Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశాని కి చెందిన ఫుట్ బాల్ క్రీడాకారుడు శ్రీ సునీల్ ఛెత్రీ కి మూడో అత్యధికగోల్స్ చేసిన క్రియాశీల పురుషుల అంతర్జాతీయ క్రీడాకారుని గా గుర్తింపు ను ఇవ్వడం పట్లహర్షాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 


భారతదేశానికి చెందిన ఫుట్ బాల్ క్రీడాకారుడు శ్రీ సునీల్ ఛెత్రీ మూడో అత్యధిక గోల్స్ ను చేసిన క్రియాశీల పురుషుల అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుని గా గుర్తింపు ను ఇచ్చినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

ఫీఫా వరల్డ్ కప్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబిస్తూ మరొక ట్వీట్ లో –

‘‘చాలా బాగుంది శ్రీ సునీ ఛెత్రీ. ఇది తప్పక భారతదేశం లో ఫుట్ బాల్ క్రీడ కు లోకప్రియత్వాన్ని పెంచుతుంది. @chetrisunil11’’ అని పేర్కొన్నారు.