భారతదేశం- రష్యా: మారుతున్న ప్రపంచం లో సహనశీల భాగస్వామ్యం
1. ఏటా జరిగే ద్వైపాక్షిక శిఖర సమ్మేళనాలలో భాగంగా 19వ పర్యాయపు సమ్మేళనానికై భారతదేశం ప్రధాన మంత్రి, శ్రేష్ఠుడు శ్రీ నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ వ్లాదిమీర్ వి. పుతిన్ లు 2018వ సంవత్సరం అక్టోబర్ 4వ, 5వ తేదీ లలో న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు. భారతదేశ గణతంత్రం మరియు సోవియట్ యూనియన్ ల మధ్య 1971 లో కుదిరిన శాంతి, మైత్రి మరియు సహకార ఒప్పందం, భారతదేశ గణతంత్రం మరియు రష్యన్ ఫెడరేశన్ ల మధ్య 1993 లో కుదిరిన స్నేహం మరియు ఒప్పందం, భారతదేశ గణతంత్రం- రష్యన్ ఫెడరేశన్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై 2000 లో జారీ చేసిన ప్రకటన, ఈ భాగస్వామ్యాన్ని ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం గా ప్రకటిస్తూ 2010 లో జారీ చేసినటువంటి ఉమ్మడి ప్రకటన లు అనే బలమైన పునాదుల మీద భారతదేశం- రష్యా సహకారం ఏర్పడింది. భారతదేశానికి, రష్యా కు మధ్య రాజకీయ, వ్యూహాత్మక సహకారం అనే మౌలిక స్తంభాల పైన నిలబడ్డ ఈ సహకారం పరిధి విస్తృతమైనటువంటిది. ఇది సైనికపరమైన, భద్రతపరమైన సహకారం, ఆర్ధిక, ఇంధన, పారిశ్రామిక , విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం మరియు సాంస్కృతిక సహకారం, ఇంకా మానవతపూర్వకమైన సహకారం వంటి రంగాలకు కూడా విస్తరించింది.
2. అంతర్జాతీయ దౌత్య సంబంధాల లో నిరుపమానమైందిగా పేర్కొనదగిన ఇష్టాగోష్టి సమావేశం రెండు దేశాల అధినేతల మధ్య మే 21, 2018న సోచి లో జరిగింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు శ్రీ పుతిన్ ల మధ్య ఉన్న పరస్పర విశ్వాసాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోంది. ఈ సమావేశానికి రెండు దేశాలు ఉన్నత స్థానం ఇచ్చి సమకాలీన ప్రాధాన్యాన్ని, వైశిష్ట్యాన్ని గుర్తించాయి. రెండు దేశాల మధ్య క్రమం తప్పకుండా సమావేశాలు జరగాలని, ఉమ్మడి ప్రయోజనం కలిగే అంశాలపై తరచుగా సంప్రదింపులు జరుపుకోవాలనే అభిలాష ను ఇరు దేశాలు వ్యక్తం చేశాయి. అంతేకాక ఈ సమావేశం పరస్పర సమన్వయం మరింత పెంపొందడానికి, అన్ని ప్రధాన అంశాలపై అభిప్రాయాల కలబోత కు కూడా తోడ్పడింది. బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ నిర్మాణానికి భారతదేశం, రష్యా ల మధ్య సంబంధాలు మరియు సహకారం పాత్ర ను సోచి శిఖరాగ్ర సభ స్పష్టం చేసింది. ఇటువంటి ఇష్టాగోష్ఠి సమావేశాలు జరపడాన్ని కొనసాగించాలని, అన్ని స్థాయి లలో క్రమం తప్పకుండా వ్యూహాత్మక రాక పోక లు, సమాచార ఆదాన ప్రదానం జరగాలని ఉభయ పక్షాలు అంగీకరించాయి.
3. భారతదేశం, రష్యా ల మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు రెండు పక్షాలు పునరుద్ఘాటించాయి. ప్రపంచ శాంతి కి మరియు సుస్థిరత కు రెండు దేశాల మధ్య సంబంధం ముఖ్యమైందని వారు ప్రకటించారు. ప్రపంచం లో శాంతి , సుస్థిరత ల స్థాపన లో బలమైన శక్తులు గా ఉమ్మడి బాధ్యతలతో ఇరు దేశాలు పోషిస్తున్న పాత్ర ను ఉభయులు పరస్పరం అభినందించుకున్నారు.
4. తమ మధ్య సంబంధం పరిణతి చెందిందని మరియు అంతరంగికమని, అన్ని రంగాలకు విస్తరించిందని మరియు గాఢమైన విశ్వాసం తోను, పరస్పర గౌరవం తోను కూడుకుని, ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉందని ఇరు పక్షాలు అంగీకరించాయి. బహుళ సంస్కృతి, బహు భాషా, బహుమత సమాజాలు కావడం వల్ల భారతదేశం, రష్యా లు నాగరకత ద్వారా తమకు సంక్రమించిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆధునిక సవాళ్ళ ను ఎదుర్కొంటున్నాయి. మరిన్ని అంతర్ సంబంధాలు మరియు వైవిధ్య ప్రపంచం సృష్టి కి రెండు దేశాలు కలసికట్టుగా తోడ్పడుతాయి.
5. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించడానికి మరియు సహనం, సహకారం, పారదర్శకత, అంతర్ – రాజ్య సంబంధాలలో నిష్కపటత్వం పెంపొందించడానికి అన్ని దేశాలు కృషి చేయాలని ఇరు పక్షాలు పిలుపు ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చోట్ల ఎదురవుతున్న ప్రాథమిక సవాలు సత్వర , పర్యావరణ హితకరమైన ఆర్ధిక వృద్ది, పేదరిక నిర్మూలన , రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రాలలో అసమానతలను తొలగించడం మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కల్పించడం గురించి వారు నొక్కిపలికారు. ఈ లక్ష్యాల సాధన కు ఒకరికి మరొకరం సహకరించుకుందామని భారతదేశం, రష్యా లు ప్రతిన పూనాయి.
6. అన్ని రంగాలలో రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రం చేయడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రిత్వ స్థాయి లో 50 కి మించి పర్యటనలు జరపడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. 2017 – 18 కాలానికి విదేశీ కార్యాలయం సంప్రదింపుల పై కుదిరిన ప్రోటోకాల్ విజయవంతంగా ముగియడం తో సంప్రదింపుల కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని అంగీకరించడమే గాక ఈ మేరకు ఒక అధికార పత్రంపై సంతకాలు కూడా చేశారు.
7. ఎకాటరిన్ బర్గ్ మరియు అస్త్రఖాన్ లలో భారత కాన్సల్ జనరల్స్ నియామకాన్ని రష్యా స్వాగతించింది. రెండు దేశాలకు చెందిన ఆయా ప్రాంతాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడడానికి ఈ నియామకం దోహదం చేస్తుంది. 2018- 2020 మధ్య కాలానికి ఉమ్మడి కార్యాచరణ ను అమలు చేసేందుకు భారతదేశ హోం మంత్రిత్వ శాఖ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కు, రష్యన్ ఫెడరేశన్ అంతరంగిక మంత్రిత్వ శాఖ కు మధ్య కుదిరిన ఒప్పందంతో సహా ఆంతరంగిక భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయం చేయడం వంటి అంశాలపై సంబంధిత అధికారుల మధ్య 2017 నవంబర్ మాసం లో కుదిరిన ఒప్పందాలను ఇరు పక్షాలు స్వాగతించాయి.
ప్రకృతి వైపరీత్యాల వేళ అవలంబించవలసిన నిర్వహణ పద్ధతులలో రష్యా కు ఉన్న సాంకేతిక అనుభవాన్ని భారతదేశం గుర్తించింది. ఈ రంగం లో సహకారం పెంపొందడానికి శిక్షణార్థులకు శిక్షణ ను ఇప్పించాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యవసరంగా స్పందించే వ్యవస్థ నిర్మాణం చేయాలని అభిప్రాయపడ్డారు.
8. భారతదేశం, రష్యా ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జరిగిన వార్షికోత్సవాలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల రెండు దేశాలకు చెందిన అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వార్షికోత్సవాలలో రెండు దేశాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది ప్రజలకు, ప్రజలకు మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య 2017 లో సంతకాలు జరిగిన సాంస్కృతిక ఆదాన ప్రదానం కార్యక్రమం అమలైన తీరు పట్ల ఉభయులు సంతృప్తి ని వ్యక్తం చేశారు. భారతదేశం లో ప్రతి ఏటా రష్యా ఉత్సవాలు, అదే విధంగా రష్యా లో భారతదేశం ఉత్సవాలు జరగడాన్ని వారు స్వాగతించారు. అదే విధంగా యువ బృందాల రాక పోక లు, రచయితల బృందాల రాక పోకలు, జాతీయ చిత్రోత్సవాలకు పరస్పరం మద్దతివ్వడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు ను వారు ప్రశంసించారు.
గత రెండేళ్ల లో రెండు దేశాలకు పర్యటకుల సంఖ్య పెరగడాన్ని వారు హర్షించారు. ఈ సానుకూల వైఖరి కొనసాగి పర్యటకుల సంఖ్య పెరిగేందుకు వీలుగా అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి ఉభయులు అంగీకరించారు. 2018 లో ఫిఫా వరల్డ్ కప్ పోటీ లను విజయవంతంగా నిర్వహించినందుకు రష్యా ను భారతదేశం అభినందించింది.
గడిచిన అనేక దశాబ్దాలుగా భారతదేశం- రష్యా సంబంధాలను ప్రోత్సహించడానికి రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ అందించిన సహకారాన్ని వారు గుర్తించారు. ఆ ఇన్ స్టిట్యూట్ ద్వి శత వార్షికోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి భారతదేశం తోడ్పాటు ను అందిస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
ఆర్థిక రంగం
9. మాస్కో లో 2018 సెప్టెంబర్ 14వ తేదీ న జరిగిన భారత్- రష్యా అంతర్ ప్రభుత్వం వాణిజ్య ఆర్థిక శాస్త్ర సాంకేతిక మరియు సాంస్కృతిక సహకార కమిశన్ 23వ సమావేశం నిర్ణయాల పట్ల రెండు పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సమావేశానికి రష్యన్ ఫెడరేశన్ ఉప ప్రధాని శ్రీ యురి ఐ. బోరిసోవ్ మరియు భారత విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ సహ అధ్యక్షత వ్యవహరించారు.
10. 2025 వ సంవత్సరం నాటికి రెండు వైపులా పెట్టుబడులను 3,000 కోట్ల అమెరికా డాలర్ల మేర పెంచాలన్న లక్ష్యంపై జరిగిన ప్రగతి ని సమీక్షించి సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఆ లక్ష్యాన్ని చేరే దిశ లో రెండు దేశాలూ సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. 2017 లో ద్వైపాక్షిక వాణిజ్యం 20 శాతం కన్నా ఎక్కువగా పెరిగిందని వారు గుర్తించారు. అంతేకాక మరింత పెరగడం తో పాటు వైవిధ్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని అంగీకరించారు. జాతీయ కరెన్సీ లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు తమ మద్దతు ను ప్రకటించాయి.
11. వ్యూహాత్మక ఆర్థిక సంప్రదింపు లపై చర్చ లకు సంబంధించి భారతదేశ నీతి ఆయోగ్ మరియు రష్యన్ ఫెడరేశన్ ఆర్థికాభివృద్ధి మంత్రిత్వ శాఖ మధ్య మొదటి సమావేశం 2018 చివర లో జరుగుతుంది.
12. యూరేశియా ఆర్థిక సంఘం మరియు దాని సభ్యత్వ దేశాలు ఒకవైపు, భారతదేశ గణతంత్రం మరో వైపు ఉండి రెండు పక్షాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు ప్రారంభం కావడాన్ని రెండు దేశాలు స్వాగతించాయి.
13. వాణిజ్య, ఆర్థిక సంబంధాలు వృద్ధి మరియు పెట్టుబడులకు సహకరించుకోవడం పై వ్యూహాత్మక కార్యాచరణ కు ఉమ్మడి అధ్యయనం ప్రారంభించడాన్ని వారు మెచ్చుకున్నారు. దీని కొనసాగింపు లో భాగంగా భారతదేశం వైపు నుండి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మరియు రష్యా నుండి ఆల్ రష్యన్ అకాడమీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ను నామినేట్ చేశారు.
14. పరస్పరం పెట్టుబడులు పెంచడానికి “ఇన్ వెస్ట్ ఇండియా” చేసిన కృషి ని మరియు రష్యా లో భారతీయ కంపెనీల సౌకర్యం కోసం రష్యా ఆర్థికాభివృద్ది మంత్రిత్వ శాఖ “సింగిల్ విండో సర్వీసు”ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుండడాన్ని వారు మెచ్చుకున్నారు.
15. ఢిల్లీ లో అక్టోబర్ 4వ, 5వ తేదీలలో జరిగిన 19వ వార్షిక శిఖర సమ్మేళనం తో పాటు ఇండియా- రష్యా బిజినెస్ సమిట్ ను కూడా ఏర్పాటు చేయడాన్ని రెండు దేశాలు స్వాగతించాయి. ఈ శిఖర సమ్మేళనం లో రెండు దేశాల వ్యాపార ప్రతినిధివర్గాలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నాయి. ద్వైపాక్షిక సహకారం లో కీలక రంగాలకు చెందిన ప్రతినిధివర్గాలు ఈ సమ్మేళనం లో పాల్గొనడం వల్ల , రెండు దేశాల వ్యాపార వర్గాలు ఆర్ధిక, వాణిజ్య , పెట్టుబడి భాగస్వామ్యం లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారనే బలమైన సంకేతాలు వెల్లడి అయ్యాయి.
16. గనులు, లోహ సంగ్రహణం, విద్యుత్తు, చమురు- వాయువు, రైల్వేలు, ఔషధులు, ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ, రసాయనాలు, మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, విమానయానం, అంతరిక్షం, నౌకానిర్మాణం, వివిధ యంత్ర పరికరాల ఉత్పత్తి రంగాలలో ప్రాధాన్యం పెట్టుబడి ప్రాజెక్టులు అమలవుతున్న తీరు లో ప్రగతి ని రెండు దేశాలు సమీక్షించాయి. అడ్వాన్స్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యం లో రష్యా లో ఔషధాల తయారీ కర్మాగారం ఏర్పాటు కావడం పై హర్షం వ్యక్తం చేశారు. రష్యా నుండి ఎరువుల దిగుమతులను పెంచాలన్న తమ ఉద్దేశ్యాన్ని భారత బృందం తెలియజేసింది. అల్యూమినియం రంగం లో సహకారం మరింత విస్తరణకు గల ప్రాముఖ్యాన్ని రెండు పక్షాలు గుర్తించాయి.
17. భారతదేశానికి చెందిన జాతీయ లఘు పరిశ్రమల సంస్థ (ఎన్ఎస్ఐసి) మరియు రష్యా కు చెందిన చిన్న మరియు మధ్యతరహా వ్యాపార సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరి సంతకాలు చేయడాన్ని వారు స్వాగతించారు.
18. మౌలిక సదుపాయాల అభివృద్ధి జాతీయ ప్రాధాన్యాల లో రెండు దేశాలకు ముఖ్యమైందని, ఈ రంగం లో సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని రెండు బృందాల ప్రతినిధులు ఉద్ఘాటించారు. భారతదేశం లో రహదారులు మరియు రైల్వేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు స్మార్ట్ సిటీలు, వ్యాగన్ ల నిర్మాణం, ఉమ్మడి రవాణా లాజిస్టిక్స్ కంపెనీ స్థాపన తో పాటు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ది కి రష్యా కంపెనీలను భారత బృందం ఆహ్వానించింది.
పైన తెలిపిన పారిశ్రామిక కారిడార్ల ఆకృతి రూపకల్పన తో పాటు భారతదేశం లో ఉమ్మడి ప్రాజెక్టుల ఆవిర్భావానికి , భారతదేశం కోసం సుంకాల వసూలు కు సంబంధించి ఉపగ్రహ ఆధార సాంకేతిక సాధనాలకు సంబంధించి తమ ప్రావీణ్యాన్ని అందిస్తామని రష్యా బృందం తెలిపింది.
రైల్వేల వేగాన్ని పెంచడానికి సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినప్పుడు భారతదేశ రైల్వేల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ బిడ్ లను ఆహ్వానిస్తే వాటిలో పాల్గొనాలన్న ఆసక్తిని రష్యా వ్యక్తం చేసింది.
రవాణా సంబంధిత విద్య, సిబ్బంది శిక్షణ మరియు అంతర్జాతీయ రవాణా కారిడార్ల అమలు లో సాంకేతిక సహకారానికి గల ప్రాముఖ్యాన్ని రెండు బృందాలు గుర్తించాయి. ఇందుకోసం భారతదేశం లోని వడోదర లో గల నేశనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోర్టేశన్ ఇన్ స్టిట్యూట్ మరియు రష్యన్ యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ (ఎంఐఐటి)లు సహకరించుకోవాలని రెండు బృందాలు అభిప్రాయపడ్డాయి.
19. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంబంధాలను మరియు రాకపోక లను ప్రత్యేకంగా గుర్తించారు. అందువల్ల రెండు దేశాల మధ్య కస్టమ్స్ అధికారులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించడం, రహదారి మరియు రైలు మార్గాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వెసులుబాటు ను కల్పించడం వంటి చర్యలను వేగవంతం చేయడమేకాక వీలైనంత త్వరగా పొరుగున ఉన్న భాగస్వామ్య దేశాలతో చర్చలు జరపడం ద్వారా ఇంటర్ నేశనల్ నార్త్ సౌత్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్ టిసి)ని అభివృద్ధి చేయాలని వారు పిలుపునిచ్చారు. భారతీయ సరుకులను ఇరాన్ మీదుగా రష్యా కు రవాణా చేయడానికి సంబంధించి మాస్కోలో జరిగే ‘రవాణా సప్తాహం – 2018’ సందర్భంగా భారతదేశం, రష్యన్ ఫెడరేశన్, ఇరాన్ ల మధ్య త్రైపాక్షిక చర్చలు జరపాలన్న ప్రతిపాదన ను రెండు దేశాలు స్వాగతించాయి. సరుకుల అంతర్జాతీయ రవాణా కు సంబంధించి తమకు లభించిన ఆమోదాన్ని గురించి భారతీయ బృందం రష్యా బృందానికి తెలియజేసింది. ఐఎన్ఎస్ టిసి ఏర్పాటు కు సంబంధించి మంత్రిత్వ మరియు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్య క్రమం లో ప్రయత్నాలను ప్రారంభించాలని రెండు బృందాలు అంగీకరించాయి.
20. సరుకులు రవాణా జరిగే సమయంలో తనిఖీ ల వల్ల జాప్యం జాప్యం జరగకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తదనుగుణంగా ఎగుమతులు, దిగుమతులు జరిగేటప్పుడు ఉత్పత్తుల రవాణా లో జాప్యం జరగకుండా తనిఖీలను తగ్గించాలని అంగీకరించారు.
21. వాణిజ్య ప్రదర్శనలు మరియు మేళాలు జరిగేటప్పుడు వాటిని నిర్వహించే సంస్థ లు, ఎగుమతి ప్రోత్సాహక మండలులు మరియు ఇతర ఎగుమతి సంబంధిత సంస్థలకు సంబంధించిన వివరాలను ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా వారి మధ్య సంబంధాలు, రాక పోక లను పెంచాలని అభిప్రాయపడ్డారు.
22. భారతదేశం నుండి రష్యా కు సరుకుల రవాణా సందర్భంగా రవాణా లో కస్టమ్స్ కార్యకలాపాల ను సులభతరం చేయాలని, ఇందుకోసం గ్రీన్ కారిడార్ ప్రాజెక్టు ను వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ప్రతిపాదన కు రెండు పక్షాలు మద్దతు తెలిపాయి. ఇది రెండు దేశాల మధ్య పరస్పర వాణిజ్యం పెరిగేందుకు ముఖ్యమైన చర్య అని వారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైన తరువాత రెండు దేశాల కస్టమ్స్ అధికారులు ప్రాజెక్టు ను మరింత విస్తరణ కు పూనుకోవచ్చు.
23. భారతదేశం లోని వివిధ రాష్ట్రాలు, రష్యన్ ప్రాంతాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేసి సంస్థాగతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను రెండు బృందాలు ప్రశంసించాయి. భారతదేశ గణతంత్రం లోని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలతో ప్రాంతాలు, రష్యన్ ఫెడరేశన్ లోని సభ్యత్వ రిపబ్లిక్ లతో సంబంధాలను పెంపొందించుకొనేందుకు రెండు వైపులా ఉన్న వ్యాపార, పారిశ్రామిక మరియు ప్రభుత్వ సంస్థల మధ్య ప్రత్యక్ష సంబంధాలు తీవ్రతరం చేయాలని వారు నిర్దేశించారు. అసమ్ మరియు సఖాలిన్ , హరియాణా మరియు బాస్కోర్తోస్తాన్, గోవా మరియు కాలినిన్ గ్రాడ్, ఒడిశా మరియు ఇర్కుట్స్క్, విశాఖపట్నం మరియు వ్లాదివొస్తోక్ ల మధ్య ఒప్పందాలకు సంబంధించి జరుగుతున్న ప్రయత్నాలను రెండు పక్షాలు స్వాగతించాయి.
సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్ నేశనల్ ఎకనామిక్ ఫోరమ్, ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం, పార్ట్ నర్ శిప్ ఇన్ వెస్ట్ మెంట్ సమిట్ ల వంటి భారీ సమావేశాలకు ప్రాంతీయ ప్రతినిధులు పాలుపంచుకొనేటట్టు చూడాలని ఇరువురు అంగీకరించారు. అంతేకాక ఇండియా-రష్యా ఇంటర్ రీజనల్ ఫోరమ్ ను నిర్వహించాలనే ప్రతిపాదనను స్వాగతించారు.
24. ప్రకృతి వనరులను ఉత్పాదకత, సమర్థత తో ఆర్థికంగా లాభకరమైన రీతిలో వినియోగించుకోవడానికి ఉమ్మడి గా అన్వేషణ జరపాలని, ఒరికి మరొకరు సహరించుకొనే రీతి లో ఉమ్మడి గా ప్రాజెక్టు లను ప్రారంభించాలని అంగీకరించారు. ఇందుకోసం ప్రాకృతిక వనరులను పర్యావరణ హితకరమైన రీతిలో వినియోగించుకొంటూ, భరించగలిగే వ్యయం చేసి సముచితమైన అనువర్తిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అంగీకరించారు. రెండు దేశాల మధ్య సహకారానికి వ్యవసాయం మరో ముఖ్యమైన రంగం గా వారు గుర్తించారు. ఇందుకోసం వాణిజ్య పరమైన అడ్డంకుల ను తొలగించి ఉత్పత్తి పెంపు, వాణిజ్య వృద్ది కి కట్టుబడి ఉన్నామని అన్నారు.
25. వజ్రాల రంగం లో సాధించిన సహకార స్థాయి ని రెండు వర్గాలు ప్రశంసించాయి. ముఖ్యంగా ముడి వజ్రాల సరఫరా కు భారతీయ కంపెనీ లతో పిజెఎస్ సి ఎఎల్ ఆర్ ఒఎస్ ఎ సంస్థ దీర్ఘకాలిక కాంట్రాక్టు ను కుదుర్చుకోవడమే కాక ముంబయి లో ఎఎల్ ఆర్ ఒఎస్ ఎ ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించారు. భారతీయ మార్కెట్ తో సహా వజ్రాల జినెరిక్ మార్కెటింగ్ కు సంబంధించిన కార్యక్రమాలను వృద్ధి చేయడానికి సంబంధించి ఉమ్మడి ఆర్థిక సహాయం చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. రష్యా దూర ప్రాచ్యం లో ఇటీవల భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని రెండు పక్షాలు ఈ సందర్భంగా ప్రస్తావించాయి.
అమూల్య లోహాలు, ఖనిజాలు, ప్రాకృతిక వనరులు, కలప తో సహా అటవీ సంపద ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు నిపుణులైన పనివారి కి శిక్షణ ఇవ్వడం వంటి వాటిలో ఉమ్మడి సహకారానికి గల అవకాశాలను అన్వేషించాలని రెండు పక్షాలు అంగీకరించాయి.
26. రష్యా దూర ప్రాచ్యం లో పెట్టుబడులు పెట్టాలని రష్యా బృందం భారత బృందాన్ని కోరింది. ముంబయి లో దూర ప్రాచ్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని భారతదేశ బృందం స్వాగతించింది.
వాణిజ్యం, పరిశ్రమ, ఇంకా పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ సురేష్ ప్రభు నాయకత్వం లో రష్యా కు వెళ్ళిన భారత ప్రతినిధివర్గం సెప్టెంబర్ 2018 లో వ్లాదివొస్తోక్ లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సమావేశం లో పాల్గొంది. దూర ప్రాచ్యం లో భారత్ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉన్నత స్థాయి రష్యా ప్రతినిధి వర్గం భారతదేశం లో పర్యటన జరిపి పెట్టుబడులను ఆకర్షించేందుకు రోడ్ శో లను నిర్వహిస్తుంది.
27. రైల్వేలు, ఇంధనం తదితర రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టు లను మూడో దేశం లో చేపట్టాలని రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.
విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన రంగం
28. విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన రంగాల లో సహకారాన్ని మరింత పెంపొందించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని రెండు పక్షాలు గుర్తించాయి. 2018 ఫిబ్రవరి లో రెండు దేశాల మంత్రిత్వ శాఖ ల పర్యవేక్షణ లో ఇండియా రష్యా శాస్త్ర సాంకేతిక అధ్యయన బృందం 10వ సమావేశం విజయవంతంగా నిర్వహించడాన్ని వారు స్వాగతించారు.
29. రెండు దేశాల శాస్త్ర సాంకేతిక శాఖ ల సమన్వయం తో మౌలిక మరియు అనువర్తిత శాస్త్రాలలో జరుగుతున్న ఉమ్మడి పరిశోధనల 10వ వార్షికోత్సవం జూన్ 2017లో జరిగింది. భారత శాస్త్ర సాంకేతిక శాఖ మరియు రష్యా సైన్స్ ఫౌండేశన్ ల మధ్య సమన్వయం సంతృప్తికరమైన రీతి లో కొనసాగడం పట్ల రెండు ప్రతినిధివర్గాలు సంతృప్తి ని వ్యక్తం చేశాయి.
వివిధ ప్రయోగశాలలు, విద్యాసంస్థలు, విద్యావేత్తలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంబంధ సంఘాలు ఉమ్మడి ప్రాధాన్యం గల సాంకేతిక రంగాల వారితో కలసి సహకార దిశా నిర్దేశం చేయడానికి శాస్త్ర సాంకేతిక రంగాలలో వినూత్న కల్పనల కోసం భారతదేశ గణతంత్రం మరియు రష్యన్ ఫెడరేశన్ ల సమీకృత దీర్ఘకాలిక కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని గుర్తించారు.
30. ఇన్ ఫర్మేశన్ అండ్ కమ్యూనికేశన్స్ టెక్నాలజీ రంగం లో సహకారాన్ని మరింత విస్తరించడానికి రెండు పక్షాలు అంగీకరించాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ , సాఫ్ట్ వేర్ డివెలప్ మెంట్, సూపర్ కంప్యూటింగ్ , ఇ-గవర్నమెంట్, ప్రజా సేవల పంపిణీ , నెట్ వర్క్ సెక్యూరిటీ, ఇన్ ఫర్మేశన్ అండ్ కమ్యూనికేశన్ టెక్నాలజీ ల వినియోగంలో భద్రత, ఫైన్ –టెక్ , ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్, ప్రామాణికత, రేడియో కంట్రోల్ మరియు రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ నియంత్రణ సహకారాన్ని పెంపొందించుకోవాలని అంగీకరించారు. బిఆర్ ఐసిఎస్ (బ్రిక్స్), ఇంకా ఐటియు ల వంటి అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాల మధ్య ఉమ్మడి సహకారాన్ని కొనసాగించాలని కూడా ఉభయులు తీర్మానించారు.
31. న్యూ ఢిల్లీ లో మార్చి 2018లో రెండు దేశాల మంత్రుల మధ్య కుదిరిన ఉమ్మడి ప్రకటన “ఇండియా – రష్యా ఆర్ధిక సహకారం: భవిష్య మార్గం” అనే సంయుక్త ప్రకటన పై సంతకాలు చేయడాన్ని రెండు పక్షాలు స్వాగతించాయి. భారతదేశ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి సురేష్ ప్రభు , రష్యన్ ఫెడరేషన్ ఆర్దికాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మాక్సిం వొరెశ్కిన్ లు సంయుక్త ప్రకటన పై సంతకాలు చేశారు. వచ్చే డిసెంబర్ లో ఢిల్లీ లో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), రష్యా కు చెందినా స్కోల్కొవొ ఫౌండేశన్ ల ఆధ్వర్యంలో భారతదేశం, రష్యా ల స్టార్ట్- అప్ సంస్థ ల సభ ను నిర్వహించాలన్న నిర్ణయాన్ని వారు ప్రశంసించారు. అంతే కాక అంకుర సంస్థలు, పెట్టుబడిదారులు స్టార్ట్- అప్ సంస్థలను ప్రోది చేసే వారు, యువ పారిశ్రామికవేత్తల మధ్య సంబంధాలను పెంచేందుకు ఒక పోర్టల్ ను ప్రారంభించాలన్న యోచనను వారు స్వాగతించారు. ఇది రెండు దేశాలకు చెందిన వారి మధ్య సంబంధాలు పెరగడానికి తద్వారా స్టార్ట్- అప్ సంస్థలు విశ్వవ్యాప్తం కావడానికి దోహదం చేస్తుంది.
32. అంతరిక్ష రంగం లో రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సహకారాన్ని దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ఉభయ పక్షాలు గుర్తించాయి. రెండు దేశాల్లో పరస్పర ప్రయోజనం కోసం డాటా కలెక్షన్ గ్రౌండ్ స్టేశన్ ల ఏర్పాటు ను స్వాగతించారు. రష్యా లో భారత ‘నావిక్’ వ్యవస్థ ను, భారత్ లో రష్యా ‘జిఎల్ ఒఎన్ఎఎస్ఎస్’ వ్యవస్థ ను ఏర్పాటు చేస్తారు. అంతరిక్ష పరిశోధన లను శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని, మనుష్యులను అంతరిక్షం లోకి పంపడానికి సంబంధించిన కార్యక్రమాలను, విజ్ఞాన శాస్త్ర పథకాలతో పాటు బ్రిక్స్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ రాశి అభివృద్ధి కి కూడా సహకారాన్ని కొనసాగించాలని అంగీకరించారు.
33. ఉమ్మడి శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించాలనే ఆసక్తి ని రెండు పక్షాలు వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా అంటార్కిటికా ప్రాంతంలో భారతదేశం, రష్యా ల శాస్త్రవేత్త ల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సహకారం పట్ల వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు.
34. రెండు దేశాల కు చెందిన ఉన్నత విద్య సంస్థల మధ్య సంబంధాలను విస్తరించాలని వారు ఈ సందర్భంగా గుర్తించారు. 2015 లో ప్రారంభించిన భారతదేశం, రష్యా ల విశ్వవిద్యాలయాల నెట్ వర్క్ ఇప్పటికి మూడు సార్లు సమావేశమైంది. ఈ నెట్ వర్క్ కారణం గా రెండు దేశాల కు చెందిన ఉన్నత విద్య సంస్థ ల మధ్య సంబంధాల పెరుగుదల కు దోహదపడిందని వారు గుర్తించారు. దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలను ఇరు పక్షాలు గుర్తించాయి. ఈ నెట్ వర్క్ లో 42 విద్య సంస్థ లకు సభ్యత్వం ఉంది. ఈ యంత్రాంగం వల్ల అధ్యాపకులు మరియు విద్యార్థుల మార్పిడి కి ఉమ్మడి శాస్త్రీయ, విద్య సంబంధ ప్రాజెక్టు లపై పని చేయడానికి వీలవుతుంది.
శక్తి
35. రష్యా శక్తి రంగ ఆస్తులు, సహజ వాయువు, నవీకరణీయ శక్తి వనరుల రంగం లో చేపట్టిన సంయుక్త ప్రాజెక్టుల విషయంలో భారతదేశం వైపు ప్రయోజనాలను పరిగణన లోకి తీసుకొని భారతదేశం, రష్యా ల మధ్య శక్తి రంగ సహకారాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరాన్ని ఉభయ పక్షాలూ గుర్తించాయి.
36. శక్తి రంగం లో పరస్పర ప్రయోజనకర సహకారానికి గల సామర్ధ్యాన్ని ఉభయ పక్షాలూ గుర్తించాయి. అలాగే ఇరు దేశాలలో దీర్ఘకాలిక కాంట్రాక్టు లను కుదుర్చుకోవడం, జాయింట్ వెంచర్ లు, శక్తి వనరుల క్షేత్రాల సమీకరణ కు ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించవలసింది గా తమ కంపెనీ లను రెండు దేశాలూ ప్రోత్సహించడం జరిగింది. అంతేకాదు, తృతీయ దేశాలలో సహకారానికి గల అవకాశాలను పరిశీలించాలని కూడా నిర్ణయించాయి.
37. భారతదేశం, రష్యా శక్తి రంగ కంపెనీ ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సహకారాన్ని ఉభయ దేశాలూ స్వాగతించాయి. ఇందులో ఇండియన్ కన్సార్టియం పెట్టుబడులు వాంకోర్‌నెఫ్ట్‌లో లో పెట్టడం, టాస్- రష్యా లోని యుర్యాక్ నెఫ్టెగ, ఎస్సార్ ఆయిల్ కేపిటల్ లొ పిజెఎస్‌సి రాస్‌నెఫ్ట్ ఆయిల్ కంపెనీ పాలుపంచుకోవడం వంటివి ఉన్నాయి. వాకోర్ క్లస్టర్‌కు సంబంధించిన చర్చలు వీలైనంత త్వరగా పూర్తి కాగలవన్న ఆకాంక్షతో పాటు, సమగ్ర సహకారానికి సంబంధించి కంపెనీ లు సాధించిన ప్రగతి విషయంలో ఉభయ పక్షాలు సంతృప్తి ని వ్యక్తం చేశాయి.
38. ఎల్‌ఎన్‌జి రంగం లో సహకారం విషయం లో భారతీయ కంపెనీల, రష్యన్ కంపెనీల ఆసక్తి ని ఉభయ పక్షాలు గుర్తించాయి. గాజ్‌ప్రోమ్ గ్రూపు, గెయిల్ ఇండియా లిమిటెడ్ ల మధ్య దీర్ఘకాలిక కాంట్రాక్టు లో భాగంగా సహకారానికి రష్యన్ కంపెనీల, భారతీయ కంపెనీ ల ఆసక్తి ని గుర్తించడం జరిగింది.
39. పిజెఎస్ సి నోవాటెక్, భారతదేశ శక్తి కంపెనీ ల మధ్య చర్చ లను ముందుకు తీసుకువెళ్లేందుకు ఉభయపక్షాలు వాటి మద్దతు ను ప్రకటించాయి. ఎల్‌ఎన్‌జి విషయం లో సహకారాన్ని వృద్ధి చేసేందుకు గల సంయుక్త ఆసక్తిని ఉభయ పక్షాలు స్వాగతించాయి.
40. రష్యా భూభాగంలో, ఆర్కిటిక్ షెల్ఫ్ ఆఫ్ రష్యా లో, అలాగే షెల్ఫ్ ఆఫ్ పెచోరా, ఒకోత్స్ క్ సముద్రం లో చమురు క్షేత్రాల ను సంయుక్తం గా అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించడం, సహకారాన్ని వృద్ధి చేసుకునేందుకు ఆయా కంపెనీ లకు ఉభయపక్షాలు తమ మద్దతు ను ప్రకటించాయి.
41. భారతదేశానికి రష్యా నుండి, ఇతర దేశాల నుండి గ్యాస్ గొట్టపు మార్గం మార్గాలకు సంబంధించి 2017లో నిర్వహించిన సంయుక్త అధ్యయనాన్ని, భారతదేశానికి గ్యాస్ గొట్టపు మార్గం నిర్మాణానికి గల అవకాశాలను భారతదేశం, రష్యా ల మంత్రిత్వ శాఖల మధ్య, వివిధ కంపెనీ ల మధ్య కొనసాగుతున్న సంప్రదింపులను ఉభయ పక్షాలు స్వాగతించడంతో పాటు, ఇరు దేశాల మంత్రిత్వ శాఖల మధ్య అవగాహనపూర్వక ఒప్పందాన్ని ముగింపు దశ కు తెచ్చే విషయంలో ఒకరిని మరొకరు సంప్రదించుకోవడానికి అంగీకరించారు.
42. భారతదేశం, రష్యా ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం లో పౌర పరమాణు సహకారం కీలక అంశం. ఇది భారతదేశ ఇంధన భద్రత కు, జలవాయు పరివర్తన పై పారిస్ ఒప్పందం కట్టుబాటు కు ఉపకరిస్తుంది. కూడంకుళమ్ పరమాణు విద్యుత్తు కర్మాగారం లో ఆరు విద్యుత్తు యూనిట్ ల నిర్మాణం లో సాధించిన పురోగతి, స్థానిక అవసరాలకు అనుగుణం గా వివిధ పరికరాల ను స్థానికం గా తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల లో పురోగతి ని ఉభయ పక్షాలు గుర్తించాయి. భారతదేశం లో రష్యా రూపకల్పన చేయనున్న పరమాణు విద్యుత్తు ప్లాంటు విషయం లో సంప్రదింపులను ఉభయ పక్షాలు స్వాగతించాయి. అలాగే పరమాణు విద్యుత్తు ప్లాంటు పరికరాలను సంయుక్తంగా తయారు చేయడం, తృతీయ దేశం లో సహకారం వంటి అంశాలను స్వాగతించడం జరిగింది.
బాంగ్లాదేశ్ లో రూప్పూర్ పరమాణు విద్యుత్తు ప్రాజెక్టు అమలు విషయం లో సహకారానికి సంబంధించి అవగాహనపూర్వక ఒప్పందం లో పేర్కొన్న వాటి ని పూర్తి చేయడం లో పురోగతి ని ఉభయ పక్షాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. పరమాణు రంగానికి సంబంధించి సంయుక్తం గా గుర్తించిన అంశాల అమలు, ప్రాధాన్యాల గుర్తింపు నకు కార్యాచరణపై సంతకాలు చేయడం పట్ల ఇరు పక్షాలు సంతృప్తి ని వ్యక్తం చేశాయి.
43. జల వాయు పరివర్తన వ్యతిరేక ప్రభావాన్ని తగ్గించేందుకు, అలాగే శక్తి సామర్ధ్యం, పునరుత్పాదక ఇంధన వనరులు, జల విద్యుత్తు ల వంటి వాటి పై సన్నిహిత సహకారానికి గల అవకాశాలను పరిశీలించేందుకు ఉభయ పక్షాలు నిర్ణయించాయి.
సైనికపరమైన-సాంకేతిక విజ్ఞాన పరమైన సహకారం
44. ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం లో సైనిక, సైనిక-సాంకేతిక సహకారం కీలకమైందని ఇరు పక్షాలు గుర్తించాయి. మిలిటరి- సాంకేతిక సహకారంపై 2018 డిసెంబర్‌లో జరగనున్న ఇండియా- రష్యా ఇంటర్ గవర్నమెంటల్ సమావేశాన్ని వారు స్వాగతించారు. మిలటరీ సహకారానికి సంబంధించిన రోడ్‌మ్యాప్, ఇరు దేశాల సైన్యం మధ్య సంబంధాలు మరింతగా పెరగడానికి, అలాగే శిక్షణ కు,సైన్యాని కి సంబంధించిన సీనియర్ అధికారుల రాకపోకలు, సిబ్బంది సమావేశాలు, ఎక్సర్ సైజు లకు ఇది మరింతగా వీలు కల్పిస్తోంది. ఆర్మీ గేమ్స్ 2018, ఆర్మీ 2018, అంతర్జాతీయ భద్రత పై మాస్కో సదస్సు ల వంటి వాటిలో భారతదేశం పాత్ర ను ఇది సానుకూలంగా అంచనా వేసింది. తొలిసారి గా నిర్వహించిన త్రివిధ దళాల ఎక్సర్‌సైజ్ ఇంద్ర 2017 ను విజయవంతంగా పూర్తి చేయడాన్ని ఉభయ పక్షాలు ప్రశంసించాయి. అలాగే ఇంద్ర నేవీ, ఇంద్ర ఆర్మీ, అవియ ఇంద్ర 2018 సంయుక్త సైనిక విన్యాసాల ను కొనసాగించడానికి ఉభయ పక్షాలు కట్టుబడి ఉన్నాయి.
45. ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే దీర్ఘ శ్రేణి క్షిపణి వ్యవస్థ ఎస్-400 ను భారతదేశానికి సరఫరా చేసే కాంట్రాక్టు ను పూర్తి చేయడాన్ని ఉభయ పక్షాలు స్వాగతించాయి.
పరస్పర విశ్వాసం, పరస్పర ప్రయోజనాల విషయంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశం, రష్యా ల మధ్య మిలిటరి సాంకేతిక సహకారాన్ని పెంపొందించేందుకు ఉభయ పక్షాలు చిత్త శుద్ధి ని పునరుద్ఘాటించాయి. మిలిటరి సాంకేతిక సహకారానికి సంబంధించి రెండు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టు లలో గణనీయమైన పురోగతి పట్ల ఉభయ పక్షాలు సంతృప్తి ని వ్యక్తం చేశాయి. సంయుక్త పరిశోధన, మిలిటరి సాంకేతిక పరికరాల సంయుక్త ఉత్పత్తి దిశగా సానుకూల ధోరణి ని ఉభయ దేశాలు గుర్తించాయి. భారత ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ విధానాన్ని ప్రమోట్ చేసేందుకు మిలిటరి ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ ప్రక్రియ ను ఉభయ పక్షాలు సమీక్షించాయి.
ఉన్నత సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి 2017 నవంబర్ నెల లో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సంఘం సమావేశాన్ని ఉభయ పక్షాలు సమీక్షించాయి. ఈ సంఘం సంయుక్త పరిశోధన కు, అభివృద్ధి కి సంబంధించి పరస్పర ప్రయోజనకరంగా ఉండే నిర్మాణాత్మక పథకాలను గుర్తించింది.
అంతర్జాతీయ అంశాలు
46. అంతర్జాతీయ చట్టం లో గుర్తించిన విధంగా, ఐక్య రాజ్య సమితి చార్టర్ లో ప్రస్తావించినట్టు సమానత్వం, పరస్పర గౌరవం, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం, అలాగే ఐక్య రాజ్య సమితి చార్టర్,1970 నాటి అంతర్జాతీయ చట్టం సూత్రాల పై వెలువడిన ప్రకటన ప్రకారం వివిధ దేశాల మధ్య పరస్పర సహకారం, స్నేహ సంబంధాలను ఉభయ పక్షాలు ధ్రువీకరించాయి.
47. 2018 జులై నెల లో దక్షిణ ఆఫ్రికా లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం 10 వ వార్షికోత్సవ ఫలితాలను ప్రస్తావిస్తూ ఉభయ దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అర్థవంతమైన చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయి. బ్రిక్స్ కూటమి లో అంతర్జాతీయ చట్టాలు, ఐక్య రాజ్య సమితి చార్టర్ ను కచ్చితంగా పాటించే ప్రాతిపదిక గా బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణానికి అనువైన ప్రాధాన్యాలకు మద్దతు తెలపడం జరిగింది.
48. అఫ్గానిస్తాన్ నాయకత్వం లో, అఫ్గాన్ ల స్వీయ జాతీయ శాంతి సయోధ్య ప్రక్రియ ను సాధ్యం చేసేందుకు అఫ్గాన్ ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు ఉభయ పక్షాలు తమ మద్దతు ను వ్యక్తం చేశాయి. అఫ్గానిస్తాన్ లో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న హింస ఆందోళన కలిగించేదిగా ఉందని, ఇది అక్కడి భద్రత ను దెబ్బ తీస్తుందని, దీని వ్యతిరేక ప్రభావం ఈ ప్రాంతం పై పడుతుందని భావించింది. అఫ్గానిస్తాన్ లో నానాటికి పెరుగుతున్న మాదకద్రవ్యాల సమస్య ను తొలగించడానికి, ఉగ్రవాద స్థావరాలను తొలగించడానికి, విదేశీ ఉగ్రవాద స్థావరాలను లేకుండా చేయడానికి, ఉగ్రవాద హింస కు చరమగీతాన్ని పాడడానికి, అఫ్గానిస్తాన్ లోని దీర్ఘకాలిక ఘర్షణ సమస్య కు పరిష్కారాన్ని సాధించడానికి మాస్కో నమూనా ద్వారా, అఫ్గానిస్తాన్ పై ఎస్‌సిఒ కాంటాక్ట్ గ్రూపు ద్వారా, ఇతర గుర్తింపు పొందిన పద్ధతులలో అన్ని రకాలుగా పనిచేసేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి.
అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, రాజకీయ సుస్థిరత తో కూడిన భద్రమైన సుసంపన్నమైన స్వతంత్ర, ఐక్య అఫ్గానిస్తాన్ ఏర్పాటు కు వీలుగా, అఫ్గానిస్తాన్ లో విదేశీ జోక్యాన్ని తిప్పికొట్టేందుకు అంతర్జాతీయ సమాజం చేతులు కలపాలని ఉభయ పక్షాలు పిలుపునిచ్చాయి. ఉభయపక్షాలు అఫ్గానిస్తాన్ సామర్థ్య నిర్మాణ పథకాలు, సంయుక్త అభివృద్ధి పథకాల దిశగా వాటి కార్యకలాపాలు ఉండేలా చూసుకోనున్నాయి.
49. ఐక్య రాజ్య సమితి భద్రత మండలి తీర్మానం 2254 (2015)కు అనుగుణంగా సిరియా భౌగోళిక సమగ్రత ను, స్వతంత్రత ను రక్షించే విధంగా సిరియా స్వీయ రాజకీయ ప్రక్రియ ను, సిరియా నాయకత్వం ద్వారా, సిరియా లోని ఘర్షణల సమస్య కు రాజకీయ పరిష్కారం కనుగొనడానికి భారతదేశం, రష్యా లు వాటి చిత్తశుద్ధి ని పునరుద్ఘాటించాయి.
జెనీవా ప్రకియ, ఐక్య రాజ్య సమితి మధ్యవర్తిత్వ ఆఫర్ కు అలాగే అస్తానా ప్రక్రియ కు తమ మద్దతు ను ఉభయ దేశాలు పునరుద్ఘాటించాయి. ఈ రెండు చొరవ ల మధ్య గల అనుబంధాన్ని ఉభయ దేశాల నొక్కిపలికాయి. ఇతర దేశాల జోక్యం లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా, శాంతియుత, సుస్థిర, సార్వభౌమాధికార సిరియా దేశ నిర్మాణానికి సంబంధిత అన్ని వర్గాలు క్రియాశీలంగా కలసి పనిచేయాలని ఉభయ దేశాలు పిలుపునిచ్చాయి. సిరియా ప్రజల దీర్ఘకాలిక బాధలను త్వరలోనే తొలగించే విధంగా వారికి మానవత సహాయం అందించేందుకు మరింత కృషి కి ఉభయ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భం లోనే సత్వర పునరావాసం, శరణార్థులను రప్పించడం, అంతర్గతం గా నిర్వాసితుల సమస్య లను దృష్టిలో పెట్టుకోవాలని ఉభయ పక్షాలు సూచించాయి.
50. ఇరాన్ తో సాధారణ ఆర్థిక సహకారాన్ని వృద్ధి చేసుకునేందుకు, అణ్వస్త్ర వ్యాప్తి నిరాయుధీకరణ, పాలన వ్యవస్థ ను బలోపేతం చేయడం, అంతర్జాతీయ శాంతి కి, సుస్థిరత కు మద్దతిచ్చేందుకు ఇరానియన్ పరమాణు కార్యక్రమం పై సంయుక్త సమగ్ర కార్యాచరణ (జెసిపిఒఎ)ని పకడ్బందీ గా అమలు చేయవలసిన అవసరాన్ని ఉభయ పక్షాలు ప్రస్తావించాయి. ఇరాన్ పరమాణు కార్యక్రమానికి సంబంధించిన అన్ని అంశాలను శాంతియుతం గా చర్చల ద్వారా పరిష్కరించాలని ఉభయ దేశాలు పిలుపునిచ్చాయి.
51. ఉభయ పక్షాలు కొరియన్ ద్వీపకల్పం లో పరిణామాలను స్వాగతించాయి. దౌత్యపరమైన చర్యలు, సంభాషణల ద్వారా ఈ ఉప ప్రాంతం లో చిర శాంతి ని, సుస్థిరత ను సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఉభయ దేశాలు తమ మద్దతు పలికాయి. కొరియా ద్వీపకల్ప సమస్య లను పరిష్కరించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే క్రమం లో అణ్వస్త్ర వ్యాప్తి తో ముడిపడ్డ అంశాలను , దానికి సంబంధించిన ఆందోళన ను కూడా పరిగణన లోకి తీసుకోవలసి ఉంటుందని ఉభయ పక్షాలు అంగీకరించాయి.
52. అంతరిక్షం లో ఆయుధ పోటీ పై ఉభయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతరిక్షం సైనిక ఘర్షణ ల క్షేత్రం గా మారే అవకాశం ఉందన్న ఆందోళన ను ఉభయ పక్షాలు వ్యక్తం చేశాయి. అంతరిక్షం లో ఆయుధ పోటీ ని నియంత్రించడం (పిఎఆర్‌ఒఎస్) అంతర్జాతీయ శాంతి కి, భద్రత కు పెనుముప్పు రాకుండా తప్పించగలుగుతుందని ఉభయ పక్షాలు పునరుద్ఘాటించాయి. అంతరిక్షం లో ఆయుధాలను ఉంచకుండా నిరోధించడం తో పాటు అంతరిక్షం లో ఆయుధ పోటీ ని నియంత్రించేందుకు దీని పై చట్టబద్ధం గా బాధ్యులను చేసే ఒప్పందాన్ని తీసుకు వచ్చేందుకు గల అవకాశాలను పరిశీలించడానికి ఐక్య రాజ్య సమితి ప్రభుత్వ స్థాయి నిపుణుల తొలి సమావేశ చర్చలను ఉభయ పక్షాలు స్వాగతించాయి. అంతరిక్షం లో ఆయుధ పోటీ ని నిరోధించే లక్ష్యాన్ని చేరుకోవడానికి పారదర్శకత, విశ్వాసం కల్పించే చర్యలు ఎంతగానో తోడ్పడతాయని ఉభయ పక్షాలు స్పష్టం చేశాయి.
53. రసాయన ఆయుధాల అభివృద్ధిని, ఉత్పత్తి, నిల్వ, వాటి వినియోగాన్ని అరికట్టడం అలాగే వాటి ని ధ్వంసం చేయడం, రసాయన ఆయుధాల రద్దు కు సంస్థ కార్యకలాపాలను రాజకీయం చేయడాన్ని నిరోధించడం వంటి వాటి విషయం లో కన్వెన్షన్ పాత్ర ను పరిరక్షించే చర్యలకు మద్దతిచ్చేందుకు ఉభయ పక్షాలు తమ కృత నిశ్చయాన్ని వ్యక్తం చేశాయి.
రష్యన్ ఫెడరేశన్ తమ వద్ద ఉన్న రసాయన ఆయుధ నిలవ లను ధ్వంసం చేయడాన్ని త్వరగా పూర్తి చేయడాన్ని భారతదేశం వైపు నుండి స్వాగతించడం జరిగింది. ఇది ప్రపంచాన్ని రసాయన ఆయుధాల నుండి విముక్తి చేసే లక్ష్యాన్ని చేరుకోవడానికి చెప్పుకోదగిన చర్యగా భావించవచ్చు.
54. అన్ని రూపాల లోని, అన్ని పద్ధతుల లోని ఉగ్రవాదాన్నిఉభయ పక్షాలు ఖండించాయి. అలాగే అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిర్ణయాత్మకంగా, సమష్టి స్పందన తో ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలకు తావు లేకుండా ఎదుర్కోవాలని పిలుపునివ్వడం జరిగింది. ఉగ్రవాద నెట్‌వర్క్ లు, వాటి ఆర్థిక మూలాలు, ఆయుధాలు, ఉగ్రవాదుల సరఫరా మార్గాలు, ఉగ్రవాద భావజాలాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాద ప్రచారాన్ని, ఉగ్రవాదుల భర్తీని ,,నిర్మూలించేందుకు తమ కృషిని సమ్మిళితం చేయాలని ఉభయపక్షాలూ నిర్ణయించాయి. ఉగ్రవాదులకు , వారి నెట్‌వర్క్ లకు ప్రభుత్వాలు సురక్షిత స్థావరాలు కల్పించడం, సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాల కు ప్రభుత్వాలే మద్దతివ్వడం వంటివి ఏ రూపం లో ఉన్నా వాటిని ఖండిస్తున్నట్టు ఉభయ పక్షాలు ప్రకటించాయి.
అంతర్జాతీయ ఉగ్రవాదం పై సమగ్ర ఒప్పందం ప్రాధాన్యాన్ని ఉభయ పక్షాలు గుర్తించాయి. ఈ ఒప్పందం ఐక్య రాజ్య సమితి లో పెండింగ్ లో ఉంది.
అంతర్జాతీయ చట్టం లో దానిని భాగం చేయడానికి అంతర్జాతీయ సమాజం వీలైనంత త్వరగా ఈ ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు చిత్తశుద్ధి తో కూడిన చర్యలను తీసుకోవాలని ఉభయ పక్షాలు పిలుపునిచ్చాయి. రసాయన, జీవ రసాయన ఉగ్రవాద ముప్పు ను ఎదుర్కొనేందుకు ఉభయ పక్షాలు పిలుపునిచ్చాయి. రసాయన, జీవ రసాయన ఉగ్రవాద చర్యలను అరికట్టేందుకు అంతర్జాతీయంగా ఏర్పాటు చేసిన నిరాయుధీకరణ పై సదస్సు లో బహుళ పక్ష సంప్రదింపుల జరపవలసిన అవసరాన్ని ఈ పక్షాలు నొక్కి పలికాయి.
55. అంతర్జాతీయ సంబంధాల లో ఐక్య రాజ్య సమితి కీలక పాత్ర, అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలకు ఉభయ పక్షాలు తమ చిత్తశుద్ధి ని వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టానికి సంబంధించిన నిబంధనలను, సార్వత్రికం గా గుర్తించిన సూత్రాల ను మంచి నమ్మకం తో అమలు చేయడం అనేది, కొన్ని దేశాలు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే లేదా ద్వంద్వ ప్రమాణాలకు తావు లేకుండా చేస్తుంది. అంతర్జాతీయ చట్టాల తో సంబంధం లేకుండా ఏక పక్ష విధానాలను రుద్దడం అటువంటి విధానానికి ఉదాహరణ గా చెప్పవచ్చును. అంతర్జాతీయ, ఉమ్మడి ప్రయోజనాల ప్రాతిపదిక గా ప్రపంచ ప్రజాస్వామిక వ్యవస్థ ను ప్రోత్సహించడానికి ఉభయ పక్షాలు కలిసికట్టు గా కృషి చేయాలని నిర్ణయించాయి.
56. ఐక్య రాజ్య సమితి భద్రత మండలి ని సంస్కరించవలసిన అవసరాన్ని ఉభయ పక్షాలు నొక్కిపలికాయి. ప్రస్తుత ప్రపంచ విధానాన్ని ప్రతిబింబించే విధంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల ను ఎదుర్కొనేందుకు వీలుగా దీనిని మరింత సమర్దంగా తీర్చదిద్దవలసి వుంది. విస్తారిత ఐక్య రాజ్య సమితి భద్రత మండలి లో భారతదేశం శాశ్వత సభ్యత్వానికి రష్యా తన తిరుగులేని మద్దతు ను పునరుద్ఘాటించింది. శాంతి, భద్రత, ప్రాంతీయంగా, జాతీయంగా న్యాయబద్ధమైన అభివృద్ధి కి, అంతర్జాతీయంగా సమంగా అధికారాల పంపిణీ కి సంబంధించిన విధానాన్ని, సుస్థిరత ను సాధించేందుకు తమ చర్య లను పరస్పరం సమన్వయపరచుకోవాలని నిర్ణయించడం జరిగింది.
57. సుస్థిరాభివృద్ధి కి సంబంధించి 2030 అజెండా ను పూర్తిగా అమలు చేయాలని ఇరు పక్షాలు వాటి చిత్తశుద్ధి ని వ్యక్తం చేశాయి. ఇరు పక్షాలు న్యాయబద్ధమైన, బాహాటత్వంతో కూడిన, సర్వతోముఖమైన, నూతన ఆవిష్కరణల ఆధారితమైన, సమ్మిళితమైన అభివృద్ధి కి, ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణం పరంగా సుస్థిరాభివృద్ధి సాధన కు ఒక క్రమమైన, సమీకృత పద్ధతి లో కృషి చేయాలని నిర్ణయించాయి. అంతర్జాతీయంగా 2030 అజెండా అమలు, సమీక్ష, సమన్వయపరచడం లోనూ, సుస్థిరాభివృద్ధి పై అత్యున్నత రాజకీయ వేదిక గా ఐక్య రాజ్య సమితి ప్రధాన పాత్ర ను ఉభయ పక్షాలు పునరుద్ఘాటించాయి. ఐక్య రాజ్య సమితి అభివృద్ధి వ్యవస్థ ను సంస్కరించవలసిన అవసరాన్ని వారు అంగీకరించారు. 2030 అజెండా అమలు లో సభ్యత్వ దేశాల సామర్ధ్యాలను పెంపొందించే లక్ష్యం తో దీనిని సంస్కరించవలసిన అవసరం ఉందని వారు అంగీకరించారు. అభివృద్ధి చెందిన దేశాలు వాటి అభివృద్ధి సహాయాన్ని అందించేందుకు ఇచ్చిన హామీ లను సకాలం లో పూర్తి గా అమలు చేయాలని ఉభయ పక్షాలు పిలుపునిచ్చాయి. అలాగే మరిన్ని అభివృద్ధి నిధులను అభివృద్ధి చెందుతున్నదేశాలకు అందించాలని పిలుపునిచ్చాయి.
58. ఉభయ పక్షాలు హరిత అభివృద్ధి ని, కార్బన్ ఉద్గారాలు తక్కువ గా గల ఆర్థిక వ్యవస్థ ను అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధి ని ప్రకటించాయి. అలాగే సుస్థిరాభివృద్ధి, పేదరిక నిర్మూలన కు తమ వచనబద్ధత ను ప్రకటించాయి.
జల వాయు పరివర్తన పై ఐక్య రాజ్య సమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్శన్ సూత్రాలు, సంబంధిత సామర్ధ్యాలు, వేరువేరు బాధ్యతల సూత్రాల ఆధారంగా చేపట్టిన పారిస్ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయాలని అన్నిదేశాలకూ ఉభయ పక్షాలు పిలుపునిచ్చాయి. అభివృద్ధి చెందుతున్నదేశాల సామర్ధ్యాల పెంపు నకు అభివృద్ధి చెందిన దేశాలు సాంకేతికంగా, ఆర్థికంగా మద్దతివ్వాలంటూ ఉభయ పక్షాలు పిలుపునిచ్చాయి.
59. అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధాన్ని బలోపేతం చేసేందుకు ఉభయపక్షాలూ తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించాయి. పరమాణు సరఫరాదారుల బృందం లో భారతదేశం సభ్యత్వానికి రష్యా మద్దతు పలికింది.
60. ఇన్ ఫర్మేశన్ కమ్యూనికేశన్ టెక్నాలజీ (ఐసిటి)ని నేరపూరిత కార్యకలాపాలకు వాడకుండా నిరోధించేందుకు అంతర్జాతీయంగా ఈ రంగంలో చట్టపరమైన చర్యలను అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి, ఐసిటి వినియోగం లో ఆయా దేశాలు బాధ్యాతతో వ్యవహరించేందుకు తగిన సూత్రాలు, నిబంధనలు, విధి విధానాలను త్వరగా చేపట్టవలసిన అవసరం ఉందని ఉభయ పక్షాలు స్పష్టం చేశాయి. ఇందుకు సంబంధించి ఐక్య రాజ్య సమితి సాధారణ సభ 73 వ సమావేశం లో చేసిన తీర్మానం ప్రాధాన్యాన్ని ఉభయ పక్షాలు ప్రస్తావించాయి. ఐసిటి వినియోగం లో భద్రత కు సంబంధించి బ్రిక్స్ సభ్యత్వ దేశాల మధ్య సహకారానికి వీలుగా ఒక ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు అవసరాన్ని ఉభయ పక్షాలు ప్రస్తావించాయి. ఈ విషయంలో బ్రిక్స్ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంటు ను మరింత విస్తరింపచేసేందుకు కృషి చేయనున్నట్టు ఉభయ దేశాలు ఆమోదించాయి.
61. ఐసిటి వినియోగం లో భద్రత కు పూచీ పడే సార్వత్రిక విధానాలను ఉభయ పక్షాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఇన్ ఫర్మేశన్ కమ్యూనికేశన్ టెక్నాలజీ ల వినియోగానికి సంబంధించి అంతర్ ప్రభుత్వ ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ద్వైపాక్షిక ఇంటర్ ఏజెన్సీ ప్రాక్టికల్ డైలాగ్ ను బలోపేతం చేసేందుకు ఉభయ పక్షాలు సానుకూలత ను వ్యక్తం చేశాయి.
62. ప్రాంతీయ భద్రతావ్యవస్థ ఏర్పాటు ఆలోచన కు ఉభయ పక్షాలు మద్దతు పలికాయి. ఇది ఆసియా, పసిఫిక్, హిందూ మహాసముద్ర సంబంధిత అన్ని దేశాలకు సమాన ప్రాతిపదిక పై భద్రత ను కల్పిస్తుంది. ఈ అంశం పై బహుళపక్ష చర్చలను తూర్పు ఆసియా శిఖరాగ్ర సమ్మేళనాల ఫ్రేమ్‌వర్క్ కు, ఇతర ప్రాంతీయ వేదిక లకు లోబడి కొనసాగించడానికి నిర్ణయించాయి. ప్రాంతీయ ఆర్డర్ ను బలోపేతం చేసేందుకు తీసుకునే అన్ని చర్యలు బహుళపక్ష చర్చల పారదర్శక సూత్రాలకు అనుగుణంగా ఉండాలని ఉభయ పక్షాలు అంగీకరించాయి. అన్ని వర్గాలకు స్థానాన్ని కల్పించడం, పరస్పర గౌరవం, ఐక్యత, ఉమ్మడి ప్రగతి లక్ష్యాలు, సుసంపన్నత ల వంటివి ఏ ఒక్క దేశానికో మాత్రమే ఉద్దేశించినవి కారాదని, ఇవి అందరినీ ఉద్దేశించినవై ఉండాలని అంగీకరించాయి. ఇందుకు రష్యన్ ఫెడరేశన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఇగొర్ మోర్గులోవ్, భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విజయ్ గోఖలే ల మధ్య ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీ న మాస్కో లో జరిగిన నిర్మాణాత్మక సంప్రదింపు లను ఉభయ పక్షాలు స్వాగతించాయి.
63. ప్రాంతీయ బహుళ పక్ష వేదికలైన బ్రిక్స్, జి-20, ఎస్‌సిఒ, ఆర్‌ఐసి, ఇంకా తూర్పు ఆసియా శిఖర సమ్మేళనాల వంటి వాటి లో సంప్రదింపులు, సమన్వయ చర్య లను మరింత ముందుకు తీసుకుపోయేందుకు చర్యలు తీసుకోవడానికి ఇరు పక్షాలు చిత్తశుద్ధిని ప్రకటించాయి. యూరేశియన్ ఎకనామిక్ యూనియన్ తో తమ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలన్న ఆకాంక్ష ను భారతదేశం వ్యక్తం చేసింది.
64. 2018 జూన్‌లో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కింగ్‌డావో లో జరిగి ఎస్‌సిఒ హెడ్స్ ఆఫ్‌స్టేట్ కౌన్సిల్ సమావేశం లో పాల్గొనడం, ఈ సంస్థ కార్యకలాపాలలో భారతదేశం విజయవంతంగా పూర్తి సభ్యత్వ దేశం గా తన వంతు పాత్ర పోషించడం గా ఇరు పక్షాలు గుర్తించాయి. ఎస్‌సిఒ చార్టర్, విధి విధానాలు, అంతర్జాతీయ చట్ట సూత్రాలకు తమ నిబద్ధత ను ఉభయ పక్షాలు వ్యక్తం చేశాయి. అలాగే ఈ సంస్థ అన్ని రూపాలలో తన కార్యకలాపాలను కొనసాగించడానికి తగిన సమన్వయం తో కృషి చేస్తామని ఉభయ పక్షాలు ధ్రువీకరించాయి.
ఎస్‌సిఒ ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థ లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు భద్రత, సుస్థిరత, ఉగ్రవాదాన్నిఎదుర్కోవడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు వంటి అంశాలపై ఉభయ పక్షాలు ప్రత్యేక దృష్టి సారిస్తాయి.
ఉగ్రవాద వ్యతిరేక సైనిక విన్యాసాలు, “పీస్ మిషన్- 2018” లో భారతదేశం పాల్గొనడాన్ని రష్యా స్వాగతించింది. ఎస్‌సిఒ ను ఆర్థికంగా అభివృద్ధి చేయడం ఒక ముఖ్యమైన లక్ష్యంగా ఉభయ పక్షాలూ భావించాయి. అలాగే రవాణా, ఎస్.సి.ఒ సంస్థ లోను, పరిశీలకులు, భాగస్వామ్య దేశాలు, అలాగే ఇతర సంబంధిత దేశాల అంతర్ అనుసంధానానికి వీలు కల్పించే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సాకారమయ్యేలా చేయడం లక్ష్యం గా ఉభయ పక్షాలు భావించాయి. అంతర్జాతీయ వ్యవహారాలలో ఎస్‌సిఒ భూమిక ను పెంచేందుకు వారు తమ నిబద్ధతను ప్రకటించారు. అలాగే ఎస్‌సిఒ సంబంధాలను విస్తృతపరచడం, ఐక్య రాజ్య సమితి తో, దాని వ్యవస్థ లతో ఎస్‌సిఒ సహకారాన్ని పెంపొందించడం, ఇతర అంతర్జాతీయ సంస్థ లతో, ప్రాంతీయ సంస్థ లతో సంబంధాలను పెంపొందించడానికి వారు అండగా నిలబడుతున్నట్టు ప్రకటించారు. ఎస్‌సిఒ తో సాంస్కృతిక, మానవతావాద సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి.
65. పారదర్శకమైన, బాహాటత్వంతో కూడిన, వివక్ష కు తావు లేనటువంటి రీతిలో, నిబంధనల ఆధారంగా బహుళపక్ష వాణిజ్య వ్యవస్థ ను బలోపేతం చేసేందుకు ఉభయ పక్షాలు కట్టుబడి ఉన్నట్టు తెలిపాయి. అలాగే అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు ముక్క చెక్కలు కాకుండా నిరోధించడం, అన్ని రూపాలలో వాణిజ్య రక్షణ లను నిరోధించడం ఇందులో భాగం గా ఉన్నాయి.
66. విస్తృత యూరేశియన్ భాగస్వామ్యాన్ని రూపొందించేందుకు రష్యా చూపిన చొరవ ను భారతదేశం స్వాగతించింది. ఇది జాతీయ అభివృద్ది వ్యూహాలను సమ్మిళితం చేస్తుంది. అలాగే అంతర్జాతీయ చట్టం, సమానత్వ సూత్రాలు, పరస్పర గౌరవం, ఇతర జాతీయ దృక్పథాలను పరిగణన లోకి తీసుకోవడం ద్వారా నిర్మాణాత్మక సహకారం తో కూడిన సమర్థ వేదికను నిర్మించడానికి ఉద్దేశించిన బహుళ పక్ష సమన్వయ ప్రాజెక్టు లకు ఇది వీలు కల్పిస్తుంది.
67. భారతదేశం, రష్యా ల సంబంధాలలో పురోగతి పట్ల ఉభయ పక్షాలు సంతృప్తి ని వ్యక్తం చేశాయి. ద్వైపాక్షిక , అంతర్జాతీయ ప్రాముఖ్యం గల అంశాల పైన ఒకే రకమైన వైఖరి, అలాగే ఉభయ దేశాల ప్రజల పరస్పర శ్రేయస్సు కోసం భారతదేశం, రష్యా ల ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి, సన్నిహిత సహకారాన్ని, సమన్వయాన్ని కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.
68. భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన ఆతిథ్యానికి రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. 2019 లో జరిగే 20 వ వార్షిక శిఖర సమ్మేళనానికి రష్యా కు రావలసిందిగా భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని శ్రీ వ్లాదిమీర్ పుతిన్ ఆహ్వానించారు. శ్రీ పుతిన్ ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషంగా అంగీకరించారు.
**
Human resource development से लेकर natural resources तक,
— PMO India (@PMOIndia) October 5, 2018
trade से लेकर investment तक,
नाभिकीय ऊर्जा के शान्तिपूर्ण सहयोग से लेकर सौर ऊर्जा तक,
technology से लेकर tiger कन्ज़र्वेशन तक,
सागर से लेकर अंन्तरिक्ष तक,
भारत और रूस के सम्बन्धों का और भी विशाल विस्तार होगा: PM
आतंकवाद के विरूद्ध संघर्ष, अफगानिस्तान तथा Indo Pacific के घटनाक्रम, जलवायु परिवर्तन, SCO, BRICS जैसे संगठनों एवं G20 तथा ASEAN जैसे संगठनों में सहयोग करने में हमारे दोनों देशों के साझा हित हैं।
— PMO India (@PMOIndia) October 5, 2018
हम अंतरराष्ट्रीय संस्थानों में अपने लाभप्रद सहयोग को जारी रखने पर सहमत हुए हैं: PM
भारत- रूस मैत्री अपने आप में अनूठी है।
— PMO India (@PMOIndia) October 5, 2018
इस विशिष्ट रिश्ते के लिए President Putin की प्रतिबद्धता से इन संबंधों को और भी ऊर्जा मिलेगी।
और हमारे बीच प्रगाढ़ मैत्री और सुदृढ़ होगी और हमारी Special and Privileged Strategic Partnership को नई बुलंदियां प्राप्त होंगी: PM
Addressing a joint press meet with President Putin. Watch. @KremlinRussia_E https://t.co/Ybc7EU67AF
— Narendra Modi (@narendramodi) October 5, 2018
Here is my speech at the business summit with President Putin. https://t.co/VCS5uDyUF3
— Narendra Modi (@narendramodi) October 5, 2018
President Putin has played a vital role in further enhancing the friendship between India and Russia.
— Narendra Modi (@narendramodi) October 5, 2018
We had fruitful talks today, covering various aspects of the Special and Privileged Strategic Partnership between our nations. @KremlinRussia_E pic.twitter.com/395yFKeGzt