ID: 2117396 Part-02 /Final: GSR
Part-02
ఎప్పటికప్పుడు మారే సమాచార, డిజిటల్ టెక్నాలజీ రంగాలను ప్రస్తావించి, ఈ రంగంలో సహకారాన్ని పెంపొందించేందుకు అన్వేషణ చేయాల్సిన అవసరాన్ని ఇద్దరు నాయకులు అంగీకరించారు. పెట్టుబడుల వృద్ధి, సంయుక్త భాగస్వామ్యాలు, సాంకేతికపరమైన అభివృద్ధి, ఐటీ, డిజిటల్ రంగాల్లో మార్కెట్ల పురోగతిపై వారు పరస్పర ఆసక్తిని వ్యక్తపరిచారు. అంతేకాక, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (డీపీఐ) లో సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు ప్రజాస్వామ్యయుతంగా డిజిటల్ సేవలను అందించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో సహకారాన్ని తొందరగా అమలు చేయడానికి ఇరు వైపుల నుంచి జరుగుతున్న ప్రయత్నాలను వారు గుర్తించారు. అలాగే, రెండు దేశాల ఉత్సాహభరిత స్టార్టప్ వ్యవస్థల మధ్య మరింత సన్నిహిత సహకారం విస్తరణకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. రెండు దేశాల సాంకేతిక సమాజాల మధ్య మరింత లోతైన అనుసంధానానికి వీలుగా డిజిటల్ మార్పు రంగంలో సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకం జరిగేలా ముందుకు సాగాలనే ఆకాంక్షను ఇరువురు నాయకులు వ్యక్తం చేశారు.
సంస్కరణలు చేసిన బహుపాక్షిక వ్యవస్థకు, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని 21వ శతాబ్దపు భౌగోళిక రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించేలా శాశ్వత, శాశ్వతం కాని సభ్యత్వ విభాగాలలో సమగ్ర సంస్కరణల ద్వారా దానిని మరింత ప్రాతినిధ్యం, జవాబుదారీతనం, పారదర్శకం, సమ్మిళితం, ప్రభావవంతంగా మార్చేందుకు ఇద్దరు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
సంస్కరణలు చేసిన, విస్తరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వానికి చిలీ తన మద్దతును పునరుద్ఘాటించింది. శాంతియుత చర్చల ద్వారా అన్ని వివాదాలను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తూ, ప్రపంచ సుస్థిర శాంతి కోసం ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కులను పెంపొందించడానికి కలిసి పనిచేయాలని ఇరు దేశాలూ అంగీకరించాయి. సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమష్టి పోరాటంలో కలిసి నిలబడాలన్న సంకల్పాన్ని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అంతర్జాతీయ స్థాయిలో సమష్టి చర్యల అవసరాన్ని వారు అంగీకరించారు.
యుఎన్ఎస్సి తీర్మానం – 1267 ను అమలు చేయాలని, ఉగ్రవాద సురక్షిత స్థావరాలను, మౌలిక సదుపాయాల వ్యవస్థను నిర్మూలించడానికి, ఉగ్రవాద వ్యవస్థలను, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందే అన్ని మార్గాలను విచ్ఛిన్నం చేయడానికి కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్), నో మనీ ఫర్ టెర్రర్ (ఎన్ఎంఎఫ్టీ), ఇతర బహుళపక్ష వేదికల్లో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాల్సిన ఆవశ్యకతను కూడా వారు స్పష్టం చేశారు.
దేశాల సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించే, నౌకాయాన, గగనయాన స్వేచ్ఛను అలాగే అంతరాయంలేని చట్టబద్ధమైన వాణిజ్యానికి సంబంధించిన నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ లక్ష్యాన్ని కొనసాగించడానికి తమ కట్టుబాటును నేతలు ప్రకటించారు. అంతేకాక, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన న్యాయసూత్రాలు, ముఖ్యంగా యూఎన్సీఎల్ఓఎస్ మేరకు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని నిర్ణయించారు.
“వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్” సమ్మేళనాల మూడు ఎడిషన్లలోనూ చిలీ పాల్గొన్నందుకు ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది గ్లోబల్ సౌత్ దేశాలను ఒకచోటకు చేర్చి, వారి అభివృద్ధి ఆలోచనలను, ప్రాధాన్యతలను పంచుకునే దిశగా చిలీ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
2024 ఆగస్టులో జరిగిన మూడో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ లో అధ్యక్షుడు బోరిక్ తన విలువైన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. సమర్థవంతమైన అంతర్జాతీయ పాలనా సంస్కరణలు, గ్లోబల్ సౌత్ దేశాలకు స్వచ్ఛమైన, హరిత సాంకేతిక పరిజ్ఞానాలను సమానంగా అందించడంతో సహా అనేక ప్రస్తుత అంతర్జాతీయ అంశాలపై భారత్, చిలీ మధ్య బలమైన అనుసంధానం ఉందని ఆయన అన్నారు..గ్లోబల్ సౌత్ దేశాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో భారత నాయకత్వాన్ని అధ్యక్షుడు బోరిక్ స్వాగతించారు.
భారత జి 20 నాయకత్వం అభివృద్ధి అజెండాను కేంద్రబిందువుగా మార్చిందని అధ్యక్షుడు బోరిక్ ప్రశంసించారు. అంతేకాక, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే దిశగా, సాంకేతికత పరిజ్ఞానం మార్పు, సమ్మిళిత పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. భారత జి 20 నాయకత్వం గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతను ముందుకు తీసుకువచ్చిందని రెండు దేశాల నేతలు గుర్తించారు. ముఖ్యంగా, ఆఫ్రికన్ యూనియన్‌ను జి20లో చేర్చడం, సుస్థిర అభివృద్ధికి అనుకూలమైన జీవనశైలుల (ఎల్ఐఎఫ్ఇ ) కు ప్రోత్సాహం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) లో పురోగతి, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (ఎండీబీ) సంస్కరణలు, మహిళల నేతృత్వంలోని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి వంటి కీలక కార్యక్రమాలు, ఫలితాలను తెరపైకి తీసుకురావడం ద్వారా భారత జి 20 నాయకత్వం గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతను ముందుకు తెచ్చిందని రెండు దేశాల నేతలు గుర్తించారు. ఈ నేపథ్యంలో జి 20 లో మరింత అనుసంధానం, , ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో, చిలీ, లాటిన్ అమెరికన్ దేశాలను జి 20 అతిథి దేశాలుగా చర్చలలో చేర్చడానికి భారతదేశం మద్దతు ప్రకటించింది.
వాతావరణ మార్పు, తక్కువ ఉద్గారాల వాతావరణ ఆర్థిక వ్యవస్థలకు మారడం వల్ల తమ ఆర్థిక వ్యవస్థలకు ఎదురవుతున్న సవాళ్లను ఇరు దేశాలు గుర్తించాయి. తదనుగుణంగా, మరింత సమర్థవంతమైన ఇంధన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్వచ్ఛమైన ఇంధనాన్ని, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించాలని వారు ప్రగాఢ ఆకాంక్షను వ్యక్తం చేశారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వినియోగం, నిల్వ సాంకేతికతలు, ఇంధన సామర్థ్యం, ఇతర తక్కువ కార్బన్ పరిష్కారాలలో ఉమ్మడిగా పెట్టుబడులను పెంచాలని ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు, ఇవి స్థిరమైన ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)లో భారత్ నాయకత్వాన్ని అధ్యక్షుడు బోరిక్ స్వాగతించారు. చ 2023 నవంబరు నుండి చిలీ సభ్య దేశంగా ఉన్న నేపథ్యంలో తన దృఢమైన మద్దతును ఆయన పునరుద్ఘాటించారు.సుస్థిర అభివృద్ధి (ఎస్ డీజీ) లక్ష్యాలను సాధించడానికి వ్యవస్థలు, మౌలిక సదుపాయాలను సుస్థిరంగా మార్చే లక్ష్యంతో 2021 జనవరిలో విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ)లో చేరిన చిలీని ప్రధానమంత్రి మోదీ అభినందించారు. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల ఐఎస్ఏ ప్రాంతీయ కమిటీ ఏడో సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి చిలీ చేసిన ప్రతిపాదనను నాయకులు స్వాగతించారు.
సాంకేతికత ఆధారిత అభ్యాస పరిష్కారాలు, నైపుణ్యాభివృద్ధి, సంస్థాగత సామర్థ్య పెంపు అంశాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఈ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు తమ కట్టుబాటును భారత్, చిలీ పునరుద్ఘాటించాయి. ఇడిసిఐఎల్ (ఇండియా) లిమిటెడ్, చిలీ విశ్వవిద్యాలయాల రెక్టర్స్ కౌన్సిల్ (సిఆర్యుసి), చిలీ విద్యా మంత్రిత్వ శాఖ, సాంకేతిక శిక్షణా కేంద్రాలు (సిఎఫ్టి) తో సహా చిలీ లోని కీలక సంస్థల మధ్య భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా డిజిటల్ లెర్నింగ్, పరిశోధనా మార్పిడి, స్మార్ట్ విద్యా మౌలిక సదుపాయాలు, వృత్తి శిక్షణ కార్యక్రమాలు వంటి రంగాలపై దృష్టి సారిస్తారు. అలాగే, ఇరు దేశాల శక్తి సామర్ధ్యాలను సమన్వయం చేసుకుని, విద్యలో వినూత్నతను, విజ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా కలిసి పని చేయాలని నిర్ణయించాయి.
జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020 ద్వారా భారతదేశంలో విద్యారంగంలో చోటుచేసుకుంటున్న గణనీయమైన మార్పులను ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారు. ప్రముఖ చిలీ విశ్వవిద్యాలయాలు భారతీయ సంస్థలతో విద్యా, పరిశోధన భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని, ఉమ్మడి / ద్వంద్వ డిగ్రీ, ట్విన్నింగ్ ఏర్పాట్ల ద్వారా సంస్థాగత అనుసంధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర రంగాల్లో రెండు దేశాల పరస్పర బలాల దృష్ట్యా, ఈ రంగాల్లో సంస్థాగత సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు. చిలీలోని ఒక విశ్వవిద్యాలయంలో భారత అధ్యయనాల కోసం ఐసీసీఆర్ ఛైర్ ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఇరువురు నాయకులు స్వాగతిస్తూ, దీనిని త్వరితగతిన అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
దౌత్య రంగంలో శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించడంలో కొనసాగుతున్న సహకారాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలకు , దౌత్యాన్ని మరింత సమర్థంగా మారుస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఈ రంగాలలో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలను వారు ప్రస్తావించారు.
ఇరు దేశాల ప్రజలను దగ్గర చేయడంలో సాంస్కృతిక సంబంధాల పాత్రను కూడా ఇరువురు నేతలు గుర్తించారు. రెండు దేశాల సుసంపన్నమైన, వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని, రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సాంస్కృతిక మార్పిడిని ప్రశంసించారు. భారతదేశంలో ప్రజాదరణ పొందిన విదేశీ భాషలలో స్పానిష్ ఒకటిగా ఉన్నందున రెండు దేశాల సంస్కృతులు, భాషల అధ్యయనంపై పెరుగుతున్న ఆసక్తిని నాయకులు ప్రశంసించారు. భారత్ – చిలీ సాంస్కృతిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, రెండు దేశాల సాంస్కృతిక సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి పరస్పర ఆసక్తిని వారు వ్యక్తం చేశారు. సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, మ్యూజియంలు, పండుగలలో ద్వైపాక్షిక వినిమయాన్ని ప్రోత్సహించడానికి కొత్త సాంస్కృతిక కార్యక్రమంపై సంతకం చేయడాన్ని కూడా వారు స్వాగతించారు.
మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాల అక్రమ రవాణాను నిరోధించడానికి సంబంధిత ఏజెన్సీల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి దారితీసే కస్టమ్స్ వ్యవహారాలలో సహకారం, పరస్పర సహాయంపై ఒప్పందాన్ని ఖరారు చేయడంలో సాధించిన పురోగతిపై ఇద్దరు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ ఒప్పందం కస్టమ్స్ చట్టాల ఉల్లంఘనలను దర్యాప్తు చేయడానికి, నిరోధించడానికి, అరికట్టడానికి, అలాగే ఉత్తమ పద్ధతులను, సామర్థ్యాన్ని పెంపొందించడానికి దారితీస్తుంది. వికలాంగుల రంగంలో సహకారంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరు పక్షాలు చేసిన ప్రయత్నాలను వారు స్వాగతించారు, ఇది ఎవరూ వెనుకబడని మరింత మానవీయ, న్యాయమైన సమాజానికి దోహదం చేస్తుంది. ఈ డాక్యుమెంట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరువురు నేతలు తమ అధికారులను ఆదేశించారు.
పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపాల్సిన ఆవశ్యకతను ఇరువురు నేతలు ఏకీభవించారు. ద్వైపాక్షిక సంబంధాలకు మూలమైన సహకారం, అవగాహన బంధాలను పెంపొందించడానికి, విస్తరించడానికి, అవకాశాలను పెంపొందించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు పునరుద్ఘాటించారు.
ఈ పర్యటనలో తనకు, తన ప్రతినిధి బృందానికి లభించిన ఆతిథ్యానికి, స్నేహపూర్వక స్వాగతానికి అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సౌకర్యవంతమైన సమయంలో అధికారికంగా చిలీ పర్యటనకు రావాలని ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించారు.
***
Addressing the press meet with President @GabrielBoric of Chile.
— Narendra Modi (@narendramodi) April 1, 2025
https://t.co/6Fr9K7dUQE
यह राष्ट्रपति बोरिच की पहली भारत यात्रा है।
— PMO India (@PMOIndia) April 1, 2025
और भारत के लिए जो मित्रता का भाव, और संबंधों को मजबूत करने के लिए उनकी प्रतिबद्धता है, वह अद्भुत है।
इसके लिए मैं उनका विशेष अभिनन्दन करता हूँ: PM @narendramodi
भारत के लिए चीले लैटिन अमेरिका में एक महत्वपूर्ण मित्र और पार्टनर देश है।
— PMO India (@PMOIndia) April 1, 2025
आज की चर्चाओं में हमने आने वाले दशक में सहयोग बढ़ाने के लिए कई नए initiatives की पहचान की: PM @narendramodi
आज हमने एक पारस्परिक लाभकारी Comprehensive Economic Partnership Agreement पर चर्चा शुरू करने के लिए अपनी टीम्स को निर्देश दिए हैं।
— PMO India (@PMOIndia) April 1, 2025
Critical Minerals के क्षेत्र में साझेदारी को बल दिया जाएगा।
Resilient supply और value chains को स्थापित करने के लिए काम किया जाएगा: PM…
Digital Public Infrastructure, Renewable Energy, Railways, Space तथा अन्य क्षेत्रों में भारत अपना सकारात्मक अनुभव चीले के साथ साझा करने के लिए तैयार है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 1, 2025
हम चीले को अंटार्कटिका के Gateway के रूप में देखते हैं।
— PMO India (@PMOIndia) April 1, 2025
इस महत्वपूर्ण क्षेत्र में सहयोग बढ़ाने के लिए आज दोनों पक्षों के बीच Letter of Intent पर बनी सहमति का हम स्वागत करते हैं: PM @narendramodi
यह खुशी का विषय है कि चीले के लोगों ने योग को स्वस्थ जीवनशैली के रूप में अपनाया है।
— PMO India (@PMOIndia) April 1, 2025
चीले में 4 नवंबर को राष्ट्रीय योग दिवस घोषित किया जाना हम सभी के लिए प्रेरणादायक है।
हमने चीले में आयुर्वेद और traditional medicine में भी सहयोग बढ़ाने पर विचार किया: PM @narendramodi