Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం లో ఇండియన్ ఎయర్ ఫోర్స్ ఒకటో హెరిటేజ్సెంటర్ ను చండీగఢ్ లో ఏర్పాటుచేయడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి


ఇండియన్ ఎయర్ ఫోర్స్ కు చెందిన ఒకటో హెరిటేజ్ సెంటర్ చండీగఢ్ లో ఏర్పాటు కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ తరహా సెంటరు ను ఏర్పాటు చేయడం భారతదేశం లోనే ఇది తొలి సారి.

 

రక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి రీట్వీట్ చేస్తూ,

‘‘ఇది ఒక ప్రశంసనీయమైనటువంటి ప్రయాస అని చెప్పాలి; ఇది మన దేశ ప్రజల కు మన వాయు సేన అందిస్తున్నటువంటి సమృద్ధమైన తోడ్పాటు ను మరింత ప్రముఖం గా చాటి చెప్పగలుగుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/TS