Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ -నమీబియా, పనామా దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం


ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌, పాల‌నా ప‌ద్ధ‌తుల్లో స‌హ‌కారం కోసం నమీబియా ఎన్నికల కమిషన్ (ECN), పనామా ఎన్నికల ట్రిబ్యునల్ (ETP)లు భార‌త్‌తో కుదుర్చుకున్న అవ‌గాహ‌న సహకారం ఒప్పందానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది.

ముఖ్యాంశాలు:

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌, పాల‌న ప‌ద్ధ‌తుల రంగంలో స‌హ‌కారాన్ని ఈ ఒప్పందంలోగ‌ల‌ ప్రామాణిక నియ‌మాలు/నిబంధ‌న‌లు ప్రోత్స‌హిస్తాయి. ఎన్నికల ప్ర‌క్రియ‌లో సంస్థాగ‌త‌, సాంకేతిక ప‌రిజ్ఞానాభివృద్ధి రంగాల్లో విజ్ఞానం, అనుభ‌వాల ఆదాన‌ప్ర‌దానానికీ ఇది దోహ‌ద‌ప‌డుతుంది. స‌మాచార ఆదాన‌ప్ర‌దానంలో మ‌ద్ద‌తు, సంస్థాగ‌త బ‌లోపేతం, సామ‌ర్థ్య నిర్మాణం, సిబ్బందికి శిక్ష‌ణ‌, క్ర‌మం త‌ప్ప‌కుండా సంప్ర‌దింపులు వంటివ‌న్నీ ఈ ఒప్పందాల కింద‌కు వ‌స్తాయి.

ప్రభావం:

నమీబియా ఎన్నికల సంఘం (ECN), పనామా ఎన్నికల ట్రిబ్యునళ్ల(ETP)లో సాంకేతిక సామర్థ్య నిర్మాణం/మద్దతు లక్ష్యంగా ద్వైపాక్షిక సహకారాన్ని ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుంది. తమతమ దేశాల్లో ఒక మెట్టు మెరుగైన రీతిలో ఎన్నికల నిర్వహణ దిశగా ఎన్నికల యాజమాన్యం, పాలన పద్ధతుల రంగంలో సహకరించడం దీని ప్రధానోద్దేశం. అలాగే భారత అంతర్జాతీయ సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తుంది.

నేపథ్యం:

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల సంబంధిత అంశాలు, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ల రంగంలో స‌హ‌కారాన్ని ప్రోత్సహించేందుకు భార‌త ఎన్నిక‌ల సంఘం (EC) ఆయా కార్య‌క‌లాపాల్లో పాలుపంచుకుంటోంది. ఈ మేర‌కు కొన్ని ఇత‌ర దేశాలు, అక్క‌డి సంబంధిత ప‌క్షాల‌తో అవ‌గాహ‌న ఒప్పందాల‌పై సంత‌కాల ద్వారా స‌హ‌కారం అందిస్తోంది. కాగా, ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య ఎన్నికల క‌స‌ర‌త్తు సాగే భార‌త్‌లో ఆ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేది రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే. విభిన్న సామాజిక‌-రాజ‌కీయ-ఆర్థిక‌ నేప‌థ్యాలుగ‌ల 85 కోట్ల మంది ఓట‌ర్లున్న విశాల దేశంలో స‌జావుగా, పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ఈసీ బాధ్య‌త‌. ఆ విధంగా భార‌త‌దేశంలో ప్ర‌జాస్వామ్య విజ‌యం ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు ప్ర‌తి దేశంలోని రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌నూ ఆక‌ట్టుకుంది.

ఎన్నిక‌ల రంగంలో నైపుణ్యాన్వేష‌ణ దిశ‌గా అనేక విదేశీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ సంస్థ‌ల నుంచి ఎన్నిక‌లు-త‌త్సంబంధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి కోసం వివిధ‌ ప్ర‌తిపాద‌న‌ల‌ను భార‌త ఎన్నిక‌ల సంఘం అందుకుంటోంది. ఇలా అందిన ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్ర చ‌ట్ట‌-న్యాయ‌, శాస‌న మంత్రిత్వ‌శాఖ‌లకు పంపి, వాటిద్వారా నమీబియా ఎన్నికల సంఘం (ECN), పనామా ఎన్నికల ట్రిబ్యునళ్ల(ETP)తో అవ‌గాహ‌న ఒప్పందాలు కుదుర్చుకుంది.

**