Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం తో స్వేచ్ఛాయుక్త వ్యాపార ఒప్పందాని కి ఆమోదం తెలిపిన ఆస్ట్రేలియాపార్లమెంటు


భారతదేశం తో స్వేచ్ఛాయుక్త వ్యాపార ఒప్పందాని కి ఆస్ట్రేలియా పార్లమెంటు ఆమోదం తెలిపినందుకు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఎంథనీ అల్బనీస్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలను వ్యక్తం చేశారు.

మన వ్యాపార సముదాయాలు ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఇసిటిఎ) ను ఎంతగానో స్వాగతిస్తాయని, ఇండియా-ఆస్ట్రేలియా కాంప్రిహెన్సివ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను ఇది మరింత బలపరుస్తుందని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఎంథనీ అల్బనీస్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ మరొక ట్వీట్ లో –

ప్రధాన మంత్రి @AlboMP గారు మీకు ఇవే ధన్యవాదాలు. ఇండ్ఆస్ ఇసిటిఎ (IndAus ECTA) కార్యాచరణ లోకి రావడాన్ని మన వ్యాపార సముదాయాలు ఘనం గా స్వాగతిస్తాయి; మరి ఇది ఇండియా-ఆస్ట్రేలియా కాంప్రిహెన్సివ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను మరింత గా బలపరుస్తుంది కూడాను.’’ అని పేర్కొన్నారు.