మహాత్మా గాంధీ కి సంబంధించి పీటర్‌మారిట్జ్‌బర్గ్ స్టేశన్ ఘటన జరిగి 125వ సంవత్సరం మరియు నెల్సన్ మండేలా శత జయంతి ల సందర్భం గా సంయుక్తం గా భారతదేశం, దక్షిణాఫ్రికా ల ద్వారా తపాలా బిళ్లలను విడుదల చేసే అంశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకురావడమైంది. తపాలా బిళ్ల ల సంయుక్త జారీ కి సంబంధించిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు)పైన 2018 జూలై 24వ తేదీన సంతకాలయ్యాయి.
మహాత్మా గాంధీ పీటర్ మారిట్జ్‌బర్గ్ స్టేశన్ ఘటన కు 125 సంవత్సరాల ఇతివృత్తం తో పాటు నెల్సన్ మండేలా శత జయంతి ఉత్సవాల సందర్భం గా తపాలా బిళ్ల లను సంయుక్తం గా విడుదల చేయడానికి భారతదేశం, దక్షిణాఫ్రికా లు పరస్పరం అంగీకారాన్ని వ్యక్తం చేశాయి. సంయుక్త తపాలా బిళ్ల లు 2018 జూలై 26 వ తేదీ నాడు విడుదల అయ్యాయి.
స్మారక తపాలా బిళ్ల లు భారతదేశానికి సంబంధించి మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికా కు సంబంధించి నెల్సన్ మండేలా ల యొక్క బొమ్మ లతోను పైన ప్రస్తావించిన ఇతివృత్తాల తోను వెలువడ్డాయి.