Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం- చైనా సరిహద్దు ప్రాంతాల లో పరిస్థితి పై ప్రధాన మంత్రి వ్యాఖ్యలు


మిత్రులారా,

భరతమాత యొక్క వీర పుత్రులు మన మాతృభూమి ని రక్షించే క్రమం లో గల్ వాన్ లోయ లో సర్వోన్నత త్యాగం చేశారు.

వారి అసమాన త్యాగాని కి, దేశ సేవ కు నేను వినమ్రం గా నమస్కరిస్తున్నాను. నా హృదయ పూర్వక ధన్యవాదాల తో శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను.

ఈ దుఃఖ ఘడియ లో ఆ అమరుల కుటుంబాల సంతాపం లో నేను పాలుపంచుకొంటున్నాను.

యావత్తు దేశం ఈ రోజు న మీతో ఉంది. దేశ మనోభావాలు మీతో పాటే ఉన్నాయి.

మన వీరుల బలిదానం వృథా పోదు.

ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, భారతదేశం తనదైన ప్రతి అంగుళపు భూభాగాన్నీ, తన ఆత్మగౌరవాన్నీ కాపాడుకొని తీరుతుంది.

సాంస్కృతికం గా భారతదేశం శాంతి కాముక దేశం. శాంతి ని ప్రేమించే దేశం గా మనకు ఒక చరిత్ర ఉంది.

ఎల్లప్పటి కి ‘‘లోకా: సమస్తా: సుఖినో భవన్తు’’ యే మన సిద్ధాంతం గా ఉంటోంది.

మనం సదా యావత్తు ప్రపంచం యొక్క శాంతి ని, మానవాళి యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ వస్తున్నాము.

మన పొరుగు దేశాల తో సహకారం, స్నేహ సంబంధాల కోసమే ఎప్పుడూ కృషి చేశాము. వారి అభివృద్ధి ని, సంక్షేమాన్నే కాంక్షించాము.

అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ఆ భేదాభిప్రాయాలు వివాదం గా మారకుండా ఉండటానికే ప్రయత్నించాము.

మనం ఎవరినీ రెచ్చగొట్టం. అదే సమయం లో మన సమగ్రత, సార్వభౌమాధికారం విషయం లో రాజీ పడలేదు. అవసరమైనప్పుడు మన శక్తి ని చాటుకున్నాము. మన సమగ్రత ను, సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు మన సామర్థ్యాన్ని చాటాము.

త్యాగాలు, ఓర్పు మన జాతీయ లక్షణం లో భాగాలు. అదే సమయం లో మన సాహసం, వీరత్వం కూడా అందులో సమ భాగాలే.

మన సైనికుల త్యాగాలు వృథా పోవు అని ఈ సందర్భం లో దేశ ప్రజల కు హామీ ని ఇస్తున్నాను.

భారత సమగ్రత, సార్వభౌమాధికారం మనకు అత్యున్నతం. దీని ని కాపాడుకోవడానికి ఎవరో అడ్డుపడజాలరు.

ఇందులో ఎవ్వరి కి ఎటువంటి అనుమానాలు ఉండనక్కర లేదు.

భారతదేశం శాంతి ని కోరుకుంటుంది. కానీ, రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతుంది.

మన సైనికులు అటువంటి పోరులోనే అమరులు కావడం భారతదేశాని కి గర్వకారణం. మీరంతా రెండు నిమిషాల సేపు మౌనాన్ని పాటించడం ద్వారా ఈ భరత మాత ముద్దుబిడ్దల కు శ్రద్ధాంజలి ని అర్పించవలసింది గా మిమ్ములను నేను అభ్యర్థిస్తున్నాను.