Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్‌లో అతిపెద్ద డ్రోన్ వేడుక ‘భారత్ డ్రోన్ మహోత్సవ్-2022’ను ప్రారంభించిన ప్రధానమంత్రి

భారత్‌లో అతిపెద్ద డ్రోన్ వేడుక ‘భారత్ డ్రోన్ మహోత్సవ్-2022’ను ప్రారంభించిన ప్రధానమంత్రి


   భారతదేశంలో అతిపెద్ద డ్రోన్ వేడుక- “భారత్ డ్రోన్ మహోత్సవ్-2022”ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘కిసాన్ డ్రోన్’ పైలట్లతో సంభాషించడమే కాకుండా బహిరంగ డ్రోన్‌ ప్రదర్శనలను తిలకించడంతోపాటు ప్రదర్శన కేంద్రంలో అంకుర సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రమంత్రులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ అశ్వనీ వైష్ణవ్, శ్రీ మన్సుఖ్ మాండవ్య, శ్రీ భూపేంద్ర యాదవ్‌ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, డ్రోన్ పరిశ్రమల అధిపతులు,  పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి  150 డ్రోన్ పైలట్ ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేశారు.

   నంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- డ్రోన్ల రంగంపై త‌న‌కుగల ఉత్సాహాన్ని, ఆస‌క్తిని వెల్లడించారు. డ్రోన్ల రంగంలో ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల స్ఫూర్తి, ప్రస్తుత డ్రోన్‌ ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులు, యువ ఇంజనీర్లతో తన సంభాషణ, చర్చల గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. డ్రోన్ల రంగంలో ఎనలేని శక్తి, ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఈ దిశగా భారత్‌ బలాన్ని, అగ్రస్థానానికి దూసుకెళ్లాలనే తపనను ఇవి సూచిస్తున్నాయని చెప్పారు. “ఉపాధి కల్పనలో విస్తృత అవకాశాలను సృష్టించగల ప్రధాన రంగంగా ఇది ఎదుగుతుంది” అని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.

   రిగ్గా ఎనిమిదేళ్ల కిందటి నవ్యారంభాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకుంటూ- “ఇప్పటికి 8 ఏళ్ల కిందట మేం ‘కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన’ మార్గంలో సుపరిపాలన సంబంధిత కొత్త మంత్రాల అమలుకు శ్రీకారం చుట్టాం. అలాగే జీవన సౌలభ్యం, వాణిజ్య సౌలభ్యం కల్పనను మా ప్రాథమ్యాలుగా మార్చుకున్నాం. ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌’ మార్గంలో ముందడుగు వేస్తూ దేశపౌరులు ప్రతి ఒక్కరికీ సదుపాయాల కల్పనతోపాటు సంక్షేమ పథకాలను దరిజేర్చాం” అన్నారు.

   త ప్రభుత్వాల హయాంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమస్యల్లో భాగంగా పరిగణిస్తూ దాన్ని పేదల వ్యతిరేకిగా చిత్రించే ప్రయత్నాలు జరిగాయని ప్రధాని గుర్తుచేశారు. దీనివల్లనే 2014కు ముందు పాలనలో సాంకేతికత వినియోగంపై ఉదాసీన వాతావరణం నెలకొన్నదని వివరించారు. ఆ మేరకు పరిపాలన భావనలో సాంకేతిక విజ్ఞానం భాగం కాలేకపోయిందని చెప్పారు. ఫలితంగా పేదలు, అణగారిన వర్గాలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు  పడాల్సి వచ్చిందని తెలిపారు. మరోవైపు ప్రాథమిక సౌకర్యాల కోసం కూడా నానా అవస్థలూ పడాల్సి వచ్చేదని, దీంతో అవి అందవేమోననే నిరాశ, భయం జనంలో అలముకున్నాయని పేర్కొన్నారు. సంక్లిష్టమైన విధానాలను కూడా గుర్తుచేసుకున్నాడు. కాలంతోపాటు మనమూ మారితేనే ప్రగతి సాధించగలమని ఆయన స్పష్టం చేశారు. నేడు సంతృప్తత సాధనపై మరింతగా దృష్టి నిలిపి, మారుమూల ప్రజలకూ సేవా ప్రదానంపై భరోసా ఇవ్వడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడిందని చెప్పారు. ఇదే వేగంతో ముందుకు సాగితే మనం అంత్యోదయ లక్ష్యాన్ని అందుకోగలమని స్పష్టం చేశారు. దీంతోపాటు జన్‌ధన్‌, ఆధార్, మొబైల్ (జామ్) త్రయం వినియోగం ద్వారా పేదలు తమ హక్కులు పొందేలా చేయగలమని తనకు తెలుసునని చెప్పారు. ఈ మేరకు గ‌త 8 సంవ‌త్స‌రాల అనుభ‌వం తన ఈ నమ్మకాన్ని మ‌రింత సుస్థితరం చేసిందని ప్రధానమంత్రి అన్నారు. “దేశానికి సరికొత్త బలం… వేగం… విస్తృతి ఇవ్వడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మేము కీలక సాధనంగా మార్చాం” అని శ్రీ మోదీ నొక్కిచెప్పారు.

   దేశీయంగా రూపొందించిన పటిష్ఠ ‘యూపీఐ’ చట్రం తోడ్పాటుతో నేడు లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అవుతున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అలాగే మహిళలు, రైతులు, విద్యార్థులు నేడు ప్రభుత్వం నుంచి నేరుగా సహాయం పొందుతున్నారని తెలిపారు. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతటి పెను విప్లవానికి బాటలు వేస్తుందో చెప్పడానికి ‘పీఎం-స్వామిత్వ యోజన’ను ఒక ఉదాహరణగా ప్రధానమంత్రి ఉటంకించారు. ఈ పథకం కింద తొలిసారి దేశవ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ప్రతి ఆస్తినీ ‘డిజిటల్ మ్యాపింగ్’ చేసి ప్రజలకు డిజిటల్ ఆస్తి కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. “డ్రోన్ సాంకేతికతను ప్రోత్సహించడం అనేది సుపరిపాలన, జీవన సౌలభ్యం దిశగా మా నిబద్ధతను ముందుకు తీసుకెళ్లే మరొక మాధ్యమం. ఈ మేరకు సామాన్య ప్రజానీకం జీవితాల్లో భాగం కాగల అత్యాధునిక ఉపకరణాన్ని డ్రోన్‌ రూపంలో మనం పొందాం” అని ఆయన చెప్పారు.

   క్షణ, విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, పర్యాటకం, చలనచిత్ర, వినోద రంగాల్లో డ్రోన్ సాంకేతికత ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత వినియోగం మరింత పెరగడం తథ్యమన్నారు. ‘ప్రగతి’ సమీక్షలు, కేదార్‌నాథ్ ప్రాజెక్టులపై పర్యవేక్షణను ఉదాహరిస్తూ- తాను అధికారిక నిర్ణయాలు తీసుకోవడంలో డ్రోన్లు ఉపయోగపడిన తీరును కూడా ప్రధానమంత్రి వివరించారు.

   రైతుల సాధికారత, వారి జీవితాలను ఆధునికీకరణలో డ్రోన్ సాంకేతికత ప్రధాన పాత్ర పోషించనుందని ప్రధాని అన్నారు. గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్, డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి వస్తున్నప్పటికీ వ్యవసాయం నేటికీ పాత పద్ధతుల్లోనే సాగుతున్నదని చెప్పారు. ఫలితంగా అనేక చిక్కులతోపాటు ఉత్పాదకత తగ్గిపోవడమే కాకుండా పరిస్థితులు వృథాకు దారి తీస్తున్నాయని స్పష్టం చేశారు. మరోవైపు భూమి రికార్డుల నుంచి వరదలు, కరువు సాయందాకా వివిధ కార్యకలాపాల కోసం రెవెన్యూ శాఖపై నిరంతరం ఆధారపడటం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో డ్రోన్ సమర్థ సాధనంగా ఆవిర్భవించిందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి తోడ్పాటులో తీసుకున్న చర్యలవల్ల సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు ఇకమీదట  భయాందోళనలు లేకుండా పోయాయని ప్రధాని అన్నారు.

   సాంకేతిక పరిజ్ఞానం, దాని ఆవిష్కరణలు ఉన్నత వర్గాలకోసం ఉద్దేశించినవనే భావన పూర్వకాలంలో ఉండేదని ప్రధానమంత్రి గుర్తు చేశారు. అయితే, ఇవాళ సాంకేతికతను ముందుగా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. కొన్ని నెలల కిందటిదాకా డ్రోన్లపై ఎన్నో ఆంక్షలు ఉండేవని, తాము చాలా స్వల్ప కాలంలోనే అనేక పరిమితులను తొలగించామని తెలిపారు. అంతేగాక ‘పీఎల్‌ఐ’ వంటి పథకాల ద్వారా భారతదేశంలో బలమైన డ్రోన్ తయారీ పర్యావరణ వ్యవస్థ సృష్టి దిశగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు. చివరగా- “సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు చేరితే దాన్ని వినియోగించే అవకాశాలు కూడా తదనుగుణంగా పెరుగుతాయి” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

***

DS/AK

\