భారతదేశం మరియు పోర్చుగల్ లు రెండు సార్లు పన్ను విధించే పద్ధతిని నివారించడం కోసం ఉద్దేశించిన ఒప్పందాన్ని సవరిస్తూ కుదుర్చుకున్న ఒడంబడికల ప్రాథమిక పత్రం పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదాయం పై పన్నులకు సంబంధించిన ఎగవేతలను నిరోధించడానికి కూడా ఈ ఒడంబడికల ప్రాథమిక పత్రం తోడ్పడుతుంది.
ఈ ఒడంబడికల ప్రాథమిక పత్రం ఒకసారి అమలులోకి వచ్చిందంటే గనుక ఇటు భారతదేశం, అటు పోర్చుగల్ లు పన్నులకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకోగలుగుతాయి. దీనితో, పన్ను ఎగవేతలను అడ్డుకోవడంలో రెండు దేశాల పన్నుల సంబంధ అధికారులకు తోడ్పాటు లభించగలదు.