Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం లో తొలిరీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) ను ఉత్తర్ ప్రదేశ్ లోనిగాజియాబాద్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి

భారతదేశం లో తొలిరీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) ను ఉత్తర్ ప్రదేశ్ లోనిగాజియాబాద్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి

భారతదేశం లో తొలిరీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) ను ఉత్తర్ ప్రదేశ్ లోనిగాజియాబాద్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి


దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లోని ప్రయారిటీ సెక్శను ను ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో సాహిబాబాద్ రేపిడ్ఎక్స్ స్టేశన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. సాహిబాబాద్ ను దుహాయీ డిపో తో కలిపేటటువంటి నమో భారత్ రేపిడ్ఎక్స్ రైలు కు కూడా ఆయన ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు. దీని తో భారతదేశం లో రీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) కు నాంది పలికినట్లు అయింది. బెంగళూరు మెట్రో కు చెందిన ఈస్ట్-వెస్ట్ కారిడార్ తాలూకు రెండు భాగాల ను దేశ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు.

 

రీజనల్ రేపిడ్ ట్రేన్ ‘నమో భారత్’ లో ప్రధాన మంత్రి ప్రయాణించారు కూడాను.

 

జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు దేశ ప్రజల కు ఒక చరిత్రాత్మకం అయినటువంటి సందర్భం గా ఉంది. దీని కారణం భారతదేశం లో ఒకటో రేపిడ్ రైల్ సర్వీస్ అయినటువంటి, నమో భారత్ రైలు ను దేశ ప్రజల కు అంకితం చేయడం జరుగుతున్నది అని ఆయన అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ కు శంకుస్థాపన చేసిన ఘట్టాన్ని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు. మరి అలాగే, సాహిబాబాద్ నుండి దుహాయీ డిపో వరకు ఉన్నటువంటి మార్గం లో ఈ కారిడార్ కార్యకలాపాలు ఈ రోజు న మొదలయ్యాయని ఆయన చెప్పారు. పునాది రాళ్ళ ను వేసినటువంటి ప్రాజెక్టుల ను ప్రారంభించాలి అన్నది ప్రభుత్వం యొక్క వచనబద్ధత గా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆర్ఆర్ టిఎస్ లో మేరఠ్ మార్గం ఒకటిన్నర సంవత్సరాల తరువాత నిర్మాణం పూర్తి అయ్యాక, దానిని ప్రారంభించడాని కి తాను విచ్చేస్తానన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొద్ది సేపటి క్రితం నమో భారత్ లో తాను ప్రయాణించిన సంగతి ని శ్రీ నరేంద్ర మోదీ తెలియజేస్తూ, దేశం లో రైల్ వేలు పరివర్తన కు లోనవడం సంతోషం కలిగించిందన్నారు. నవరాత్రి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, నమో భారత్ కు కాత్యాయని దేవి మాత అనుగ్రహం ఉందన్నారు. క్రొత్త గా ప్రారంభం అయినటువంటి నమో భారత్ రైలు లో లోకో మోటివ్ పైలట్ లు మరియు యావత్తు సహాయక సిబ్బంది గా మహిళలే ఉన్నారన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడి చేశారు. ‘‘నమో భారత్ అనేది దేశం లో నారీ శక్తి బలోపేతం కావడానికి ఒక సంకేతం గా ఉందని’’ శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నవరాత్రి తాలూకు శుభ సందర్భం లో ఈ రోజు న మొదలైన ప్రాజెక్టుల కు గాను దిల్లీ, ఎన్ సిఆర్ మరియు ఉత్తర్ ప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతాల ప్రజల కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు. నమో భారత్ రైలు క్రొత్తదనాని కి మరియు వేగాని కి మారు పేరు అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ‘‘నమో భారత్ రైలు న్యూ ఇండియా యొక్క మరియు న్యూ ఇండియా తాలూకు నూతన సంకల్పాల యొక్క నవీన యాత్ర ను నిర్వచిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

రాష్ట్రాల అభివృద్ధి లో భారతదేశం అభివృద్ధి ఇమిడివుందనేది తన నమ్మకం అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఐటి కేంద్రం గా ఉన్న బెంగళూరు లో మెట్రో తాలూకు రెండు భాగాలు అక్కడి కనెక్టివిటీ ని మరింత గా బలపరుస్తాయి అని ఆయన అన్నారు. మెట్రో లో నిత్యం సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు రాక పోక లు జరుపుతున్నారని ఆయన తెలిపారు.

 

‘‘21 వ శతాబ్దాని కి చెందిన భారతదేశం ప్రతి రంగం లో ప్రగతి మరియు అభివృద్ధి ల స్వీయ గాథ ను వ్రాసుకొంటున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. చంద్రయాన్-3 ఇటీవల సఫలం అయిన సంగతి ని ఆయన ప్రస్తావిస్తూ, మరి జి-20 ని ఫలప్రదం గా నిర్వహించుకోవడం అనేది భారతదేశాన్ని యావత్తు ప్రపంచాని కి ఒక ఆకర్షణ కేంద్రం గా నిలిపింది అని కూడా పేర్కొన్నారు. ఏశియాన్ గేమ్స్ లో రికార్డు స్థాయి లో ఒక వంద కు పైచిలుకు పతకాల ను చేజిక్కించుకోవడం, భారతదేశం లో 5జి ప్రారంభం మరియు విస్తరణ, డిజిటల్ లావాదేవీ లు మునుపు ఎన్నడూ ఎరుగనంతటి స్థాయి లో నమోదు అవుతూ ఉండడం లను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భారతదేశం లో తయారైన టీకామందులు ప్రపంచం లో కోట్ల కొద్దీ ప్రజల ప్రాణాల ను కాపాడిన విషయాన్ని సైతం శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తయారీ రంగం లో భారతదేశం యొక్క వృద్ధి ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, మొబైల్ ఫోన్ లు, టీవీలు, లాప్ టాప్ లు మరియు కంప్యూటర్ లకు ఉద్దేశించిన తయారీ యూనిట్ లను భారతదేశం లో ఏర్పాటు చేయాలన్న ఆసక్తి తో బహుళ జాతీయ సంస్థలు ఉన్నాయని వివరించారు. ఫైటర్ జెట్ లు మరియు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ లు సహా రక్షణ రంగ తయారీ ని గురించి సైతం ఆయన చెప్పారు. ‘‘నమో భారత్ రైలు కూడా భారతదేశం లోనే రూపుదిద్దుకొంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్లాట్ ఫార్మ్ స్ లో అమర్చిన స్క్రీన్ డోర్స్ కూడా ను భారతదేశం లోనే తయారు అయ్యాయి అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నమో భారత్ రైలు లో ధ్వని స్థాయి లు హెలికాప్టర్ లు మరియు విమానాల తో పోలిస్తే తక్కువ గా ఉన్నట్లు కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.

 

నమో భారత్ అనేది భారతదేశం యొక్క భవిష్యత్తు కు ఒక ప్రతిబింబం గా ఉంది అని ప్రధాన మంత్రి నొక్కి పలికారు. అది నానాటికీ వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి తో కూడిన దేశం యొక్క మార్పు ను సూచిస్తోందని ఆయన అన్నారు. దిల్లీ-మేరఠ్ ల మధ్య ఈ 80 కిలో మీటర్ ల మార్గం ఒక ఆరంభం మాత్రమే అని ప్రధాన మంత్రి చెప్తూ, ఒకటో దశ అనేది దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా మరియు రాజస్థాన్ లకు చెందిన అనేక ప్రాంతాలు నమో భారత్ రైలు తో ముడిపడడాన్ని సాధ్యం చేస్తుందని వివరించారు. రాబోయే కాలం లో, కనెక్టివిటీ ని మెరుగు పరచడం కోసం, ఉద్యోగ కల్పన సంబంధి సరిక్రొత్త బాటల ను పరచడం కోసం ఇదే విధమైనటువంటి వ్యవస్థ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రస్తుత శతాబ్ది లోని ఈ మూడో దశాబ్దం భారతీయ రైల్ వే స్ యొక్క పరివర్తన ప్రధాన దశాబ్ది గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘చిన్న చిన్న కలల ను కనే అలవాటు మరియు మెల్ల గా నడచే మనిషి ని కాను నేను. ఈ పదేళ్ళ కాలం ముగింపునకు వచ్చే సరికల్లా భారతదేశం లో రైళ్ళు ప్రపంచం లో మరే రైళ్ళ కు తీసిపోవు అని మీరు తెలుసుకొనేటట్లుగా నేటి యువతరాని కి ఒక పూచీకత్తు ను ఇవ్వదలచుకొన్నాను నేను’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సురక్ష లో, స్వచ్ఛత లో, సదుపాయాల లో, సమన్వయం లో, స్పందనాత్మకత లో మరియు సామర్థ్యం లో భారతీయ రైల్ వే ప్రపంచం లో ఒక క్రొత్త ఉన్నత స్థానాని కి ఎదుగుతుంది అని ఆయన అన్నారు. భారతీయ రైల్ వే వంద శాతం విద్యుతీకరణ లక్ష్యాని కి ఎంతో దూరం లో లేదు అని ఆయన అన్నారు. నమో భారత్, వందే భారత్, ఇంకా అమృత్ భారత్ రైల్ వే స్టేశన్ పథకం లో భాగం గా రైల్ స్టేశన్ ల ఉన్నతీకరణ ల వంటి కార్యక్రమాల ను గురించి ఆయన వివరించారు. ‘‘అమృత్ భారత్, వందే భారత్ మరియు నమో భారత్.. ఈ మూడు వర్తమాన దశాబ్ది ముగిసే సరికల్లా ఆధునిక రైల్ వే స్ కు ఒక గుర్తు గా నిలుస్తాయి’’ అని ఆయన అన్నారు.

 

మల్టీ-మాడల్ కనెక్టివిటీ కి సంబంధించిన ఆలోచన ను గురించి ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, దిల్లీ లోని సరాయ్ కాలే ఖాన్, ఆనంద్ విహార్, గాజియాబాద్, ఇంకా మేరఠ్ ల బస్సు స్టేశన్ లను, మెట్రో స్టేశన్ లను మరియు రైల్ వే స్టేశన్ లను నమో భారత్ వ్యవస్థ తో జతపరచడం జరుగుతున్నది అని వివరించారు.

 

***

DS/TS