Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం-జపాన్ వాస్తవ పత్రాలు 


1. భాగస్వామ్య పక్షాల మధ్య నాణ్యమైన మౌలిక సదుపాయాలు, సామర్ధ్య నిర్మాణం ద్వారా అనుసంధానాన్ని పెంపొందించడం ద్వారా ఆర్థికాభివృద్ధి, ఆఫ్రికా తో సహా, ఇండో-పసిఫిక్ ప్రాంతం లో అభివృద్ధి ద్వారా శాంతి ని, సుస్థిరత ను, శ్రేయస్సు ను పెంపొందించుకోవడం కోసం కలసి పనిచేయాలని, భారతదేశం, జపాన్ లు నిర్ణయించాయి. దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవడం, బాధ్యత గల ఋణ ఆర్ధిక పద్ధతు లను, స్థానిక ఆర్ధిక, అభివృద్ధి వ్యూహాలను, ప్రాధాన్యాలతో సహా అభివృద్ధి సహకారం అంతా కూడాను సార్వత్రికంగా, పారదర్శకంగా, ఒక ప్రత్యేకమైన పద్దతిలో, అంతర్జాతీయ ప్రమాణాల ప్రాతిపదికన నిర్వహించాలని రెండు దేశాలు గట్టి నమ్మకం తో ఉన్నాయి.

2. భారతదేశ ‘‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’’, ఆఫ్రికా దేశాలతో భారతదేశ సుస్థిర, సాధారణ నిర్వహణ కోసం ప్రధాన మంత్రి శ్రీ మోదీ రూపొందించిన 10 మార్గదర్శక సూత్రాలు తో పాటు ‘‘నాణ్యమైన మౌలిక సదుపాయాల కోసం జపాన్ రూపొందించిన విస్తృత భాగస్వామ్యం’’, టిఐసిఎడి VI నైరోబి ప్రకటన లను రెండు దేశాలు స్వాగతించాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం లో అనుసంధానం అభివృద్ధి మరియు ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యక్ష సహకారం పెంపొందించుకోడానికీ, ఆతిథేయి ప్రభుత్వాలతో సంప్రదింపులు పెంపొందించుకోడానికీ రెండు దేశాలు కట్టుబడివున్నాయి. ప్రత్యేక సహకారం గుర్తింపు అభివృద్ధి కోసం భారతదేశం, జపాన్ లు ఈ కింద పేర్కొన్న అంశాలను స్వాగతించాయి. అయితే వీటికి మాత్రమే పరిమితం కాదని పేర్కొన్నాయి.

2. 1 శ్రీ లంక లో సహకారం – ఎల్ఎన్ జి – సంబంధిత మౌలికసదుపాయాలు వంటి వాటిలో;

2.2 మయన్మార్ లో సహకారం, గృహనిర్మాణం, విద్య, విద్యుదీకరణ ప్రాజెక్టు లతో పాటు రాఖీనే రాష్ట్రం లో అభివృద్ధి కృషి ని సమన్వయ పరచడం;

2.3 బాంగ్లాదేశ్ లో సహకారం, నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో అనుసంధానాన్నిపెంపొందించడం, రాంగఢ్ నుండి బారైయర్హాట్ వరకు వంతెన నిర్మాణం, రోలింగ్ స్టాక్ అందించడం, జమునా నది పై జమునా రైల్వే బ్రిడ్జి నిర్మాణం; మరియు

2.4 ఆఫ్రికా లో సహకారం, కెన్యా లో ఒక ఎస్ఎమ్ఇ అభివృద్ధి సదస్సు నిర్వహణ వంటివి, కెన్యా లో కేన్సర్ ఆసుపత్రి ని అభివృద్ధి చేయడం వంటి ఆరోగ్య సేవల రంగంలో సహకార ప్రాజెక్టు అవకాశాలను పరిశీలించడం.

3. మానవ వనరుల అభివృద్ధి, సామర్ధ్య నిర్మాణం, ఆరోగ్య పరిరక్షణ, జీవనవిధానం, నీరు, పారిశుధ్యం, డిజిటల్ స్పేస్ వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవలసిన ఆవశ్యకత ను రెండు దేశాలు కూడా గుర్తించాయి. విద్య, ఆరోగ్యం, ఇతర సదుపాయాలలో అవకాశాలను విస్తరించుకోడానికి కలసి పనిచేయడం, ఆఫ్రికా తో సహా ఇండో-పసిఫిక్ ప్రాంత ప్రజలు తమ అభివృద్ధి సామర్ధ్యాలను గుర్తించడం.

4. ఇంకా భారతదేశం, జపాన్ లలో ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ నెట్ వర్క్ అభివృద్ధి కి ఇరు దేశాలకు చెందిన వ్యాపారాల మధ్య ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థ కోసం ఒక భారత్-జపాన్ వ్యాపార వేదిక ను ఏర్పాటు దిశగా రెండు దేశాలు కలసి పనిచేయాలి. ఈ నేపథ్యం లో, రెండు దేశాల మధ్య పటిష్టమైన వ్యాపార ప్రాజెక్టుల అభివృద్ధి కోసం – ఎన్ఇఎక్స్ఐ, ఇసిజిసి ల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందాన్ని రెండు దేశాలూ స్వాగతించాయి.

5. ఇండో- పసిఫిక్ ప్రాంతం లో అభివృద్ధి సహకారం- ఈ ప్రాంతం లో ఒక సమానమైన, సానుకూల, ప్రగతిశీల మార్పుకూ, ఆఫ్రికా సామాజిక ఆర్ధికాభివృద్ధి కీ దోహదపడుతుందని భారతదేశం, జపాన్ లు విశ్వసిస్తున్నాయి.

భారతదేశం- జపాన్ సహకారం ‘యాక్ట్ ఈస్ట్ ఫోరమ్’ :

1. భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’ లోని ప్రధాన ప్రాంతాలలో భారత ఈశాన్య ప్రాంతం ఒకటి. ఆసియాన్ సభ్యత్వ దేశాల తో ఈ ప్రాంతాని కి చారిత్రక, సాంప్రదాయిక బంధాలు ఉన్నాయి. అదే విధంగా ఆసియాన్ ప్రాంతానికి భారతదేశం తరఫున ఆధారం గా నిలబడే సామర్ధ్యం దీనికి ఉంది. దీని సామర్ధ్యాన్ని వెలికితీసి, విజన్ స్టేట్ మెంటు లో పేర్కొన్నట్టు జపాన్, భారతదేశాల మధ్య కుదుర్చుకున్న స్పష్టమైన విధానానికి ఉదాహరణగా – ఈశాన్య ప్రాంతాలు, పొరుగు దేశాల మధ్య అనుసంధానాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరం.

2. ఈశాన్య ప్రాంతం లో భారతదేశం, జపాన్ ల మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి – గత ఏడాది ఏర్పాటైన యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ – ఒక చోదక శక్తి గా సేవలను అందిస్తోంది. ఈ ఫోరమ్ రెండో సమావేశం అక్టోబర్ 8వ తేదీన- దిగువ పేర్కొన్న ఫలితాలతో- జరిగింది.

2.1 అమలును శీఘ్రతరం చేయడం:

మేఘాలయ ఈశాన్య ప్రాంతాల అనుసంధానం

దశ 1 : తురా-డాలు (ఎన్ హెచ్ – 51)

దశ 2 : శిలాంగ్-డాకీ (ఎన్ హెచ్ – 40)

మిజోరమ్ ఈశాన్య ప్రాంతాల అనుసంధానం

దశ 1 & 2 : ఐజావల్ – తైపాంగ్ (ఎన్ హెచ్ -54)

సిక్కిమ్ : జీవ వైవిధ్య పరిరక్షణ మరియు అటవీ యాజమాన్యం

నాగాలాండ్ : అటవీ పరిరక్షణ జీవనోపాధి అభివృద్ధి

2.2 జపాన్ మరియు భారతదేశం కలసి ముందుకు సాగడానికి వారి ఉద్దేశ్యాలను పునరుద్ఘాటించారు:

ధుబ్రీ/ఫుల్ బారీ వంతెన ప్రాజెక్టు తో కలిపి ఎడిబి సహకారం తో గెలీఫు-దాలు కారిడార్ ను పూర్తి చేయడం. ఈశాన్య రోడ్ నెట్ వర్క్ అనుసంధాన అభివృద్ధి ప్రాజెక్టు 3వ దశ కింద చేపట్టిన ఈ సేతువు నిర్మాణం పూర్తయితే భారతదేశంలో ఒక నది పైన నిర్మించిన అత్యంత పొడవైన వంతెనగా ఇది నిలుస్తుంది.

సామాజిక, ఆర్ధిక పరిస్థితులపై సానుకూల ప్రభావం చూపే – ప్రధాన జిల్లా రహదారుల (ఎండీఆర్స్), ఇతర జిల్లా రహదారులు (ఓడీఆర్స్) అభివృద్ధి చేయడం.

“ఉమియం-ఉంత్రూ 3వ దశ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేశన్ పునరుద్ధరణ, ఆధునీకరణ ప్రాజెక్టు” కు ఒడిఎ రుణం.

త్రిపురలో సుస్థిరమైన అటవీ యాజమాన్యం, మేఘాలయాలో కూడా అదేవిధమైన ప్రాజెక్టు పరిశీలన

2.3 నైపుణ్యం మరియు వృత్తి పరమైన కార్యక్రమాలు:

– ఈ ప్రాంతంలో వెదురు కు ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా – “జపాన్-భారత ఈశాన్య వెదురు సంస్థ” ను ప్రారంభించడం.

– విజయవంతంగా నిర్వహించిన “ఈశాన్య వెదురు కార్యశాల” ఆధారంగా – ఈ కార్యక్రమం లో భాగం గా వెదురు ను పారిశ్రామికం గా వినియోగించడం, వెదురు అటవీ నిర్వహణలను చేపట్టడం.

– భారతదేశం లోని 100 ఉన్నత విద్యా సంస్థల్లో జపాన్ భాష లో సర్టిఫికెట్ కోర్సు ను ప్రారంభించాలని – ఇరువురు ప్రధానులు తీసుకున్న నిర్ణయంలో భాగంగా – ఈశాన్య ప్రాంతం లో జపాన్ భాష లో విద్య ను ప్రోత్సహించడం. ఇటువంటి కోర్సు ను ప్రారంభించడానికి – కాటన్ విశ్వవిద్యాలయం, అసమ్ లోని గువాహాటీ విశ్వవిద్యాలయం, మేఘాలయ లోని ఇఎఫ్ఎల్ విశ్వవిద్యాలయం, నాగాలాండ్ లోని ఎన్ఐటి-ఎన్ సంస్థ లు వ్యక్తం చేసిన ఆసక్తి ని ఫోరమ్ స్వాగతించింది. జపాన్ భాషా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ద్వారా అవసరమైన సహాయాన్ని అందించడానికి జపాన్ సంసిద్ధత ను ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల నుండి మరిన్ని ప్రతిపాదన లను ఫోరమ్ ఆహ్వానిస్తోంది.

– ఆసియా ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసం దోహదపడే – టిఐటిపి (సాంకేతిక శిక్షణ కార్యక్రమం) కింద ఈశాన్య ప్రాంతం నుండి శిక్షణ కోసం జపాన్ కు వెళ్లే సంరక్షకులతో సహా, జపాన్ భాష నేర్చుకోవడం వంటి నైపుణ్య శిక్షణ ను భారతదేశం, జపాన్ ప్రోత్సహిస్తాయి.

2.4 విపత్తు నిర్వహణ :

– పర్వత ప్రాంతాల లోని రహదారుల పై సామర్ధ్య నిర్మాణ ప్రాజెక్టు ద్వారా ఈశాన్య ప్రాంతం లో స్థితి స్థాపక అంతర్గత నిర్మాణాలకు జపాన్ సహకారం

– విపత్తు ప్రమాదాల తగ్గింపు పై జపాన్- భారత్ కార్యశాల ద్వారా పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడం.

– ఈశాన్య ప్రాంతం లోని అధికారులకు సంబంధించిన శిక్షణ అవకాశాలు కల్పించడం కోసం జిఐసిఎ నాలెడ్జ్ కో-క్రియేశన్ కార్యక్రమం (గ్రూప్ & రీజియన్ ఫోకస్) ను బాగా ఉపయోగించుకునే సాధన చేయడం.

3. ఈ చర్యల క్రింద చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతిని ఫోరమ్ సమీక్షించాలి మరియు భారత ఈశాన్య ప్రాంతం గురించి భవిష్యత్ సహకారంపై మరింత పరిశీలన జరపాలి.

భారత- జపాన్ ఆర్ధిక మరియు ఒడిఎ సహకారం :

భారత సామాజిక ఆర్థికాభివృద్ధికి జపాన్ ఒడిఎ అందించిన ముఖ్యమైన సహకారాన్ని గుర్తించి, ఇరు దేశాల మధ్య సంబంధాలను సూచించే విధంగా జపాన్ అందిస్తున్న నిరంతర సహకారాన్ని భారతదేశం ప్రశంసించింది. ఈ నేపథ్యం లో జపాన్ అందిస్తున్న సహకారాన్ని భారతదేశం, జపాన్ సంతృప్తి తో దిగువ అంశాలను సమీక్షించాయి.

జపాన్ ఒడిఎ రుణం :

2017 సెప్టెంబర్ లో జరిగిన గత సదస్సు తరువాత, ఒడిఎ రుణాలు పొందిన ప్రాజెక్టులు :

 

– బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి ప్రాజెక్టు (మూడో దశ) (I) [కర్ణాటక]

– ముంబయి మెట్రో లైన్ 3 ప్రాజెక్టు (II) [మహారాష్ట్ర]

– చెన్నై సముద్ర జలాలను మంచినీటి గా మార్చే ప్రాజెక్టు (I) [తమిళనాడు]

– హిమాచల్ ప్రదేశ్ అటవీ పర్యావరణ వ్యవస్థ యాజమాన్యం మరియు జీవనోపాధి అభివృద్ధి ప్రాజెక్టు [హిమాచల్ ప్రదేశ్]

– చెన్నై మెట్రోపాలిటన్ ప్రాంతం లో రవాణా వ్యవస్థ ల ఏర్పాటు కోసం ప్రాజెక్టు [తమిళ నాడు]

13వ సదస్సు సందర్భంగా, ముంబయి-అహమదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు (II) తో సహా క్రింది ప్రాజెక్టులకు సంబంధించిన పత్రాలను పరస్పరం ఇచ్చి పుచుకుని సంతకాలు చేసే కార్యక్రమం జరిగింది:

– ముంబయి-అహమదాబాద్ హై స్పీడ్ రైల్ (II) నిర్మాణ ప్రాజెక్టు [మహారాష్ట్ర మరియు గుజరాత్]

– ఉమియం- ఉంత్రూ 3వ దశ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేశన్ పునర్నిర్మాణం మరియు ఆధునికీకరణ కోసం ప్రాజెక్టు [మేఘాలయ]

– ఢిల్లీ మాస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం ప్రాజెక్టు (3వ దశ) (III) [ఢిల్లీ]

– ఈశాన్య రోడ్ నెట్ వర్క్ కనెక్టివిటీ ఇంప్రూవ్ మెంటు ప్రాజెక్టు (3వ దశ) (I) [అసమ్ లోని ధుబ్రీ మరియు మేఘాలయ లోని ఫుల్ బారీ]

– తుర్గా పంప్ డ్ స్టోరేజ్ (I) ప్రాజెక్ట్ నిర్మాణం [పశ్చిమ బెంగాల్ లోని పురూలియా]

– చెన్నై పెరిఫెరల్ రింగు రోడ్డు (మొదటి దశ) నిర్మాణం ప్రాజెక్టు [తమిళ నాడు]

– త్రిపురలో సుస్థిర పరీవాహక అటవీ యాజమాన్యం కోసం ప్రాజెక్టు [త్రిపుర]

 

వీటికి అదనంగా, భారతదేశం లో పాడి పరిశ్రమ అభివృద్ధి కి సంబంధించి ఒడిఎ రుణం త్వరలో అందగలదన్న ఆశాభావాన్ని భారతదేశం వ్యక్తం చేసింది.

మహారాష్ట్ర లో నాగ్ పుర్ వద్ద నాగ్ నది లో కాలుష్య నియంత్రణ పై సన్నాహక సర్వేక్షణ లు, మధ్య ప్రదేశ్ లో గ్రామీణ నీటి సరఫరా, మేఘాలయ లో సామాజిక అడవులు, నీటి యాజమాన్యం మొదలైనవి కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. భారతదేశం లో ఎస్ డి జి ల అభివృద్ధికి ఒడిఎ రుణం ద్వారా సహకారం కోసం భారతదేశం, జపాన్ లకు చెందిన సంబంధిత అధికారులు చర్చలు జరపడాన్ని కూడా భారతదేశం స్వాగతించింది

వారాణసీ కన్వెన్షన్ సెంటర్ :

వారాణసీ లో అంతర్జాతీయ సహకారం మరియు సమావేశ మందిరం నిర్మాణం ప్రాజెక్టు ప్రగతి ని రెండు పక్షాలు స్వాగతించాయి. ఇది భారతదేశం, జపాన్ ల మధ్య స్నేహానికి ప్రతీకగా నిలిచింది. జపాన్ ఇప్పటికే అందజేసిన అదనపు సహాయాన్ని భారతదేశం ప్రశంసించింది.

ట్రాఫిక్ రద్దీ ని మెరుగుపరచడం మరియు పట్టణ పర్యావరణం :

2017 డిసెంబర్ లో బెంగళూరు లో అధునాతన ట్రాఫిక్ సమాచారం మరియు నిర్వహణ విధానం అమలు ప్రాజెక్టుకు సహాయం కోసం పత్రాలపై సంతకాలు చేసినందుకు భారతదేశం కూడా ప్రశంసించింది.

రైల్వేల లో భారతదేశం- జపాన్ సహకారం:

ముంబయి అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్

భారతదేశం లో సంధానాన్ని పెంపొందించడానికీ, హై స్పీడ్ రైలు ప్రవేశపెట్టడానికీ, ముంబయి అహమదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎంఎహెచ్ఎస్ఆర్) నిర్మాణానికి భారతదేశం, జపాన్ సహకరించుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత దృష్ట్యా, దీని పనితీరును సంయుక్త కమిటీ మీటింగ్ (జె సి ఎమ్) రూపంలో ఉన్నత స్థాయి సమీక్షిస్తున్నారు. ఈ కమిటీ కి భారతదేశం తరఫున నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజీవ్ కుమార్, జపాన్ దేశం తరఫున ప్రధాని శ్రీ శింజో ఆబే కి ప్రత్యేక సలహాదారు గా వ్యవహరిస్తున్న డాక్టర్ హిరోతో ఇజుమీ లు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు.

ఎంఎహెచ్ఎస్ఆర్ పై 2018 సెప్టెంబర్ 17వ తేదీ న జరిగిన జెసిఎమ్ 8వ సమావేశం – ప్రాజెక్టు స్థిరమైన పురోగతి ని సాధిస్తున్నట్లు ధ్రువీకరించింది. ఈ ప్రాజెక్టు విజయానికి పరస్పరం మరింత సహకారాన్ని కొనసాగించాలని కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి. ఎంఎహెచ్ ఎస్ ఆర్ ప్రాజెక్టు సంబంధించిన రహదారులు, స్టేషన్ ప్లాజా ల వంటి వివిధ పనుల పురోగతి ని పరిశీలించేందుకు జపాన్ ప్రభుత్వానికి చెందిన భూమి, మౌలిక సదుపాయాలూ, రవాణా, పర్యాటక శాఖల మంత్రి శ్రీ కెయిచి ఇషియి 2017 డిసెంబర్ నెల లో, మరియు భూమి, రవాణా, పర్యాటక శాఖల పార్లమెంటరీ సహాయ మంత్రి శ్రీ మసతోషి అకిమోతో 2018 మే నెలలో భారతదేశం లో పర్యటించారు.

2018 సెప్టెంబర్ లో జెఐసిఎ అప్రైజల్ మిశన్ పూర్తి కావడంతో, జిఐసిఎ మరియు డిఇఎ ల మధ్య మొదటి విడత జపాన్ ఒడిఎ రుణానికి సంబంధించిన రుణ పత్రాలపై 2018 సెప్టెంబర్ 28వ తేదీన సంతకాలు జరగడంతో – సదస్సు సమావేశం సందర్భంగా, ఎంఎహెచ్ఎస్ఆర్ ప్రాజెక్టు కోసం రెండో విడత జపాన్ ఒడిఎ రుణానికి సంబంధించిన పత్రాలు, రుణ ఒప్పందాలూ ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది.

ప్రస్తుత పరిస్థితి : ఈ ప్రాజెక్టు అమలు సంస్థ గా జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేశన్ లిమిటెడ్ (ఎన్ఎహెచ్ఎస్ఆర్ సిఎల్) వ్యవహరిస్తోంది. ఈ ప్రాజెక్టు స్థలం తుది సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. తుది అమరిక ప్రకారం, భూగర్భ మరియు ఓవర్ హెడ్ వినియోగాలన్నింటినీ గుర్తించడం జరిగింది. ముంబయి, అహమదాబాద్ ల మధ్య భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 487 కిలోమీటర్ల లో ఇప్పటివరకు 328 కిలోమీటర్ల మేర సంయుక్త కొలతల సర్వేక్షణ పూర్తి అయింది. హై స్పీడ్ రైల్ శిక్షణ సంస్థ తో సహా మొత్తం ప్రాజెక్టు ను 26 కాంట్రాక్టు ప్యాకేజీ లుగా విభజించారు. వీటిలో 4 ప్యాకేజీ లను ఇప్పటికే కేటాయించారు. స్మార్ట్ మరియు స్థిరమైన సమీకృత రవాణా వ్యవస్థ కు అత్యంత ప్రధానమైన మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక పనులు మొత్తం 12 స్టేశన్ లలో కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రిత్వశాఖ, ఎన్ఎహెచ్ఎస్ఆర్ సిఎల్ మరియు జపాన్ కు చెందిన కన్సల్టెంట్స్ తో జనరల్ కన్సల్టెన్సీ కోసం ఒప్పందం పై జెఐసిఎ సంతకం చేసింది. ఈ ప్రాజెక్టు లో ఇది ఒక ముఖ్యమైన పురోగతి.

వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డిఎఫ్ సి)

ముంబయి-ఢిల్లీ మార్గం లో రద్దీ తగ్గాలనే ఉద్దేశ్యం తో జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ టెర్మినల్ (జెఎన్ పి టి) నుండి దాద్రి వరకు 1,522 కిలోమీటర్ల వెస్టర్న్ డి ఎఫ్ సి ప్రాజెక్టు ను జెఐసిఎ నిధులతో చేపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితి : డి ఎఫ్ సి – సివిల్ ప్యాకేజ్ లలో 48 శాతం పురోగతి సాధించింది. 802 కిలోమీటర్ల మేర కారిడార్ మార్గం పూర్తయ్యింది. సుమారు 99 శాతం భూ సేకరణ పూర్తయ్యింది. రూ. 33,130 కోట్లు (జెపివై 523 బిలియన్ లు) మేర టెండర్లు కేటాయించడం జరిగింది. నేశనల్ కేపిటల్ రీజియన్ (ఎన్ సిఆర్) – ముంబయి మధ్య వాయువ్య రైల్వే లోని జయ్ పుర్ డివిజన్ లో డి ఎఫ్ సి లో భాగమైన అతేలి-ఫూలేరా సెక్షన్ లో 190 కిలోమీటర్ల మార్గంపై 2018 ఆగస్టు 15వ తేదీ న భారతీయ రైల్వే కు చెందిన గూడ్స్ రైలు ట్రయిల్ రన్ ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

భవిష్యత్ సహకారం

(i) మేక్ ఇన్ ఇండియా : మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను నెరవేర్చే దిశ లో భాగం గా ఎంఎహెచ్ఎస్ఆర్ ప్రాజెక్టు లో జపాన్ రాయబార కార్యాలయానికి చెందిన డిఐపిపి, ఎన్ హెచ్ఎస్ఆర్ సిఎల్, ఎమ్ఎల్ఐటి మరియు ఎమ్ఇటిఐ లతో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సివిల్ పనులు, ట్రాక్ పనులు, (సిగ్నల్ & టెలికమ్ తో సహా) ఎలక్ట్రికల్ పనులు మరియు రోలింగ్ స్టాక్ పేరు తో 4 సబ్ గ్రూపు లను సిఫారసు చేసి ఆమోదించారు. మొత్తం 24 రైలు జత లలో మేక్ ఇన్ ఇండియా లో భాగం గా 6 జతల రైళ్ల ను తయారు చేస్తారు.

(ii) శిక్షణ : జెఐసిఎ ద్వారా జపాన్ ఒడిఎ రుణాన్ని వినియోగించుకుని ఒక కొత్త హై స్పీడ్ రైల్ శిక్షణ సంస్థ ను వడోదర లోని భారతీయ రైల్వేల జాతీయ అకాడమీ ఆవరణ లోనిర్మిస్తున్నారు. మొత్తం మూడు కాంట్రాక్టు లలో రెండు కాంట్రాక్టులను కేటాయించడం జరిగింది. శిక్షణ సంస్థ కు చెందిన మూడో టెండర్ ను 2018 జూలై నెల లో ఆహ్వానించారు. 2018 డిసెంబర్ నాటికి ఆ టెండర్ ఖరారు అవుతుందని భావిస్తున్నారు. శిక్షణ సంస్థ నిర్మాణం ప్రారంభమైంది. 2020 డిసెంబర్ నాటికి ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమైన హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు పనుల కోసం సమృద్ధిగా మానవ వనరుల కల్పన కు రైల్వే మంత్రిత్వ శాఖ కు చెందిన 480 మంది, ఎన్ హెచ్ఎస్ఆర్ సిఎల్ కు చెందిన 120 మంది అధికారులకు 2018 & 2019 సంవత్సరాల లో శిక్షణ ఇప్పించాలని 7వ జెసిఎమ్ లో అంగీకారం కుదిరింది. హై స్పీడ్ రైల్వే సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పటికే 2017-18 లో భారతీయ రైల్వే కు చెందిన 287 మంది యువ అధికారులు జపాన్ లో శిక్షణ పొందారు. భారతీయ రైల్వే అధికారులకు అవసరమైన శిక్షణ ను ఇవ్వడానికి జపాన్ విశ్వవిద్యాలయాల్లోని మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ఏడాది కి 20 సీట్లు చొప్పున జపాన్ ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం, జపాన్ లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో 17 మంది అధికారులు మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. 2019 సంవత్సరానికి గాను 20 సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరారు.

(iii) మౌలిక సదుపాయాలు మరియు సాంకేతిక సహకారాన్ని మెరుగుపరచడం: రైల్వే లో భద్రత కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలలో భాగంగా ఈ విషయమై అనుసరించవలసిన ఉత్తమమైన విధానాలను అధ్యయనం చేయడానికి జపాన్ తో భారతదేశం సహకరిస్తోంది. రైల్ వెల్డింగ్ మరియు భద్రత యాజమాన్యం పరిస్థితి ని పరిశోధించడానికి జిఐసిఎ సాంకేతిక సహకారం కింద, జపాన్ కు చెందిన భద్రత నిపుణుల బృందం భారతీయ రైల్వే ను సందర్శించింది. రైల్ వెల్డింగ్ మెలకువలు మరియు రోలింగ్ స్టాక్ నిర్వహణ తో సహా ట్రాక్ నిర్వహణ పై రైల్వే నెట్ వర్క్ భద్రత కు సంబంధించి భద్రత మెరుగుదలకు భారతీయ రైల్వేలు మరియు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సామర్ధ్య అభివృద్ధి కోసం సాంకేతిక సహకారం కింద “రైల్వే భద్రత పై సామర్ధ్య అభివృద్ధి ప్రాజెక్టు” ను చేపట్టడం జరిగింది.

‘‘మేక్ ఇన్ ఇండియా’’ లో భారతదేశం, జపాన్ ల సహకారం:

2017 సెప్టెంబర్ లో ఎమ్ఇటిఐ కి, డిఐపిపి కి మధ్య కుదిరిన ‘‘జపాన్- భారత పెట్టుబడి ప్రోత్సాహక మార్గసూచీ’’ ఆధారంగా గుజరాత్ లోని అహమదాబాద్ లో జెఇటిఆర్ఒ కు చెందిన బిజినెస్ సపోర్ట్ సెంటర్ (బిఎస్ సి) ని ఈ ఏడాది జూలై నెల లో ప్రారంభించడం తో పాటు జపాన్ లోను, భారతదేశం లోను అనేక పెట్టుబడి ప్రోత్సాహక సదస్సులను నిర్వహించడం జరిగింది.

దాదాపు 60 జపాన్ కంపెనీలు ప్రతిపాదించిన ప్రయివేటు రంగ పెట్టుబడి ప్రాజెక్టులను 2018 అక్టోబర్ 29వ తేదీన ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి చూపించడం జరిగింది. వీటిని ఇన్వెస్ట్ ఇండియా మరియు జెఇటిఆర్ఒ లు నిర్వహిస్తాయి. వీటిలో ‘‘మేక్ ఇన్ ఇండియా’’కు దోహదపడే ఆటోమొబైల్, ఉక్కు, ఎలక్ట్రానిక్స్, ఐఒటి, ఎఐ, రసాయనాలు, ఫూడ్ ప్రాసెసింగ్ మొదలైన రంగాలు ఉన్నాయి. వీటికి మొత్తం సుమారుగా 280 బిలియన్ జపాన్ యెన్ లు పెట్టుబడి అంచనా వేయగా వీటి ద్వారా భారతదేశం లో 29 వేలకు పైగా అదనపు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

డిజిట‌ల్ భాగ‌స్వామ్యంలో ఇండియా-జ‌పాన్ స‌హ‌కారం.

ప్ర‌స్తుత సాంకేతిక ప‌రిజ్ఞాన శ‌కంలో , ఇండియా ,జ‌పాన్‌లు క‌ల‌సి క‌ట్టుగా ముందుకు దూసుకుపోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అలాగే సుల‌భ‌త‌ర జీవ‌నాన్ని ప్రోత్స‌హించేందుకు జ‌పాన్ వారి సొసైటీ5.0, భార‌త ఫ్లాగ్‌షిప్ కార్య‌క్ర‌మాలైన డిజిట‌ల్ ఇండియా, స్మార్ట్‌సిటీ, స్టార్ట‌ప్ ఇండియాల వంటి కార్య‌క్ర‌మాల విష‌యంలో ఉమ్మ‌డి స‌హ‌క‌రించుకోవ‌డానికి అలాగే కృత్రిమ మేధ‌స్సు , ఇంట‌ర్‌నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వాటిలోప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవ‌డానికి నిర్ణ‌యించాయి.
ఇందుకు సంబంధించి జ‌పాన్‌ఆర్థిక, వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ( ఎం.ఇ.టి.ఐ), అలాగే భార‌త్‌కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్న‌ల‌జీ (ఎం.ఇ.ఐ.టి వై) లు 2018 వ‌ర‌కు 6రౌండ్ల జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ స‌మావేశాలు నిర్వ‌హించాయి. భార‌త క‌మ్యూనికేష‌న్ మంత్రిత్వ‌శాఖ‌, జ‌పాన్‌కు చెందిన ఆంత‌రంగిక వ్య‌వ‌హారాలు, క‌మ్యూనికేష‌న్ శాఖ ఐసిటి రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి ఇండియా -జ‌పాన్ జాయింట్‌వ‌ర్కింగ్ గ్రూపు ఐద‌వ స‌మావేశం కింద 2018లో ఒక సంయుక్త ప‌త్రంపై సంత‌కాలు చేశాయి.
ఈ నేప‌థ్యంలో ఇరువురు ప్ర‌ధాన‌మంత్రులూ , ఇండియా, జ‌పాన్ డిజిట‌ల్ భాగ‌స్వామ్యాన్ని స్వాగ‌తించారు. ఇందుకు అనుగుణంగా ఇండియా-జ‌పాన్ స్టార్ట‌ప్ హ‌బ్ ప‌రిధిని విస్త‌రించ‌డంతోపాటు డిజిట‌ల్ టెక్నాల‌జీల‌పై ప్ర‌త్యేక దృష్టి పేట్టే ఉద్దేశంతో ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ(ఐసిటి) రంగంలో కొత్త అవ‌కాశాల అన్వేష‌ణ ,ప్ర‌స్తుత స‌హ‌కారాన్ని మ‌రింత ముందుకు తీసుకుపోయేందుకు జ‌పాన్‌కు చెందిన ఎం.ఇ.టి.ఐ, ఇండియాకు చెందిన ఎం.ఇ.ఐ.టి.వై ల‌మ‌ధ్య స‌హ‌కార అవ‌గాహ‌న రూపంలో సంత‌కాలు జ‌రిగాయి.
ఇండియా జ‌పాన్‌ల మ‌ధ్య స్టార్ట‌ప్ హ‌బ్ః ఇండియా -జ‌పాన్ స్టార్ట‌ప్ హ‌బ్ ఏర్పాటు చేయాల‌ని 2017 ఇండియా ,జ‌పాన్ వార్షిక శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నంలో విడుద‌ల చేసిన సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను ఆచ‌ర‌ణ‌లోకి తెచ్చేందుకు ఉభ‌య‌ప‌క్షాలూ జ‌పాన్‌- ఇండియా చొర‌వ‌కు సంబంధించిన సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను జారీచేశాయి. ఈ ప్ర‌క‌ట‌న‌పై ఎం.ఇ.టి.ఐ మంత్రి సెకో భార‌త్ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఈ ఏడాది మేలో సంత‌కాలు జ‌రిగాయి. ఇందులో బెంగ‌ళూరు జె.ఇ.టి.ఆర్‌.ఒ వ‌ద్ద స్టార్ట‌ప్ హ‌బ్ ఏర్పాటు కు నిర్ణ‌యించారు. జ‌పాన్ మార్కెట్ల‌కోసం,జ‌పాన్ ఇన్వెస్ట‌ర్ల‌కోసం భార‌తీయ స్టార్ట‌ప్‌ల గుర్తింపు, వాటితో మ‌రింత స‌హ‌కారానికి నిర్ణ‌యించారు.అలాగే ఇన్వెస్ట ఇండియా ఏర్పాటు చేసిన‌ జ‌పాన్‌-ఇండియా స్టార్ట‌ప్‌హ‌బ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం కూడా ఇదే సేవ‌ల‌ను అందిస్తుంది.
ప్ర‌తిభ‌కు అవ‌కాశంః ఇరు దేశాల‌లోని ప‌రిశ్ర‌మ‌ల అనుభ‌వాలు, పోటీత‌త్వం నుంచి ప్ర‌యోజ‌నం పొందాలంటే ఇండియా, జ‌పాన్‌ల మ‌ధ్య ప్ర‌తిభ మార్పిడికి అవ‌కాశం ఉండాలి. దీనిని సాకారం చేసేందుకు ఐ-జెడిపి ఇప్ప‌టికే ఉన్న శిక్ష‌ణ అవ‌కాశాలు, ఇంట‌ర్న్‌షిప్ కార్య‌క్ర‌మాలు, జాబ్‌ఫెయిర్ ల ఏర్పాటు (జ‌పాన్ కెరీర్ ఫెయిర్‌),అత్యంత నైపుణ్యాలు క‌లిగిన భార‌తీయ వృత్తిదారుల‌కు స్టార్ట‌ప్‌కార్య‌క్ర‌మం ప్ర‌వేశ‌పెట్ట‌డం( గ్రీన్ కార్డ్‌, అత్యంత నైపుణ్యాలు క‌లిగిన వృత్తిదారుల వీసా), జెఇసి కోర్సుల‌ను ఐటి, ఎల‌క్ట్రానిక్ సంస్థ‌ల‌కు విస్త‌రింప చేయ‌డం వంటివి చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది.
ప‌రిశోధ‌న అభివృద్ధిరంగంలో స‌హ‌కారంః నీతిఆయోగ్‌తో అనుసంధాన‌త‌ను ప్ర‌మోట్ చేసేందుకు , అలాగే ఎం.ఇ.టి.ఐ, ఇండియాలో ఆర్టిఫిషియ‌య‌ల్ ఇంటెలిజెన్స్ రిస‌ర్చ్ జాతీయ కార్య‌క్ర‌మాన్ని ప్రోత్స‌హించేందుకు నిర్ణ‌యించారు. ఇందుకు సొసైటీ5.0 కార్య‌క్ర‌మం కింద అధునాత‌న టెక్నాల‌జీని ప్రోత్స‌హిస్తారు. దీనికి సంబంధించి ఇండియా, జ‌పాన్‌లు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సు విష‌య‌మై నీతిఆయోగ్‌, ఎం.ఇ.టి.ఐలమ‌ధ్య‌ ప‌రస్ప‌ర స‌హ‌కారానికి ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ ఒప్పందంపై సంత‌కాలు చేశాయి.ఇందుకు జ‌పాన్‌లోని ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రిజెర్చ్ సెంట‌ర్ అయిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆడ్వాన్సుడు ఇండ‌స్ట్రియ‌ల్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, భార‌త్‌లోని ఐఐటి హైద‌రాబాద్‌ల మ‌ద్య ప్ర‌త్యేక వ్య‌వ‌స్థాగ‌త స‌హ‌కారానికిగ‌ల అవ‌కాశాల‌ను అన్వేషించాల‌నీ నిర్ణ‌యించారు.

భ‌ద్ర‌తా కోణంతో ముడిప‌డిన ఐసిటి సంబంధిత ప్రాజెక్టులుః
అధునాత‌న‌, భ‌ద్ర‌మైన సాంకేతిక ప‌రిజ్ఞానం ఆవ‌శ్య‌క‌త‌ను దృష్టిలో ఉంచుకుని ఈ భాగ‌స్వామ్యంకింద ఇండియా,జ‌పాన్‌లు భ‌విష్య‌త్ డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాలు, టెలికం భ‌ద్ర‌త వంటి వాటి విష‌యంలో భ‌ద్ర‌త‌కు సంబంధించి ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకునే అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోనున్నాయి.
చెన్నై, అండ‌మాన్ దీవుల‌ను క‌లుపుతూ ఇండియాకు చెందిన భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్‌, జపాన్‌కు చెందిన ఎన్‌.ఇ.సిలు స‌బ్‌మెరైన్ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్‌కేబుల్ ఏర్పాటుకు తీసుకుంటున్న చొర‌వ‌ను ఇరు దేశాల నాయ‌కులు స్వాగ‌తించారు. వీటి వ్యూహాత్మ‌క ప్రాధాన్య‌త దృష్ట్యా, స‌బ్‌మెరైన్ కేబుల్ ప్రాజెక్టుల అభివృద్ధిలో ఇరు ప‌క్షాలూ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోనున్నాయి.
ఎల‌క్ట్రానిక్స్ ఎకో సిస్ట‌మ్ః
ఇండియా, జ‌పాన్‌లు ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ రంగంలో భాగ‌స్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఎల‌క్ట్రానిక్ ఎకో సిస్ట‌మ్ డిజైన్‌, దాని సంబంధిత సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీలు, అప్రాధాన్యవ‌స్తు మార్కెట్‌కు అవ‌స‌ర‌మైన ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల త‌యారీ రంగంలోనూ ఇరుదేశాలూ స‌హ‌కారాన్నిఏర్ప‌రుచుకోవ‌డం జ‌రుగుతుంది.
డిజిటల్ కార్ప‌రేట్ భాగ‌స్వామ్యంః ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఐటి) రంగంలో కార్ప‌రేట్‌, బిజినెస్ అనుసంధాన‌త‌లను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో ఇండియా, జ‌పాన్‌లు మాచింగ్ ఈవెంట్‌లు , వ్యాపార సంప్ర‌దింపుల బృందాల‌ను పంప‌డం వంటి చ‌ర్య‌లు తీసుకుంటాయి. టెలిక‌మ్యూనికేష‌న్‌రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి భార‌త క‌మ్యూనికేష‌న్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌, బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌కు
జ‌పాన్‌కు చెందిన ఎన్‌టిట‌టి-ఎటి మ‌ధ్య ఒక అవ‌గాహ‌నా ఒప్పందం పై సంత‌కాలు జ‌రిగాయి
భార‌త్‌వైపు నుంచి నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ స‌ర్వీసెస్ కంపెనీలు (నాస్‌కామ్‌), జ‌పాన్ వైపు నుంచి గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ హిరోషిమాలు జ‌పాన్‌లో తోలి ఐటి కారిడార్‌ను ఏర్పాటు చేశాయి. హార్డ్‌వేర్‌వైపు జ‌పాన్ అనుకూల‌త‌ల‌ను, సాఫ్ట్‌వేర్ వైపు భార‌త్ అనుకూల‌త‌ల‌ను ఉప‌యోగించి గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌ను స‌మ‌ష్టిగా రూపొందించ‌డానికి దీనిని ఏర్పాటు చేశారు.
ఇండియా, జ‌పాన్‌ల మ‌ధ్య వ్య‌వ‌సాయం, ఫుడ్ ప్రాసెసంగ్‌, ఆహార భ‌ద్ర‌త‌, అడ‌వులు, మ‌త్స్య సంప‌ద‌కు సంబంధించి ఇండియా, జ‌పాన్‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం.
ఎ . వ్య‌వ‌సాయం.
1.ఎం.ఎ.ఎఫ్‌.ఎఫ్‌,అలాగే ఎం.ఒఎఫ్ డ‌బ్ల్యు ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కార ఒప్పందం(ఎం.ఒ.సి) ఆధారిత జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
(1) మెమోరాండం ఆప్ కో ఆప‌రేష‌న్‌(ఎం.ఒ.సి) పై 2016 న‌వంబ‌ర్ 11న సంత‌కాలుజ‌రిగాయి. ( ప్ర‌ధాన‌మంత్రి జ‌పాన్ సంద‌ర్శించిన‌పుడు ఈ సంత‌కాలు జ‌రిగాయి)
(2) తోలి జాయింట్ గ్రూప్ (జె.డ‌బ్ల్యు.జి) 2017 నవంబ‌ర్‌6న జ‌రిగింది. (వ‌ర‌ల్డ్ ఫుడ్ ఇండియా-డ‌బ్ల్య‌.ఎఫ్‌.ఐ 2017 త‌ర్వాత జ‌రిగింది)
ఎ) స‌హ‌కారానికి సంబంధించి మూడు అంశాల గుర్తింపు
1) వ్య‌వ‌సాయ ఉత్పాద‌క‌త 2) ఫుడ్ ప్రాసెసింగ్ 3) మ‌త్స్య సంప‌ద‌
3)వ్య‌వ‌సాయం, చేప‌ల పెంప‌కంరంగంలో ఇండియాలోకి పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌కానికి జ‌పాన్ కార్య‌క్ర‌మం…
మొద‌టి సంయుక్త వ‌ర్కింగ్ గ్రూప్‌లో జ‌రిగిన చ‌ర్చ‌ల ఆధారంగా (వ్య‌వ‌సాయ, అడ‌వీ, మ‌త్య్య మంత్రిత్వ‌శాఖ‌, అలాగే వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌) భార‌త దేశంలోకి పెట్టుబ‌డులను వ్య‌వ‌సాయం, మ‌త్స్య రంగంలో ప్రోత్స‌హించేందుకు 2018 అక్టోబ‌ర్ 29న ఒక ఒప్పందంపై సంత‌కాలు జ‌రిగాయి.
4) ఐఎస్ఇ ఫుడ్స్ తెలంగాణా మెగా ప్రాజెక్టుకు జ‌పాన్ – ఇండియా ఫుడ్‌బిజినెస్ కౌన్సిల్ మ‌ద్ద‌తు నిస్తోంఇ. ఇది ఈ కార్య‌క్ర‌మం కింద న‌మోదైన తొలి పెట్టుబ‌డి కార్య‌క్ర‌మం.
2. ఇండో – జ‌పాన్ అగ్రిక‌ల్చ‌ర‌ల్‌సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌
1. జ‌పాన్ సాంకేతిక ప‌రిజ్ఞానాన్నిఉప‌యోగించి వ్య‌వ‌సాయ ఉత్పాద‌క‌త మెరుగుప‌ర‌చ‌డానికి.ఎ.ఎఫ్‌.ఎఫ్‌, ఎం.ఎ.ఎఫ్‌.డ‌బ్ల్యులు ఏ ర‌కంగాకృషి చేయ‌గ‌ల‌వ‌న్న దానిపై చ‌ర్చించ‌డం జ‌రిగింది.
2. ఇందుకు సంబంధించిన ఒక ఆలోచ‌న ప్ర‌కారం ఇండో- జ‌పాన్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌ఫ‌ర్ ఎక్స‌లెన్స్‌ను ఏర్పాటుచేసి ఇక్క‌డ జ‌పాన్ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించ‌డంతోపాటు వాటిని అందుబాటులోకి తెచ్చి ఈ సాంకేతిక ప‌రిజ్ఞానంతో త‌యారైన ఉత్ప‌త్తుల‌ను అమ్మ‌డం
3 ప‌రిశోధ‌న‌లో స‌హ‌కారంః
1) జ‌పాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ రిసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ సైన్సెస్ (జెఐఆర్‌సిఎఎస్‌), ఇండియ‌న్‌కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌రల్ రిసెర్చ్‌(ఐసిఎఆర్‌) ల మ‌ధ్య 2018 ఫిబ్ర‌వ‌రి 9న ఎం.ఒ.యుపై సంత‌కాలు జ‌రిగాయి.
2) ఇందుకు సంబంధించిన ప్రారంభ‌స‌మావేశం 2018 జూన్ 15న క‌ర్నాల్‌లో జ‌రిగింది. ఇందులో సుస్థిర వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తి కోసం ల‌వ‌ణ ప్ర‌భావిత పొలాల‌లో త‌క్కు ఖ‌ర్చు కాగ‌ల స‌బ్ స‌ర్ఫేస్ డ్రైనేజ్ వ్య‌వ‌స్థ‌, నీటిపారుద‌ల సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావ‌డం గురించి చ‌ర్చించ‌డం జ‌రిగింది. అలాగే (బి) ఉప్పు ప్ర‌భావం నుంచి త‌ట్టుకోగ‌ల ప్రాంతీయ పంట‌ల అభివృద్ధిపైనా చ‌ర్చించ‌డం జ‌రిగింది.
బి. ఫుడ్ ప్రాసెసింగ్‌
1. వ‌రల్డ్ ఫుడ్ ఇండియా 2017
జ‌పాన్ డ‌బ్ల్యుఎఫ్ై 2017 లోభాగ‌స్వామ్య దేశంగా పాల్గొనింది. జ‌పాన్‌కు చెందిన‌ వ్య‌వ‌సాయం, అడ‌వులు, మ‌త్స్య‌సంప‌ద శాఖ స‌హాయ మంత్రి జ‌పాన్ ప్ర‌తినిధి వ‌ర్గానికి నాయ‌క‌త్వం వ‌హించారు. సుమారు 60 జ‌పాన్‌కంపెనీలు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నాయి.
2. ఎం.ఎ.ఎఫ్‌.ఎఫ్‌కు ఎం.ఒ.ఎఫ్‌.పి.ఐకి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కార అవ‌గాహ‌నాఒప్పందం
ఎ)ఎం.ఎ.ఎఫ్‌.ఎఫ్‌కు ఎం.ఒ.ఎఫ్‌.పి.ఐకి మ‌ధ్య స‌హ‌కార అవ‌గాహ‌నా ఒప్పందాన్ని సంత‌కం చేసి ఉభ‌య‌ప‌క్షాలూ ఇచ్చిపుచ్చుకోవ‌డం జ‌రిగింది. 2018 అక్టోబ‌ర్ 29న ఇండియా, జ‌పాన్ నాయ‌కుల స‌మ‌క్షంలో వీటిని ఇచ్చిపుచ్చుకున్నారు.
3) ఎం.ఒ.ఎఫ్‌.పి.ఐ, జ‌పాన్‌కంపెనీల మ‌ధ్య అవ‌గాహ‌నా ఒప్పందం.
ఎ) మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్‌ప్రాసెసింగ్ ఇండ‌స్ట్రీకి జ‌పాన్‌కంపెనీ (ఐఎస్ఇ ఫుడ్‌) కు మ‌ధ్య 2018 మార్చి 13న తొలి అవ‌గాహ‌నా ఒప్పందం కుదిరింది.
బి) ఎం.ఎఫ్‌.పి.ఐ, జ‌పాన్‌కంపెనీల‌కు(క‌గోమ్‌, నిసాన్‌స్టీల్‌)మ‌ధ్య 2018 అక్టోబ‌ర్ 29న ఎం.ఒ.యుపై సంత‌కాలు జ‌రిగాయి.
4. జ‌పాన్‌లో భార‌తీయ మార్కెట్‌పై అధ్య‌య‌నానికి ఫుడ్ కంపెనీల అసోసియేష‌న్‌
1)ఎంఎఎఫ్ఎఫ్ , గ్లోబ‌ల్ ఫుడ్ వాల్యూ చెయిన్ (జి.ఎఫ్‌.వి.సి)నిప్ర‌మోట్ చేస్తున్న‌ది. మార్చి 2018లో పజి.ఎఫ్‌.వి.సి ని ప్ర‌మోట్ చేయ‌డానికి ప‌బ్లిక్‌, ప్రైవేట్‌కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయించ‌డం జ‌రిగింది. సుమారు 400 కంపెనీలు ఈ కౌన్సిల్‌లో సభ్య‌త్వం క‌లిగి ఉన్నాయి.
2)జ‌పాన్ , ఇండియా ఫుడ్ బిజినెస్ కౌన్సిల్ మే 2018లో ప్రారంభించ‌డం జ‌రిగింది.
సి.ఫుడ్ సేఫ్టీ
ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ అలాగే జ‌పాన్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌హ‌కార ఒప్పందం
ఫుడ్ సేఫ్టీ , స్టాండ‌ర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ),అలాగే ఫుడ్‌సేఫ్టీ క‌మిష‌న్‌, క‌న్సూమ‌ర్ అఫైర్స్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌, లేబ‌ర్‌, వెల్ఫేర్‌, జపాన్‌కు చెందిన‌ఎం.ఎ.ఎఫ్‌.ఎఫ్ ల మ‌ధ్య ఎం.ఒ.సి 2018 అక్టోబ‌ర్ 29న కుదిరింది.
డి. ఫారెస్ట్రీ
ఎం.ఎ.ఎఫ్‌.ఎఫ్ అలాగే ఎం.ఇ.ఎఫ్ అండ్‌సిసి ల మ‌ధ్య అవ‌గాహ‌నా ఒప్పందం ఆధారంగా జాయింట్ వ‌ర్కింగ్ గ్రూప్‌
1) ఎం.ఎ.ఎఫ్‌.ఎఫ్‌, కు ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వులు, వాతావ‌ర‌ణ మార్పుల మంత్రిత్వ‌శాఖ‌కు మ‌ధ్య స‌హ‌కార ఒప్పందం 2015 డిసెంబ‌ర్ 11న కుదిరింది.
ఇందులో స‌హ‌కారానికి ఏడు అంశాల‌ను గుర్తించ‌డం జ‌రిగింది.
ఎ) శిక్ష‌ణ సంస్థ‌ల మ‌ద్య మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి, వ్య‌వ‌స్థాగ‌త మార్పులు
బి) సుస్థిర అట‌వీ యాజ‌మాన్యం
సి)అట‌వీ సంర‌క్ష‌ణ‌, అట‌వీ విప‌త్తుల‌ను అడ్డుకోవ‌డం
డి) జీవ వైవిధ్య ప‌రిర‌క్ష‌ణ‌
ఇ) అట‌వీ వ‌న‌రుల స‌క్‌‌మ వినియోగం
ఎఫ్‌) అడ‌వులు, అట‌వీ సంప‌ద‌, సాంకేతిక ప‌రిజ్ఞానానికి సంబంధించి త‌గిన విధానాల పెంపు
జి) అట‌వీ రంగంలో ప‌రిశోధ‌న‌, అభివృద్ధి
2) 2018 జూలై23న మూడ‌వ సంయుక్త వ‌ర్కింగ్ గ్రూప్ స‌మావేశం సంద‌ర్భంగా అడ‌వుల‌కు సంబంధించి 2018 నుంచి 2022 వ‌ర‌కు ఇండియా జ‌పాన్‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి అంగీకారం కుదిరింది.
ఇః ఫిష‌రీస్‌
1) మాన‌వ వినియోగానికి ఇండియాకు ఎగుమ‌తి చ‌,ఏసే చేప‌లు, చేప‌ల ఉత్ప‌త్తులక సంబంధించి పారిశుధ్య స‌ర్టిఫికేట్‌కు మార్చి 2018లో ఆమోద‌దం
2) జ‌పాన్‌నుంచి ఇండియాకు ఎగుమ‌తి అయ్యే రొయ్య‌ల దాణా, చేప‌ల‌దాణాకు సంబంధించి స‌ర్టిఫికేట్ విష‌యంలో అక్టోబ‌ర్ 2018లో అంగీకారం
ఎఫ్‌. ఎం.ఎ.ఎఫ్‌.ఎఫ్‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య స‌హ‌కారం, ప్రైవేటు కంపెనీల మ‌ధ్య వివిద కార్య‌క‌లాపాలు
1)ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం(ఎపి.స్టేట్‌)
ఎ)ఎం.ఎ.ఎఫ్‌.ఎఫ్ , ఆంధ్ర‌ప్‌టదేశ్ రాష్ట్రం మ‌ధ్య వ్య‌వ‌సాయం, ఆహార సంబంధిత ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి స‌హ‌కార అవ‌గాహ‌నా ప‌త్రంపై 2016 జూలై30న సంత‌కాలు జ‌రిగాయి.
బి) ఎం.ఎ.ఎఫ్‌.ఎఫ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌ధ్య మాస్ట‌ర్ ప్లాన్ డిజైన్‌కు సంబంధించి2018 ఫిబ్ర‌వ‌రి 25న స‌హ‌కార అవ‌గాహ‌న కుదిరింది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోల్డ్‌ చెయిన్ పై మాస్ట‌ర్‌ప్లాన్ త‌యారీ అధ్య‌య‌నం 2018 జూలై నుంచి ప్రారంభం
2) మ‌హారాష్ట్ర రాష్ట్రం
ఎ)ఎం.ఎ.ఎఫ్‌.ఎఫ్‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య 2018 అక్టోబ‌ర్ 29న స‌హ‌కార అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాలు
3) ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం
ఎ)ఎం.ఎ.ఎఫ్.ఎఫ్‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మ‌ధ్య 2018 అక్టోబ‌ర్ 26న స‌హ‌కార అవ‌గాహ‌నా ఒప్పందం
జి. జ‌పాన్ అంత‌ర్జాతీయ స‌హ‌కార ఏజెన్సీ (జె.ఐ.సి.ఎ)
1) ఆంధ్ర‌ప్ర‌దేశ్ నీటిపారుద‌ల‌, జీవ‌నోపాధుల అభివృద్ధి ప్రాజెక్టు (రెండో ద‌శ‌)కు సంబంధించి జె.ఐ.సి.ఎ, ఆర్థిక వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ ల మ‌ధ్య 2017 డిసెంబ‌ర్ 13న ఒప్పంద ప‌త్రంపై సంత‌కం చేయ‌డం జ‌రిగింది.
2)హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల నిర్వ‌హ‌ణ‌, జీవ‌నోపాధులను మెరుగుప‌రిచే ప్రాజెక్టు
జె.ఐ.సి.ఎకు భార‌త ఎంబ‌సీకి మ‌ధ్య 2018 మార్చి 29న ఒప్పంద ప‌త్రంపై సంత‌కాలు జ‌రిగాయి
3) స‌హ‌కార సంస్థ‌ల ద్వారా పాడి ప‌రిశ్ర‌మ రంగంలో జీవ‌నోపాధుల అభివృద్ధిప్రాజెక్టు విష‌యంలో జె.ఐ.సి.ఎ 2018 జూలైలో స‌న్నాహ‌క స‌ర్వే ప్రారంభం.
ఇండియా- జ‌పాన్ భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ స‌హ‌కారం
భ‌ద్ర‌తా స‌హ‌కారంపై 2008లో ఇండియా, జ‌పాన్ సంయుక్త ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టినుంచి గ‌త ద‌శాబ్ద కాలంలో భ‌ద్ర‌త విష‌యంలో ఉమ్మ‌డి చ‌ర్య‌ల‌ప‌రంగా గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తి క‌నిపించింది.ఇరు దేశాలూ ద్వైపాక్షిక భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని మ‌రింత పెంపొందించుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాయి. ఇందుకు అవ‌స‌ర‌మైన యంత్రాంగాల ఏర్పాటు ద్వారా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వార్షిక ర‌క్ష‌ణ మంత్రుల సంప్ర‌దింపులు, ర‌క్ష‌ణ విధాన చ‌ర్చ‌లు, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు ల మ‌ధ్య చ‌ర్చ‌లు, వివిధ స‌ర్వీసుల మ‌ధ్య స్టాఫ్ స్థాయి సంప్ర‌దింపులు, తీర ర‌క్ష‌క ద‌ళాల మ‌ధ్య చ‌ర్చ‌లు, త్రివిధ ద‌ళాల మ‌ధ్య విన్యాసాలు, తీర ర‌క్ష‌క ద‌ళాల మ‌ధ్య విన్యాసాలు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది.
మ‌ల‌బార్ ఎక్స‌ర్‌సైజ్‌కు , రెగ్యుల‌ర్ పాసేజ్ ఎక్స‌ర్‌సైజ్‌లు, ఇత‌ర సంయుక్త విన్యాసాలు అలాగే జ‌పాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెజిఎస్‌డిఎఫ్‌)కు ఇండియ‌న్ ఆర్మీకి మ‌ధ్య‌ తొలి ఉగ్ర‌వాద వ్య‌తిరేక విన్యాసం నిర్వ‌హ‌ణ వంటి వాటికి ఉభ‌య దేశాలూ ప్రాధాన్య‌త‌నిస్తున్నాయి.
జ‌పాన్ ఎయిర్ సెల్ప్ డిఫెన్స్ ఫోర్స్ (జె.ఎ.ఎస్‌.డి.ఎఫ్‌) కోప్ ఇండియాలో ప‌రిశీల‌క సంస్థ‌గా పాల్గొనింది. అలాగే ఇదే ఆలోచ‌నా ధోర‌ణి గ‌ల ఇత‌ర‌దేశాల‌తో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని స్వాగ‌తిస్తున్నాయి.
ఇండియా,జపాన్‌ల మ‌ధ్య స‌ముద్ర‌యాన స‌హ‌కారం విష‌యంలో మారీటైమ్ డొమైన్ అవేర్‌నెస్ (ఎం.డి.ఎ) ను విస్త‌రింప‌చేయ‌డం ద్వారా ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని పెంపొందించుకుంటున్నారు. అలాగే ఇండో ప‌సిఫిక్‌ప్రాంతంలో ప‌ర‌స్ప‌ర లాజిస్టిక్స్ మ‌ద్ద‌తు, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిర‌త‌కు ఉప‌క‌రిస్తుంది. 13 వ‌శిఖ‌రాగ్ర స‌మావేశం సంద‌ర్భంగా ఇరు దేశాల ప్ర‌ధాన‌మంత్రులూ భార‌త నౌకాద‌ళం, జ‌పాన్ మారీ టైమ్‌సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌ల‌మ‌ధ్య మ‌రింత స‌హ‌కారాన్ని అమ‌లు చేసేందుకు కుదిరిన ఒప్పందాన్నిస్వాగ‌తించారు. అక్విజిష‌న్ , క్రాస్ స‌ర్వీసింగ్ అగ్రిమెంట్ (ఎసిఎస్ఎ)విష‌యంలో సంప్ర‌దింపులు ప్రారంభించ‌డానికి నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. ఈ రెండు ప‌త్రాలు ఉభ‌య దేశాల‌మ‌ధ్య బంధాన్ని వ్యూహాత్మ‌కంగా మ‌రింత బ‌లోపేతం చేస్తాయి. ర‌క్షణ ప‌రిక‌రాలు, సాంకేతిక ప‌రిజ్ఞానానికి సంబంధించి ఇండియా ,జ‌పాన్‌ల‌మ‌ధ్య స‌హ‌కారానికి మ‌రింత ఎక్కువ అవ‌కాశాలున్నాయి. అలాగే భ‌విష్య‌త్ ద్వైపాక్షిక సంబంధాల‌కు , కొలాబ‌రేష‌న్ల‌కు అవ‌కాశాలున్నాయి.
సుల‌భ‌త‌ర ఫ్రేమ్‌వ‌ర్క్‌
ఇండియా, జ‌పాన్‌ల మ‌ధ్య ర‌క్ష‌ణ రంగ స‌హ‌కారం, 2008 నాటి భ‌ద్ర‌తా స‌హ‌కార జాయింట్ డిక్ల‌రేష‌న్ నుంచి , ర‌క్ష‌ణ స‌హ‌కారంపై 2014లో కుదిరిన అవ‌గాహ‌న ఒప్పందం మీదుగా సాగుతోంది. ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు , టెక్నాల‌జీ బ‌దిలీ, అలాగే మిల‌ట‌రీ క్లాసిఫైడ్ స‌మాచార ర‌క్ష‌ణ‌ చ‌ర్య‌లకు సంబంధించిన ఒప్పందం 2015లో ముగిసింది. ఇది కూడా ఈచ‌ట్రంపై రూపొందిన‌దే. భార‌త నావికాద‌ళం, జె.ఎం.ఎస్‌.డి.ఎఫ్‌ల మ‌ద్య మ‌రింత స‌హ‌కారానికి సంబంధించిన ఏర్పాటుపై 2018అక్టోబ‌ర్‌లో సంత‌కాలు జ‌రిగాయి. ఇది స‌మాచారం ఇచ్చిపుచ్చుకోవ‌డానికి, సంయుక్త విన్యాసాల నిర్వ‌హ‌ణ ఇత‌ర స‌ముద్ర కార్య‌క‌లాపాల‌కు, స‌ముద్ర‌ర‌వాణా భ‌ద్ర‌త పెంపున‌కు,షిప్పింగ్ స‌మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డానికి ఉప‌క‌రిస్తుంది.
ప్ర‌స్తుత స్థితిః
ఉన్న‌త‌స్థాయిలో వార్షిక ర‌క్ష‌ణ మంత్రుల స‌మావేశాలు 2006 మేలో ప్రారంభ‌మ‌య్యాయి. చివ‌రి స‌మావేశం 2018 ఆగ‌స్టులో ఇండియాలో జ‌రిగింది. ర‌క్ష‌ణ విధాన చ‌ర్చ‌లు 2007 ఏప్రిల్‌లో టోక్యోలో మొద‌ల‌య్యాయి. దీని ఆర‌వ స‌మావేశాలు, ఐద‌వ టూప్ల‌స్‌టూ డైలాగ్ కుం సంబంధించిన స‌మావేశాలూ న్యూఢిల్లీలో 2018 జూన్‌లో జ‌రిగాయి.
త్రివిధ ద‌ళాల‌కు సంబంధించి స‌ర్వీస్‌స్టాఫ్ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇండియ‌న్ నావీ కి జె.ఎం.ఎస్‌.డి.ఎఫ్ స్టాఫ్ ఏడ‌వ విడ‌త‌ చ‌ర్చ‌లు 2018 జ‌న‌వ‌రిలో ఢిల్లీలో జ‌రిగాయి. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్సుకు .ఎ.ఎస్‌.డి.ఎఫ్ స్టాఫ్‌కు మ‌ధ్య రెండో విడ‌త‌ చ‌ర్చ‌లు ఢిల్లీలో 2018 జూన్‌లో జ‌రిగాయి. ఇండియ‌న్ ఆర్మీకి జ‌పాన్‌కు చెందిన జెజిఎస్‌డిఎఫ్ స్టాఫ్ మ‌ధ్య ఐద‌వ విడ‌త చ‌ర్చ‌లు 2019 ప్రారంభంలో జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కోస్ట్‌గార్డ్‌, జ‌పాన్‌కోస్ట్‌గార్డ్ మ‌ధ్య 17 వ విడ‌త ఉన్న‌త స్థాయి చ‌ర్చ‌లు 2018 జ‌న‌వ‌రిలో ఢిల్లీలో జ‌రిగాయి.
సంయుక్త విన్యాసాలుః
భార‌త నావికాద‌ళం, జె.ఎం.ఎస్‌.డి.ఎఫ్‌ల మ‌ధ్య విన్యాసాలూ, త్రైపాక్షిక మ‌ల‌బార్ విన్యాసాలూ ఎక్కువగా జ‌రుగుతుంటాయి. ఇవి ప్ర‌ముఖ‌మైన విన్యాసాలు. మ‌ల‌బార్ 2018 విన్యాసాలు 2018 జూన్‌లో గువామ్ తీరంలోప‌ల జ‌రిగాయి. ఇందులో చ‌ప్పుకోద‌గిన స్థాయిలోనే వివిధ ప‌క్షాలు పాల్గొన్నాయి. ద్వైపాక్షిక మారీటైమ్ విన్యాసం జె.ఐ.ఎం.ఇ.ఎక్స్‌-18 2018 అక్టోబ‌ర్‌లో విశాఖ‌ప‌ట్నం తీరంలోప‌ల జ‌రిగింది. ఐదు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధి అనంత‌రం ఈ విన్యాసాలు జ‌రిగాయి. ఇందులో జ‌పాన్ కు చెందిన హెలికాప్ట‌ర్‌విధ్వంస‌క కాగా నౌక‌ పాల్గొనింది.
పాసెక్స్ విన్యాసాలు భార‌త నౌకాద‌ళ నౌక‌లు, జె.ఎంఎస్‌డిఎఫ్ నౌక‌లు మ‌రోదేశం సంద‌ర్శించిన‌పుడు ఇండియాలో,జ‌పాన్‌లో వీటిని త‌రచూ నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. పాసెక్స్ ప‌శ్చిమ భార‌త‌దేశంలో 2017 సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించ‌డం జ‌రిగింది. అలాగే ఈ విన్యాసాల‌ను జ‌పాన్‌లోని క్యుషు ప‌శ్చిమ ప్రాంతంలో 2017లోను, జ‌పాన్ స‌ముద్రంలో 2017లో, ముంబాయి తీరంలో 2018లో, 2018 మేలో వివాక‌ప‌ట్లం వ‌ద్ద‌, 2018 సెప్టెంబ‌ర్‌లో గ‌ల్ఫ్ ఆఫ్ యాడెన్‌వ‌ద్ద నిర్వ‌హించ‌డం జ‌రిగింది.
తొలి ఎయిర్ యాంటీ స‌బ్‌మెరైన్ (ఎ.ఎస్‌.డ‌బ్ల్యు) విన్యాసాలు భార‌త నావికాద‌ళం పి-81, జె.ఎం.ఎస్‌.డి.ఎఫ్ పి-3సి మ‌ధ్య 2017 అక్టోబ‌ర్ లో గోవా తీరానికి ద‌గ్గ‌ర‌లో జ‌రిగాయి. గ‌ల్ఫ్ ఆఫ్ యాడెన్‌లో జె.ఎం.ఎస్‌.డి.ఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్‌నుపైర‌సీ వ్య‌తిరేక‌కార్య‌క‌లాపాల కోసం ఏర్పాటు చేశారు. ఇది తిరుగు ప్ర‌యాణంలో ఈ విన్యాసాలునిర్వ‌హించారు. అనంత‌రం జె.ఎం.ఎస్‌.డి.ఎఫ్ పి-1కు భార‌త నౌకా ద‌ళం పి 8 ఐకి మ‌ధ్య 2018 మే నెల‌లో ఎయిర్ ఎ.ఎస్‌.డ‌బ్ల్యు విన్యాసాలు గోవాతీరంలోప‌ల జ‌రిగాయి. ఇండియా, జ‌పాన్‌లు తొలి కౌంట‌ర్ టెర్ర‌రిజం విన్యాసాలు జెజిఎస్ డిఎఫ్కు ఇండియ‌న్ ఆర్మీకి మ‌ధ్య 2018లో న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఇండియ‌న్ ఆర్మీకూడా జ‌పాన్‌, యు.ఎస్ కామ‌న్ ఇంటిగ్రేష‌న్ ఎమ‌ర్జెన్సీ డ్రిల్ (ట్రెక్స్ -17)లో ప‌రిశీల‌క హోదాలో 2017 న‌వంబర్‌లో పాల్గొనింది. 2018 జూలైలో మైన్‌, ఎక్స్‌ప్లోసివ్ ఆర్డ‌నెన్స్ ఎక్స‌ర్‌సైజ్‌ల‌లోనూ ఇండియ‌న్ నావీ పాల్గొనింది. మాన‌వ స‌హాయం, విప‌త్తుల స‌మ‌యంలో స‌హాయం వంటి వాటి విష‌యంలో విష‌య ప‌రిజ్ఞాన నిపుణుల రాక‌పోక‌లు ప‌లుమార్లుజ‌రిగాయి. చెన్నై తీరానికి కొద్దిదూరంలో ఐసిజి, జెసిజి సంయుక్త విన్యాసాలు 2018 జ‌న‌వ‌రిలో జ‌రిగాయి.
ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు, సాంకేతిక ప‌రిజ్ఞాన స‌హ‌కారంః
డిఫెన్స్ ఎక్స్‌పో 18, చెన్నైలో 2018 ఏప్రిల్‌లో జ‌రిగింది. ఇందులో జ‌పాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కుచెందిన అక్విజిష‌న్‌, టెక్నాల‌జీ, లాజిస్టిక్ ఏజెన్సీ పాల్గొనింది. ర‌క్ష‌న ప‌రిక‌రాలు, సాంకేతిక ప‌రిజ్ఞాన స‌హ‌కారానికి (జె.డ‌బ్ల్యుజి-డిఇటిసి)ని 2014లో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఇది నాలు సంద‌ర్భాల‌లో స‌మావేశ‌మైంది. నాలుగ‌వ జె.డ‌బ్ల్యుజి-డిఇటిసి స‌మావేశం 2018 జూలైలో జ‌రిగింది. డిఫెన్స్ రిసెర్చ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్‌(డి.ఆర్‌.డి.ఒ), ఎ.టి.ఎల్‌.ఎలు ప్రాజెక్టు ఒప్పందంపై సంత‌కాలు చేశాయి. ఇది విజువ‌ల్ స్లామ్ ఆధారిత జిఎన్ఎస్ఎస్ టెక్నాల‌జీ ఫ‌ర్ యుజివి, రోబోటిక్స్ కు సంబంధించిన‌ది. 2018 జూలైలో ఒప్పంద‌ సంత‌కాలు జ‌రిగాయి.

2017 సెప్టెంబ‌ర్‌లో తొలిసారిగా ఇండియా, జపాన్‌ల‌మ‌ధ్య తొలిసారిగా డిఫెన్స్ ఇండ‌స్ట్రీ ఫోర‌మ్‌ను టోక్యోలో ఏర్పాటు చేశారు. మూడ‌వ జె.డ‌బ్ల్యుజి-డిఇటిసి తోపాటు ఇది ఏర్పాటైంది.
నాలుగ‌వ జెడ‌బ్ల్యుజి-డిఇటిసి సంద‌ర్భంగా ఇలాంటి చొర‌వ తీసుకోవ‌డం జ‌రిగింది. ఇందులో జ‌పాన్ రక్ష‌ణ రంగ కంపెనీల‌తో భార‌త ర‌క్ష‌ణ రంగ ప‌రిశ్ర‌మ‌లు వ్యాపార‌ప‌ర‌మైన అంశాల‌ను బెంగ‌ళూరులో, ముంబాయిలో ముఖాముఖి చ‌ర్చించుకున్నాయి. ఇది డిపార్ట‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడ‌క్ష‌న్‌(డిడిపి), ఎటిఎల్ఎల ఆధ్వ‌ర్యంలో ఇది జ‌రిగింది.

విపత్తులు తెచ్చే హాని ని తగ్గించేందుకు భారతదేశం-జపాన్ సహకారం

ప్రపంచం లో ఎక్కువ విపత్తులు వచ్చే అవకాశాలు ఉన్న దేశాలు భారతదేశం మరియు జపాన్. 2018 జనవరి లో జరిగిన సేండాయ్ ఫ్రేంవర్క్ కొనసాగింపు, అమలు లో భాగంగా రెండు దేశాలు విపత్తులు తెచ్చే హాని తగ్గింపు (డిఆర్ఆర్)లో సహకరించుకుంటున్నాయి. విపత్తులు తెచ్చే హాని తగ్గింపు పై న్యూ ఢిల్లీ లో 2016 నవంబర్ నెల లో జరిగిన ఆసియా దేశాల మంత్రుల మహాసభ (ఎఎమ్ సిడిఆర్ఆర్) కొనసాగింపు గా భారతదేశం 2018 జనవరి లో నిర్వహించిన అధ్యయన గోష్ఠి లో జపాన్ మరో 20 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రుల మహాసభ లో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ విపత్తు లను తట్టుకొని నిలచే మౌలిక సదుపాయాల సృష్టి కి ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఇతర దేశాలు, భాగస్వామ్య పక్షాల తో కలసి పని చేసేందుకు భారతదేశం సిద్దంగా ఉందని తెలిపారు.

2017 సెప్టెంబర్ లో భారతదేశం- జపాన్ వార్షిక సభ జరిగింది. ఆ సభకు జపాన్ ప్రధాని శ్రీ ఆబే హాజరైనప్పుడు విపత్తులు తెచ్చే హాని తగ్గింపు క్షేత్రం లో ద్వైపాక్షిక సహకారాని కి సంబంధించిన పత్రంపై సంతకాలు జరిగాయి. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ, జపాన్ మంత్రివర్గ కార్యాలయం ప్రతినిధులు సంతకాలు చేశారు. సహకారం లో భాగంగా విపత్తుల నివారణ, ప్రతిక్రియ, కుదుర్చడం, పునర్నిర్మాణం చర్యలను చేపడుతారు. ద్వైపాక్షిక సహకారం అమలు లో భారతదేశం వైపు నుండి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ డిఎమ్ఎ) నోడల్ ఏజెన్సీ గా ఉంటుంది. విపత్తుల వల్ల కలిగే హాని తగ్గింపు పై తొలి జపాన్- భారతదేశం అధ్యయన గోష్ఠి న్యూ ఢిల్లీ లో 2018 మార్చి లో జరిగింది. విపత్తు లను ఎదుర్కొనే సన్నద్దత, ముందుగా హెచ్చరించే వ్యవస్థ మరియు ప్రైవేటు రంగం తోడ్పడే మార్గాలు వంటి ఆరు అంశాల పై గోష్ఠి లో చర్చించడం జరిగింది. గోష్ఠి లో జపాన్ వారు తమ ‘మరింత మెరుగ్గా నిర్మించడం’ అనే పరిష్కార మార్గాన్ని గురించి, విపత్తు లను ఎదుర్కొనే సన్నద్ధత లో తమ అనుభవాలు, తాము ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రదర్శించారు. గోష్ఠి ఆధారంగా భూకంపాలకు సంబంధించిన సమాచారాన్ని ముందు గా కనుగొని హెచ్చరించే వ్యవస్థ ఏర్పాటు చేయడం, ముఖ్యం గా భూకంపాల కలిగే నష్టాన్ని గురించి ముందుగా అంచనా వేయడం, ఉత్తుత్తి అభ్యాసాల ద్వారా ప్రజలలో భూకంపాలను పట్ల అవగాహన కలుగచేయడం వంటివి ఈ క్షేత్రం లో భారతదేశం, జపాన్ ల మధ్య సహకారం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పతుతుంది.

విపత్తు లపై రెండో అధ్యయన గోష్ఠి టోక్యో లో 2018 అక్టోబర్ 15న జరిగింది. అభ్యాసం మరియు శిక్షణ, 2018 లో రెండు దేశాల లో వరదల నేపథ్యం లో వాతావరణ సంబంధిత ప్రమాదాలు, ముందుగా హెచ్చరించే వ్యవస్థ వంటి అంశాలపై గోష్ఠి లో దృష్టి ని కేంద్రీకరించారు.

ఓవర్ సీస్ డివెలప్ మెంట్ ఏజెన్సీ (ఒడిఎ) ద్వారా జపాన్ అందిస్తున్న సహాయం విపత్తుల వల్ల నష్టాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతోంది. ముఖ్యం గా విపత్తు లను తట్టుకొని నిలచే మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. జపాన్ అందిస్తున్న సాంకేతిక సహాయం అటవీ ప్రాంతాల లో ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కు మరియు పర్వతాల లో ఉండే రహదారుల లో నిలకడైన అభివృద్ధి కి తోడ్పడుతోంది.

భారతదేశం-జపాన్ మధ్య శాస్త్ర మరియు సాంకేతిక మరియు విద్య సంబంధ సహకారం సుసాధ్యానికి రూపకల్పన

భారతదేశం-జపాన్ మధ్య శాస్త్ర మరియు సాంకేతిక సహకారం పెంపొందడానికి 1985లో అంతర్ ప్రభుత్వ ఒప్పందం పై సంతకాలు చేయడం ద్వారా మార్గం ఏర్పడింది. ఆ తరువాత 1993లో భారతదేశం-జపాన్ విజ్ఞానశాస్త్ర మండలి (ఐజెఎస్ సి) ఏర్పాటు తో ద్వైపాక్షిక శాస్త్ర మరియు సాంకేతిక సహకారానికి మరింత ఊపు వచ్చింది. ఇప్పటి వరకు మండలి 19 సమావేశాలను ఏర్పాటు చేసింది. 250 సంయుక్త ప్రాజెక్టు లకు మద్దతు తెలిపింది. 1600 మంది శాస్త్రవేత్తలు పరస్పరం మార్పిడి పర్యటనలు జరిపారు. 65 ఉమ్మడి సదస్సులు/అధ్యయన గోష్ఠులు మరియు 9 ఆసియా విద్యాసంబంధ సదస్సులు ఇంకా 10 రామన్-మిజుశిమా ప్రసంగాలు ఏర్పాటు చేయడం జరిగింది.

2006లో రెండు దేశాల మధ్య విజ్ఞానశాస్త్ర ప్రోత్సాహానికి ఇచ్చి పుచ్చుకొనే రీతి లో భాగస్వామ్యం ఏర్పడింది. భారత ప్రభుత్వ శాస్త్ర మరియు సాంకేతిక విభాగం చొరవ, జపాన్ విజ్ఞాన శాస్త్ర ప్రోత్సాహక సంస్థ ల తోడ్పాటు తో అది సాధ్యమైంది. అప్పటి నుండి జీవ శాస్త్రాలు, భౌతిక శాస్త్రాలు, హై ఎనర్జీ ఫిజిక్స్ , ఐసిటి, జీవ సాంకేతిక శాస్త్రం, ఆరోగ్య సంరక్షణ, ఎక్స్ రే చికిత్స, మీథేన్ హైడ్రేట్ , రోబోటిక్స్ , ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, సముద్ర మరియు భూ విజ్ఞాన శాస్త్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం , అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించడం వంటి విషయాల పై పలు సంస్థాగత ఒప్పందాలు, అవగాహన పత్రాల పై రెండు దేశాల సైన్సు ఏజెన్సీలు సంతకాలు చేయడం జరిగింది.

ఇటీవలి యత్నాలు

ఇన్ఫర్మేశన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) రంగం లో భారతదేశం-జపాన్ సంయుక్తం గా ప్రయోగశాలల ఏర్పాటు కు వీలు గా రెండు దేశాల కు చెందిన ఉన్నత విద్య సంస్థల మధ్య ఒప్పందాలు కుదిరాయి. సాంకేతిక విజ్ఞాన వినియోగం, విశ్లేషణ లకు సంబంధించి టోక్యో విశ్వవిద్యాలయం తో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే; వాతావరణ మార్పులు నిలకడైన పంటల ఉత్పత్తి సాధన కు డేటా వినియోగం పై టోక్యో విశ్వవిద్యాలయం తో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్; ఇంటర్ నెట్ లో భద్రత పై క్యుషు విశ్వవిద్యాలయం తో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ జత కట్టాయి.

యువ పరిశోధకుల కోసం డిఎస్ టి-జెఎస్ పిఎస్ చొరవ తో ఫెలోశిప్ కార్యక్రమం ప్రారంభం.

పదార్థాల పై ఉన్నత స్థాయి పరిశోధన కోసం కెయికె త్సుకుబ వద్ద ఇండియన్ బీం లైన్ రెండో దశ ఏర్పాటు కు అవగాహన ఒప్పందం.

బహుళ విధ రవాణా వ్యవస్థ ఏర్పాటు ద్వారా వర్ధమాన దేశాలలో స్మార్ట్ సిటీల అభివృద్ధి మరియు ప్రాంతీయ రవాణా కు సంబంధించిన డేటా విశ్లేషణ కు సంబంధించిన SATREPS కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించడం జరిగింది.

జపాన్ -ఆసియా యువత మార్పిడి కార్యక్రమం లో భాగం గా ఈ ఏడాది మార్చి నెల తో ముగిసిన సంవత్సర కాలం లో 655 మంది విద్యార్ధులు, సూపర్ వైజర్ లు జపాన్ ను సందర్శించారు. శాస్త్ర మరియు సాంకేతిక శాఖ ద్వారా INSPIRE ఉపకార వేతనాల కు ఎంపికైన 39 మంది విద్యార్ధులు కూడా 2018 మే నెల లో జపాన్ ను సందర్శించారు.

జపాన్ త్సుకుబ లో ఉన్నత శ్రేణి జీవ వైద్య పరిశోధనల కోసం అంతర్జాతీయ ప్రయోగశాల DAILAB, భారతదేశం లో ఔషధ అభివృద్ధి, రోగ చికిత్స ప్రక్రియ లపై పరిశోధన మరియు ప్రత్యేక శిక్షణ కోసం 6 శాటిలైట్ ఇంటర్ నేశనల్ ఇన్ స్టిట్యూట్స్ ఫర్ స్పెశల్ ట్రయినింగ్ ఎడ్యుకేశన్ అండ్ రిసర్చ్ (SISTERs) ఏర్పాటు

సముద్ర మరియు భూ శాస్త్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి లో సహకారం కోసం 2016 నవంబర్ లో జపాన్ ఏజెన్సీ ఫర్ మెరీన్ అర్థ్ సైన్స్ అండ్ టెక్నాలజ (జెఎఎమ్ఎస్ టిఇసి) తో భారత ప్రభుత్వ భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ అవగాహన

ఇంకా పర్యావరణానికి సంబంధించి DIACENTRE ఏర్పాటు కోసం సంయుక్త పరిశోధన కాంట్రాక్టు, రేడియో చికిత్స లో సహకారానికి కోల్ కాతా కు చెందిన టాటా మెడికల్ సెంటర్, జపాన్ సంస్థ ల మధ్య ఒప్పందం.
అంతరిక్ష పరిశోధనలు, చంద్ర ధ్రువ అన్వేషణలో సహకారం కోసం రెండు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థ లు.. ఐఎస్ఆర్ ఒ (‘ఇస్రో’) మరియు జెఎఎక్స్ఎ.. మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దాని ఫలితంగా సహకార రంగాల పై చర్చల కోసం 2018 సెప్టెంబర్ నెల లో ఉమ్మడి కార్యాచరణ బృందం రెండో సమావేశం జరిగింది. ఒప్పందం తరువాత ధ్రువ అన్వేషణ సాధ్యాసాధ్యాల గురించి ఇస్రో మరియు జెఎఎక్స్ఎ జంట గా అధ్యయనం చేసి 2018 మార్చి నెల లో సాధ్యాసాధ్యాల నివేదిక ను రూపొందించారు. ఆ తరువాత ఉపగ్రహ చిత్రాల ఉమ్మడి విశ్లేషణ అమలు ఒప్పందంపై ఇస్రో మరియు జెఎఎక్స్ఎ సంతకాలు చేశాయి. బెంగళూరులో 2017 నవంబర్ లో జరిగిన ఆసియా – పసిఫిక్ ప్రాంతీయ అంతరిక్ష సంస్థ ఫోరమ్ (ఎపిఆర్ఎస్ఎఎఫ్-24) 24వ సమావేశానికి ఇస్రో, జెఎఎక్స్ఎ సహ-ఆతిథ్యాన్ని ఇచ్చాయి. ఈ సమావేశం లో సంయుక్త ప్రకటన ను ఆమోదించారు.

పరిశోధన మరియు విద్యావిషయక భాగస్వామ్యాలు

హైదరాబాద్ ఐఐటి మరియు ఒమ్రోన్ (OMRON) కార్పోరేశన్, రిత్సుమీకన్ యూనివర్సిటీ లోని ఇన్ఫర్మేశన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ల మధ్య ఇంటర్న్ శిప్ కార్యక్రమానికి సంబంధించిన అంగీకార పత్రం పై 2017 నవంబర్ లో సంతకాలు చేయడం జరిగింది.

భారతదేశానికి చెందిన ఎనిమిది సంస్థ లతో హిరోశిమా విశ్వవిద్యాలయం ఒప్పందాలు, అంగీకార పత్రాలు, అనుబంధాల పై సంతకాలు చేసింది.

1. భారతదేశంలోని పిలాని కి చెందిన సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సిఎస్ఐఆర్ – సిఇఇఆర్ఐ) మరియు జపాన్ హిరోశిమా విశ్వవిద్యాలయం ల మధ్య పరిశోధన, విద్యా విషయక కార్యక్రమాలు, విద్య మార్పిడి కి అంతర్జాతీయ సహకారాని కి గతం లో కుదిరిన అంగీకార పత్రాని కి సంబంధించిన అనుబంధం పై 2017 డిసెంబర్ లో సంతకాలు చేయడం జరిగింది.

2. విద్య విషయక కార్యక్రమాలు, విద్య మార్పిడి ఒప్పందం తో పాటు విద్య విషయక కార్యక్రమాలు, విద్య మార్పిడి కి హిరోశిమా విశ్వవిద్యాలయం, జపాన్ మరియు బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి అండ్ సైన్స్, పిలాని, భారతదేశం (బిట్స్-పి) మధ్య అంగీకార పత్రం పై 2017 డిసెంబర్ లో సంతకాలయ్యాయి.

3. విద్య విషయక కార్యక్రమాలు, విద్య మార్పిడి ఒప్పందంతో పాటు విద్యావిషయక కార్యక్రమాలు, విద్య మార్పిడికి హిరోశిమా విశ్వవిద్యాలయం, జపాన్ మరియు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, బాంబే, భారతదేశం (ఐఐటి, బాంబే) ల మధ్య అంగీకార పత్రం పై 2018 జనవరి లో సంతకాలయ్యాయి.

4. విద్య విషయక కార్యక్రమాలు, విద్య మార్పిడికి హిరోశిమా విశ్వవిద్యాలయం జపాన్ మరియు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్పూర్ , భారతదేశం ల మధ్య అంగీకార పత్రం పై 2018 జనవరిలో సంతకాలయ్యాయి.
5. విద్యార్ధుల మార్పిడికి హిరోశిమా విశ్వవిద్యాలయం, జపాన్ మరియు సిఎస్ఐఆర్- సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ (సిఎస్ఐఆర్-సిఎమ్ఇఆర్ఐ) మధ్య అంగీకార పత్రం పై 2018 జనవరిలో సంతకాలయ్యాయి.
6. విద్యార్ధుల మార్పిడికి హిరోశిమా విశ్వవిద్యాలయం, జపాన్ మరియు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (ఐఐఎమ్ఎ) ల మధ్య 2018 ఏప్రిల్ లో ఒప్పందం కుదిరింది.

7. విద్య విషయక కార్యక్రమాలు, విద్య మార్పిడి కి హిరోషిమా యూనివర్సిటీ, జపాన్ మరియు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నోలజి, ఢిల్లీ, భారతదేశం (ఐ ఐ టి, ఢిల్లీ ) మధ్య అంగీకార పత్రం పై 2018 మే నెలలో సంతకాలయ్యాయి.

8. విద్యావిషయక కార్యక్రమాలు, విద్య మార్పిడికి హిరోశిమా విశ్వవిద్యాలయం, జపాన్ మరియు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, హైదరాబాద్, భారతదేశం (ఐఐటి, హైదరాబాద్ ) ల మధ్య అంగీకార పత్రం పై 2018 అక్టోబరు లో సంతకాలయ్యాయి.

నగవోకా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజి కి చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ మరియు న్యూక్లియర్ సిస్టం సేఫ్టీ ఇంజినీరింగ్ విభాగాలు విద్య సంబంధ కార్యక్రమాలు మరియు పరిశోధన లో సహకారానికి వరుసగా
డిపార్ట్ మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ , ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, తిరుపతి, భారతదేశం (జనవరి, 2018) మరియు స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డిసిప్లిన్ ఆఫ్ మెటలర్జీ ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, ఇండోర్ (జూలై , 2018) రెండు వేరువేరు ఒప్పందాలపై సంతకాలు చేసింది.

విద్య మరియు విద్య సంబంధిత పరిశోధన లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎఐఐఎమ్ఎస్) , ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సి) , ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, ఢిల్లీ (ఐఐటి, ఢిల్లీ) లతో సహకరించుకోవాలనే సంకల్పాన్ని వెలిబుచ్చుతూ నాగసాకి యూనివర్సిటీ మూడు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పత్రాలపై జూలై , 2018లో సంతకాలు చేసింది.

శిజువోకా యూనివర్సిటీ, జపాన్ మరియు నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేశన్ అండ్ రిసర్చ్ (ఎన్ఐపిఇఆర్), ఎస్. ఎ. ఎస్. నగర్ ల మధ్య అవగాహన ఒప్పందం పై అక్టోబరు, 2018 లో సంతకాలయ్యాయి.

నాలుగు విద్య విషయక కార్యక్రమాల మార్పిడి ఒప్పందాలు మరియు విద్యార్ధుల మార్పిడి కి అవగాహన ఒప్పందాల పై వరుసగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, బొంబాయి (జనవరి, 2018), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, మద్రాస్ (మార్చి, 2018) , ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, హైదరాబాద్ (ఏప్రిల్, 2018) , ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, కాన్పూర్ ( అక్టోబర్, 2018) లతో హొకయిడో యూనివర్సిటీ సంతకాలు చేయడమైంది.

భారతదేశానికి చెందిన శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) మరియు జపాన్ టోక్యో విశ్వవిద్యాలయం లోని రిసర్చ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆర్ సిఎఎస్ టి)ల మధ్య రోబోటిక్స్ తో పాటు మెకా ట్రానిక్స్, ఉపరితల ఇంజినీరింగ్, ఇంధనం నిల్వ ( సౌర నుండి రసాయన) మరియు నేత్ర సంబంధ ఇలెక్ట్రానిక్స్ వంటి క్షేత్రాలలో పరిశోధనాభివృద్ధి లో సహకారానికి అక్టోబర్, 2018 లో అవగాహన ఒప్పందం పై సంతకాలు జరిగాయి.

పరిశోధనలలో భాగస్వామ్యం కోసం భారతదేశంకు చెందిన శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) మరియు హిరోషిమా యూనివర్సిటీ మధ్య అక్టోబర్, 2018లో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఇండో-జపాన్ గ్లోబల్ స్టార్ట్- అప్ పని కి సంబంధించి మరింత సహకారం కోసం నాగసాకి యూనివర్సిటీ మరియు ఐఐఐటిడిఎమ్ ల మధ్య అక్టోబర్, 2018లో అవగాహన ఒప్పందం కుదిరింది.

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇనవేటివ్ రిసర్చ్, టోక్యో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జపాన్ మరియు భారతదేశానికి చెందిన శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) ల మధ్య సహకార ఒప్పందం పై అక్టోబర్, 2018లో సంతకాలు జరిగాయి.

ధ్రువ సంబంధ పరిశోధన లో సహకారం కోసం జపాన్ జాతీయ ధ్రువ పరిశోధన సంస్థ (ఎన్ఐపిఆర్), ధ్రువ సంబంధ పరిశోధన కోసం భారత జాతీయ ధ్రువ మరియు సాగర పరిశోధన కేంద్రం (ఎన్ సిపిఒఆర్) ల మధ్య సహకారానికి అంగీకార పత్రం పై అక్టోబర్, 2018లో సంతకాలు జరిగాయి.

భవిష్యత్ యత్నాలు

వాతావరణ మార్పు లపై, సాగర జలాల లో మార్పు లపై ముందస్తు సూచన తదితర అంశాల పై సంయుక్త పరిశోధన జరపాలని ఇరు పక్షాలు ప్రతిపాదించాయి. జెఎస్ టి మరియు డిఎస్ టి ల మధ్య ఇన్ఫర్మేశన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ (ఐసిటి) రంగం లో భారతదేశం-జపాన్ సంయుక్త పరిశోధన ప్రయోగశాల కార్యక్రమం కోసం సహకారం కొనసాగించడం కోసం కొన్ని క్రియాశీల చర్యలు చేపట్టే అంశం ఇరు పక్షాల పరిశీలన లో ఉంది. 2020 సంవత్సరం ప్రారంభంలో ఇస్రో మరియు జెఎఎక్స్ ఎ కలసి చంద్ర ధ్రువ అన్వేషణ చేపట్టడం కోసం ఉమ్మడి అధ్యయనాన్ని ప్రారంభించడం ద్వారా ఇరుపక్షాలు తక్షణ అభివృద్ధికి పాటుపడుతాయి.

భారతదేశం లో జపాన్ భాష విద్య కు ప్రోత్సాహం

1. గత కొద్ది సంవత్సరాలుగా జపాన్ భాష తెలిసిన వృత్తినిపుణుల కొరత దృష్ట్యా భారతదేశం లో జపాన్ భాష బోధన ను విస్తరించవలసిన ప్రాముఖ్యాన్ని భారతదేశం మరియు జపాన్ ల ప్రధానమంత్రులు గుర్తించారు. తద్వారా వివిధ క్షేత్రాల లో విస్తృత, సన్నిహిత సహకారాన్ని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.

2. జపాన్ ప్రధాన మంత్రి భారతదేశం పర్యటన సందర్బంగా భారతదేశం లో జపాన్ భాష బోధన లో సహకారం కోసం 2017 సెప్టెంబర్ 14న అంగీకార పత్రం పై సంతకాలు జరిగాయి. జపాన్ భాష ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే అయిదేళ్ళ లో 1,000 మంది జపాన్ భాష టీచర్లకు శిక్షణ ఇవ్వాలని, మరియు కొత్తగా 100 జపాన్ భాష కోర్సు లు ఏర్పాటు చేయాలని అంగీకారం కుదిరింది.

3. ఈ కార్యక్రమం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతదేశం లో ఉన్న జపాన్ రాయబార కార్యాలయం సంయుక్త సారథ్యం లో జపాన్ ఫౌండేశన్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీ గ్రాంట్ల సంఘం (యుజిసి) , జెఎన్ యు-హెచ్ఆర్ డిసి, నైపుణ్యాల అభివృద్ధి మరియు యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహ మంత్రిత్వ శాఖ , వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇలెక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు సిఎస్ఐఆర్ లు మద్దతిచ్చాయి.

4. అంగీకార పత్రం లోని లక్ష్యాల కు అనుగుణంగా 2018 జూలై 23న జపాన్ భాష టీచర్ల శిక్షణ కేంద్రాన్ని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్ యు) కు చెందిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (హెచ్ ఆర్ డిసి)లోని తాత్కాలిక ప్రాంగణం లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాన్ని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ వి.కె. సింహ్, భారతదేశం లో జపాన్ రాయబారి శ్రీ కెంజి హిరమత్సు లు ప్రారంభించారు. ప్రారంభోత్సవం లో భారతదేశం వైపు నుండి జెఎన్ యు ఉప కులపతి ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొనగా జపాన్ ఫౌండేశన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ తోమోయుకి సకురాయ్ మరియు ఇతర అధికారులు జపాన్ దేశానికి ప్రాతినిధ్యం వహించారు.

5. జపాన్ భాష ను నేర్చుకోవడానికి 2018 జూలై 23న ప్రారంభమైన మూడు నెలల కోర్సు లో 360 గంటల పాటు శిక్షణ ను ఇచ్చారు. మొత్తం 25 మంది ఎన్3 స్థాయి జపాన్ భాష ప్రావీణ్య పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఈ కోర్సు లో కొత్తగా జాపనీస్ భాష ను నేర్చుకొనే వారు, ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్ధులు ఉన్నారు. వివిధ బోధన పద్దతుల ను ఉపయోగించడం తో పాటు తరగతి గదుల్లో పాఠాలు చెప్పే తీరు లో వారి శిక్షణ జరిగింది. అంతే కాక శాంతినికేతన్ లో 5 రోజులు, బెంగళూరులో 2 రోజుల శిక్షణ కోర్సు లను కూడా నిర్వహించడం జరిగింది.