్మకమైన పర్యటన తర్వాత అధ్యక్షుడు మాక్రాన్ భారతదేశ పర్యటన వచ్చారు. 

లోతైన విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి పై నమ్మకం, అంతర్జాతీయ చట్టం, వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అలాగే ఐక్యరాజ్య సమితి చార్టర్‌లో పొందుపరచబడిన సూత్రాల పట్ల దృఢ నిబద్ధత, బహుపాక్షికతపై స్థిరమైన విశ్వాసం, స్థిరమైన బహుళత్వం కోసం పరస్పర అన్వేషణతో భారతదేశ ఫ్రాన్స్ భాగస్వామ్య బలాన్ని పెంపొందించారు. ప్రాంతీయ, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ సహకారాన్ని విస్తరించుకోవాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు నొక్కి చెప్పారు. ప్రపంచ క్రమాన్ని పునర్నిర్మించే సంక్షోభ సమయాల్లో, ‘వసుధైవ కుటుంబం’ అంటే ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్తు సమిష్టిగా మంచి శక్తిగా పనిచేయాలనే తమ అచంచలమైన నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.

‘హారిజోన్ 2047’ రోడ్‌మ్యాప్, ఇండో-పసిఫిక్ రోడ్‌మ్యాప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో ఇతర పరిణామాలు సమాలోచనలకు వచ్చాయి. ఇద్దరు నాయకులు పరస్పర సహకారం కోసం తదుపరి చర్యలపై చర్చించారు. రక్షణ రంగాలు, అంతరిక్షం, అణుశక్తి, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్లిష్టమైన సాంకేతికత, వాతావరణ మార్పు, విద్య, ప్రజల మధ్య సంబంధాలు అంశాలలో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ఇంధనం, జీవవైవిధ్యం, సుస్థిరత, పారిశ్రామిక ప్రాజెక్టులతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతం, ఆఫ్రికాలో భారతదేశం-ఫ్రాన్స్ భాగస్వామ్యంపై కూడా వారు తమ చర్చలను ముందుకు తీసుకెళ్లారు. భారతదేశం, ఫ్రాన్స్ ప్రారంభించిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి ఫ్రేమ్‌వర్క్‌లో వారి సహకారం ద్వారా ఇండో-పసిఫిక్ కోసం పరిష్కారాలను అందించే వారి పాత్రను నొక్కిచెప్పారు.

 

****