Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం లోని  ధార్  చూలా మరియు నేపాల్  లోని ధార్  చూలా ల మధ్య మహాకాళీ నది మీదు గా వంతెన ను నిర్మించడం కోసం భారతదేశం, నేపాల్ ల మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపినమంత్రిమండలి


భారతదేశం లోని ధార్ చూలా మరియు నేపాల్ లోని ధార్ చూలా ల మధ్య మహాకాళీ నది మీదు గా వంతెన ను నిర్మించడం కోసం భారతదేశాని కి, నేపాల్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని (ఎమ్ఒయు)కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ ఎమ్ఒయు పై సంతకాలవడం తో రెండు దేశాల కు మధ్య గల దౌత్యపరమైనటువంటి సంబంధాలు మరింత మెరుగు పడతాయి.

పూర్వరంగం:

సన్నిహిత ఇరుగు పొరుగు దేశాలు అయిన భారతదేశం మరియు నేపాల్ ల మధ్య మైత్రి, ఇంకా సహకారాల తాలూకు విశిష్ట సంబంధాలు ఉన్నాయి. అవి ఒక తెరచిన సరిహద్దు తోపాటే ఉభయ దేశాల ప్రజల మధ్య గాఢమైన సంబంధాలు మరియు సంస్కృతి తో ప్రమాణీకృతం అయ్యాయి. భారతదేశం మరియు నేపాల్ రెండూ ఇటు ఎస్ఎఎఆర్ సి (‘సార్క్’), బిఐఎమ్ఎస్ టిఇసి (‘బిమ్స్ టెక్’) వంటి విభిన్నమైన ప్రాంతీయ వేదికల లో, అటు ప్రపంచ వేదికల లో కూడాను కలసి పని చేస్తున్నాయి.

***