Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం లో అతి పెద్దది అయినటువంటిది మరియు ఆ కోవ లోమొట్టమొదటిది అయిన మొబిలిటీ ఎగ్జిబిశన్ – ‘‘భారత్మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2024’’  కు సంబంధించినకార్యక్రమాన్ని ఉద్దేశించి ఫ్రిబవరి 2 వ తేదీ న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి


భారతదేశం లో అతి పెద్దది అయినటువంటి మరియు తన తరహా కు చెందిన మొట్టమొదటిది అయినటువంటి మొబిలిటీ ఎగ్జిబిశన్ ‘‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2024’’ కు సంబంధించి న ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 2 వ తేదీ నాడు సాయంత్రం పూట 4:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రసంగించనున్నారు.

 

‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024’ భారతదేశం యొక్క యావత్తు మొబిలిటీ మరియు ఆటోమోటివ్ వేల్యూ చైన్ ల సంబంధి సామర్థ్యాల ను కళ్లకు కట్టనుంది. ఎక్స్‌పో లో ప్రదర్శన లు, సమావేశాలు, కొనుగోలుదారు-అమ్మకందారు భేటీ లు, రాష్ట్రాల సదస్సు లు, రహదారి సురక్ష ను గురించి వివరించే మండపం లతో పాటు గో-కార్టింగ్ వంటి జనకేంద్రిత ఆకర్షణ లు చోటు చేసుకోనున్నాయి.

 

50 కి పైగా దేశాల నుండి తరలివచ్చేటటువంటి 800 కు పైగా ఎగ్జిబిటర్ లు ఈ ఎక్స్‌పో లో మొబిలిటీ రంగం లో ఉనికి లోకి వచ్చిన అత్యధునాతన సాంకేతికత లు, సస్‌టేనబుల్ సాల్యూశన్స్ లతో పాటుగా పథచేధక ఘటనల ను కళ్ళకు కట్టనున్నారు. ఈ ఎక్స్‌పో లో 600 కు పైచిలుకు ఆటో కంపోనంట్ మేన్యుఫాక్చరర్స్ కు అదనం గా 28 కి పైచిలుకు వాహన తయారీదారు సంస్థ లు పాలుపంచుకోనున్నాయి. 13 కు పైగా గ్లోబల్ మార్కెట్స్ నుండి 1000 కంటె ఎక్కువ బ్రాండ్ లు వాటి ఉత్పాదన ల, సాంకేతికత ల మరియు సేవ ల యొక్క సంపూర్ణమైనటువంటి శ్రేణి ని ఈ కార్యక్రమం లో కొలువుదీర్చనున్నాయి.

 

ప్రదర్శన మరియు సమావేశాలతో పాటే, ఈ కార్యక్రమం లో జాతీయ, ప్రాంతీయ స్థాయిల లో సహకారాని కై ప్రాంతీయ తోడ్పాటు మరియు కార్యక్రమాల ను వివరించే కోణం లో రాష్ట్రాల కోసం ప్రత్యేక సదస్సుల ను నిర్వహించుకొనే అవకాశం కూడా కలగనుంది. తద్ద్వారా మొబిలిటీ సాల్యూశన్స్ పట్ల సమగ్రమైన విధానాన్ని ప్రోత్సహించే చర్యల కు ఈ కార్యక్రమం వేదిక కానుంది.

 

***