Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం మరియు టాంజానియా మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రానికి మంత్రిమండలి ఆమోదం


జల వనరుల యాజమాన్యం మరియు అభివృద్ది అంశాలలో భారతదేశం మరియు టాంజానియా ల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఉద్దేశించిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రంపై సంతకాల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఇదివరకటి కన్న అధికంగా సహకారాన్ని ఇచ్చి పుచ్చుకొనే రంగాలలో వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ లు, ఉపరితల జల యాజమాన్యం, భూగర్భ జల యాజమాన్యం మరియు అభివృద్ధి, జలాశయాల నీటి మట్టం పెంపుదలకు తీసుకోదగ్గ చర్యలు వంటివి ఉండబోతున్నాయి. సమన్వయం నెలకొల్పుకొని ప్రావీణ్యాన్ని పంచుకోవడం వల్ల వాటర్ హార్వెస్టింగ్, జల సంరక్షణ, ఉపరితల జలాల, భూగర్భ జల యాజమాన్యం మరియు అభివృద్ధి, జలాశయాల నీటి మట్టం పెంపుదలలో దేశం లాభపడనుంది. నిపుణులను ఒకదేశం నుంచి మరొక దేశానికి పంపడాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, అధ్యయన యాత్రలు, ప్రయోగాత్మక పైన ప్రస్తావించిన రంగాలలోసామర్ధ్య నిర్మాణానికి అనువుగా ప్రయోగాత్మక పద్ధతిలో ముందస్తు అధ్యయనాలు మొదలైన ఇతర కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహించవలసివుంటుంది. ఈ అవగాహనాపూర్వక ఒప్పందంలో భాగంగా చేపట్టే కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటుచేయవలసివుంటుంది.

పూర్వ రంగం:

జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగానది ప్రక్షాళన (డబ్ల్యుఆర్, ఆర్ డి & జి ఆర్) మంత్రిత్వ శాఖ ఇతర దేశాలతో కలసి జల వనరుల అభివృద్ధిలోను, యాజమాన్యంలోను ద్వైపాక్షిక సహకారం కోసం కృషి చేస్తోంది. ఈ సహకారంలో ప్రధానంగా విధానాలు, సాంకేతిక నైపుణ్యం, శిక్షణ కోర్సులు, కార్యశాలలు, శాస్త్రీయ, సాంకేతిక సదస్సులను నిర్వహించడం, నిపుణులను పరస్పరం ఇచ్చి పుచ్చు కోవడం, విజ్ఞాన యాత్రల నిర్వహణ వంటివి కలసి ఉన్నాయి.

2014 జూలై 16న టాంజానియా ప్రభుత్వానికి చెందిన జలవనరులు, నదుల అభివృద్ధి శాఖ మంత్రి న్యూ ఢిల్లీ కి విచ్చేసిన సందర్భంలో ఈ ఇతోధిక సహకారం అంశం వెలుగులోకి వచ్చింది. వాటర్ హార్వెస్టింగ్, యాజమాన్య పద్దతులపై ఉభయ పక్షాలు చర్చించాయి. పరస్పర సంప్రదింపుల అనంతరం ఒక అవగాహనపూర్వక ఒప్పందం కుదుర్చుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకొన్నారు.