భారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీప్రమాణం చేశారు. ఆయన పదవీకాలంలో అంతా మంచే జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను.’’
Attended the oath taking ceremony of Justice Sanjiv Khanna, who has been sworn in as the Chief Justice of the Supreme Court of India. My best wishes for his tenure. pic.twitter.com/6CxGG6Vao0
— Narendra Modi (@narendramodi) November 11, 2024