Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం లోనికొన్ని ప్రాంతాల లో మితిమీరిన వర్షపాతం ఫలితం గా ఏర్పడ్డ స్థితి ని సమీక్షించినప్రధాన మంత్రి


భారతదేశం లోని కొన్ని ప్రాంతాల లో మితిమీరిన వర్షపాతం దరిమిలా తలెత్తిన స్థితి ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సీనియర్ మంత్రుల తో మరియు అధికారుల తో మాట్లాడడం తో పాటు గా ఏమి చేయాలనే దాని పై సమాలోచనలు జరిపారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘సీనియర్ మంత్రుల తో మరియు అధికారుల తో ప్రధాన మంత్రి మాట్లాడి, భారతదేశం లో కొన్ని ప్రాంతాల లో మితిమీరిన వర్షపాతం నేపథ్యం లో ఏర్పడ్డ స్థితి పై ఏమి చేయాలో సమాలోచనలు జరిపారు. ప్రభావితుల యొక్క శ్రేయం దిశ లో స్థానిక పాలన యంత్రాంగాలు, ఎన్ డిఆర్ఎఫ్ మరియు ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు పాటుపడుతున్నాయి.’’ అని తెలిపింది.