Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం సైన్యం కోసం మెరుగుపరచిన ఆకాశ్ఆయుధ వ్యవస్థ ను మరియు సమతల భూక్షేత్రాల లో ఆయుధాల జాడల ను గుర్తించేటటువంటి రేడార్లు స్వాతి రకానికి చెందినవి పన్నెండింటి ని సేకరించడం కోసం 9,100 కోట్ల రూపాయల కుపైగా విలువ కలిగిన ఒప్పందాలను కుదుర్చుకొన్న రక్షణ మంత్రిత్వ శాఖ


భారతదేశం సైన్యం కోసం మెరుగులు దిద్దినటువంటి ఆకాశ్ ఆయుధ వ్యవస్థ ను, సమతల భూక్షేత్రాల లో ఆయుధాల జాడల ను గుర్తించేటటువంటి రేడార్ లు (డబ్ల్యుఎల్ఆర్) స్వాతి రకానికి చెందినవి పన్నెండింటి ని సేకరించడం కోసం మొత్తం 9,100 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ఒప్పంద పత్రాల పైన రక్షణ మంత్రిత్వ శాఖ 2023 మార్చి నెల 30వ తేదీ నాడు సంతకాలు చేసినట్లు రక్షణ మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో తెలిపింది.

 

ఆర్ఎమ్ఒ ఇండియా ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ –

‘‘ఇది ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామం, ఇది ఆత్మనిర్భరత ను పెంపొందింపచేసేటటువంటిది; మరీ ముఖ్యం గా ఎమ్ఎస్ఎమ్ఇ రంగాని కి సహాయకారి అవుతుందీనూ.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

****

DS/ST