భారతదేశం ప్రతిభావంతుల నిలయం, నూతన ఆవిష్కరణలు, ధైర్య సాహసాలు ఉప్పొంగే అనేకమంది స్ఫూర్తిమూర్తులు వారి జీవనయాత్రను సాగిస్తున్న నేల ఇది అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యాఖ్యానించారు. గ్రీన్ ఆర్మీ ని ఒక ఉదాహరణగా ఆయన చెబుతూ, గ్రీన్ ఆర్మీ చేస్తున్న పనులు ప్రేరణనిస్తూ మార్గదర్శనం చేస్తున్నాయని ప్రశంసించారు.
శ్రీ మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని రాస్తూ ఆ సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘భారత్ ప్రతిభావంతుల కాణాచి. నవకల్పనలను ఆవిష్కరిస్తున్న, ధైర్య సాహసాలను కనబరుస్తున్న ఎందరో స్ఫూర్తి మూర్తులు ఈ నేల మీద జీవన యాత్రను సాగిస్తున్నారు.
అలాంటి ఎంతో మందితో ఉత్తరాల మాధ్యమం ద్వారా సంప్రదింపులు జరుపుతూ ఉండడం నాకు సంతోషాన్నిస్తోంది. అలాంటి ఒక గాథే గ్రీన్ ఆర్మీది. గ్రీన్ ఆర్మీ చేస్తున్న మార్గదర్శక కార్యక్రమాలు మీకు కూడా స్ఫూర్తిని ఇచ్చేవే’’.
India is a powerhouse of talent, filled with innumerable inspiring life journeys showcasing innovation and courage.
— Narendra Modi (@narendramodi) December 31, 2024
It is a delight to remain connected with many of them through letters. One such effort is the Green Army, whose pioneering work will leave you very inspired. https://t.co/jAQMmW4D9E