Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం మరియు కెనడాల మధ్య తపాలా బిళ్ళల సంయుక్త జారీ అంశం మంత్రివర్గ పరిశీలనకు నివేదన


భారతదేశం, కెనడా లు ‘‘దీపావళి’’ ఇతివృత్తానికి సంబంధించిన రెండు జతల స్మారక తపాలా బిళ్ళలను సంయుక్తంగా జారీ చేయాలని పరస్పర అంగీకారానికి వచ్చిన సంగతిని ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ అధ్యక్ష‌తన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకురావడమైంది. ఈ ఉమ్మడి తపాలా బిళ్ళలను 2017 సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయమై తపాలా విభాగానికి మరియు కెనడా పోస్టుకు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) పై ఇప్పటికే సంతకాలయ్యాయి.

భారతదేశం మరియు కెనడా ల మధ్య ప్రజాస్వామిక విలువలు, బహుత్వ వాదం, అందరికీ సమానత్వం మరియు సమ న్యాయ పరిపాలన అనే అంశాలపై ఆధారపడ్డ సన్నిహిత సంబంధం చాలా కాలం క్రితం నుండే కొనసాగుతూ వస్తోంది. ఉభయ దేశాల ప్రజల మధ్య పటిష్టమైన సంబంధాలు మరియు కెనడాలో భారతీయ సంతతి ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఉండటం ఈ సంబంధానికి ఒక దృఢమైన పునాదిని సమకూర్చాయి.

ఈ సంయుక్త కార్యకలాపానికి గాను- రెండు దేశాలకు ఒక సాంస్కృతిక సంబంధమైన ఇతివృత్తంగా ‘‘దీపావళి’’ ఇతివృత్తం అలరారుతూ ఉండటం మరియు కెనడాలో భారతీయ సంతతి ప్రవాసీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉండడంతో- సంయుక్త తపాలా బిళ్ళల జారీకి ‘‘దీపావళి’’ ఇతివృత్తాన్నే ఎంపిక చేయడమైంది.

***