Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతీయ తీర రక్షక దళం (ఐసీజీ) వ్యవస్థాపక దినోత్సవం.. ఐసీజీ విశిష్ట సేవలను అందిస్తోంది: ప్రధానమంత్రి


భారతీయ తీర రక్షక దళం (ఐసీజీవ్యవస్థాపక దినోత్సవం ఈ రోజుఈ సందర్భంగా  మన విశాల కోస్తాతీరాన్ని కాపాడడంలో ఈ దళం కనబరుస్తున్న సాహసానికీఅంకితభావానికీనిరంతర నిఘాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ దళాన్ని ప్రశంసించారునౌకావాణిజ్యానికి భద్రతను అందించడం మొదలు విపత్తు వేళల్లో రంగంలోకి దిగి అవసరమైన సహాయక చర్యలను చేపట్టడందొంగ రవాణాను కార్యకలాపాలను అరికట్టడంపర్యావరణ పరిరక్షణ చర్యలను తీసుకోవడం వరకు.. సాగర జలాలకు రక్షణను అందిస్తూసాగర జలాల సరిహద్దులకుమన ప్రజలకు అభయాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ఈ రోజుభారతీయ  తీర రక్షక దళం (ఐసీజీవ్యవస్థాపక దినోత్సవ సందర్బంగామన విశాల కోస్తాతీరాన్ని కాపాడడంలో ఈ దళం కనబరుస్తున్న సాహసానికీఅంకితభావానికీనిరంతరాయ నిఘాకు గాను మనం ప్రశంసలు అందిద్దాం.  నౌకా వాణిజ్యానికి భద్రతను అందించడం మొదలు విపత్తుల వేళల్లో రంగంలోకి దిగి అవసరమైన సహాయక చర్యలను చేపట్టడందొంగ రవాణాను అరికట్టే కార్యకలాపాలనుపర్యావరణ పరిరక్షణ చర్యలను తీసుకోవడం వరకు.. మన సముద్రాలకు ఐసీజీ దుర్భేద్య సంరక్షణను అందిస్తూమన సాగర జలాల సరిహద్దులకుమన ప్రజలకు అభయాన్నిస్తోంది’’.@IndiaCoastGuard”