Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతీయ వాయు సేన మార్శల్ శ్రీ అర్జన్ సింగ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన ప్రధాన మంత్రి; ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి ఆకాంక్ష


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆరోగ్యపరంగా క్లిష్టమైన స్థితిలో ఉన్న భారతీయ వాయు సేన మార్శల్ శ్రీ అర్జన్ సింగ్ ను పరామర్శించడం కోసం న్యూ ఢిల్లీ లోని ఆర్మీ హాస్పిటల్ (రిసర్చ్ అండ్ రిఫరల్) ను సందర్శించారు. ప్రధాన మంత్రి ఈ సందర్భంగా శ్రీ సింగ్ కుటుంబ సభ్యులతో కూడా భేటీ అయ్యి, శ్రీ సింగ్ త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

‘‘ఆరోగ్యపరంగా క్లిష్టమైన స్థితిలో ఉన్న భారతీయ వాయు సేన మార్శల్ శ్రీ అర్జన్ సింగ్ ను పరామర్శించడం కోసం ఆర్ & ఆర్ హాస్పిటల్ కు వెళ్లాను. ఆయన కుటుంబ సభ్యులను కూడా కలుసుకొన్నాను.

భారతీయ వాయు సేన మార్శల్ శ్రీ అర్జన్ సింగ్ శీఘ్రంగా కోలుకోవాలని మేమందరం ప్రార్థించాం. వైద్యులు వారి వంతుగా ఉత్తమమైనటువంటి సేవలను అందిస్తున్నారు’’ అని ప్రధాన మంత్రి ట్విటర్ లో పేర్కొన్నారు.

****