Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశ రాష్ట్రపతి పదవీబాధ్యతలను స్వీకరించి ఒక సంవత్సరం పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆయన కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


భారతదేశ రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ పదవీబాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

‘‘పదవీబాధ్యతలు చేపట్టి ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకొన్న సందర్భంలో రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గారికి ఇవే నా అభినందనలు. ఆయన తన జ్ఞానం తో, వినయం తో భారతదేశంలో ప్రతి ఒక్కరికీ తనను తాను ప్రీతిపాత్రుని గా మలచుకొన్నారు. కీలకమైన, విధానపరమైన అంశాలలో ఆయనకు ఎంతో పట్టు ఉంది. యువత కు, రైతులకు మరియు పేద ప్రజలకు సాధికారిత ను సమకూర్చే విషయం లో సైతం రాష్ట్రపతి గారు అమిత ఉత్సాహం కలవారు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

*****