Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం యొక్క మాన్య రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కుఆమె పుట్టిన రోజు సందర్భం లో శుభాకాంక్షల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ


భారతదేశం యొక్క మాన్య రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు ఈ రోజు న ఆమె పుట్టిన రోజు సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

రాష్ట్రపతి యొక్క జీవన యాత్ర కోట్ల కొద్దీ ప్రజల కు ఆశ ను రేకెత్తిస్తూ ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

‘‘రాష్ట్రపతి గారి కి ఇవే హృదయ పూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు. దేశాని కి ఆమె చేస్తున్న అనుకరణీయమైనటువంటి సేవ మరియు సమర్పణ భావం మన అందరికీ ప్రేరణ ను అందిస్తున్నాయి. ఆమె యొక్క జ్ఞానం మరియు పేదల కు, ఇంకా ఆదరణ కు దూరం గా ఉండిపోయిన వర్గాల వారి కి సేవ చేయడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం అనే అంశాలు మనకు ఒక బలమైన మార్గదర్శక శక్తి గా ఉంటున్నాయి. ఆవిడ జీవన ప్రస్థానం కోట్ల కొద్దీ ప్రజల లో ఆశ ను రేకెత్తిస్తున్నది. భారతదేశం ఆమె యొక్క అలుపు ఎరుగని ప్రయాసల కు మరియు దూరదర్శి నాయకత్వాని కి గాను ఎల్లప్పటికీ ఆమె కు కృతజ్ఞురాలు గా ఉంటుంది. ఈశ్వరుడు ఆమెకు ఆరోగ్య భరితం అయినటువంటి జీవనాన్ని మరియు దీర్ఘాయుష్షు ను అందజేయు గాక. @rashtrapatibhvn’’ అని పేర్కొన్నారు.

***

DS/SR