ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మరియు ఇటాలియన్ రిపబ్లిక్ ప్రభుత్వాల మధ్య మైగ్రేషన్ అండ్ మొబిలిటీ అగ్రిమెంట్‌పై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
ఈ ఒప్పందం ఇరు దేశాల ప్రజల మధ్య పరిచయాలను మెరుగుపరుస్తుంది. విద్యార్థులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, వ్యాపారులు మరియు యువ నిపుణుల చైతన్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే ఇరుపక్షాల మధ్య అక్రమ వలసలకు సంబంధించిన సమస్యలపై సహకారాన్ని బలోపేతం చేస్తుంది.
ప్రస్తుత ఇటాలియన్ వీసా పాలనలో ఈ ఒప్పందం లాక్-ఇన్ పోస్ట్ స్టడీ అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌లు, ఫ్లోస్ డిక్రీ ప్రకారం ప్రస్తుతం ఉన్న లేబర్ మొబిలిటీ పాత్‌వేల క్రింద భారతదేశానికి ప్రయోజనాన్ని అందించే వృత్తిపరమైన శిక్షణల కోసం మెకానిజమ్‌లు ఉన్నాయి.
కొన్ని ముఖ్య నిబంధనలు క్రింద ఇవ్వబడ్డాయి:
- ఇటలీలో అకడమిక్/వృత్తి శిక్షణను పూర్తి చేసిన తర్వాత ప్రారంభ వృత్తిపరమైన అనుభవాన్ని పొందాలనుకునే భారతీయ విద్యార్థులు 12 నెలల వరకు ఇటలీలో తాత్కాలిక నివాసాన్ని మంజూరు చేయవచ్చు. ఇటాలియన్ వైపు ప్రొఫెషనల్ ట్రైనింగ్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఇంటర్న్‌షిప్‌లు మరియు కరిక్యులర్ ఇంటర్న్‌షిప్‌లకు సంబంధించిన వివరణాత్మక నిబంధనలు ఉన్నాయి. ఇవి భారతీయ విద్యార్థులు/ట్రైనీలు ఇటాలియన్ నైపుణ్యం/శిక్షణ ప్రమాణాలలో అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పిస్తాయి.
- కార్మికులకు ఇటాలియన్ వైపు ప్రస్తుత ఫ్లోస్ డిక్రీ ప్రకారం 2023, 2024 మరియు 2025 కోసం 5000, 6000 మరియు 7000 నాన్ సీజనల్ ఇండియన్ వర్కర్ల కోటాను రిజర్వ్ చేసింది (సీజనల్ కాని కార్మికులకు మొత్తం రిజర్వ్ చేసిన కోటా 12000). వీటికితోడు ఇటాలియన్ వైపు ప్రస్తుత ఫ్లోస్ డిక్రీ ప్రకారం 2023, 2024 మరియు 2025 కోసం 3000, 4000 మరియు 5000 కాలానుగుణ భారతీయ కార్మికుల కోటాను రిజర్వ్ చేసింది (మొత్తం రిజర్వ్ చేసిన కోటా కాలానుగుణ కార్మికులకు 8000).
- ఫ్లోస్ డిక్రీ ప్రకారం ఇటాలియన్ వైపు 2023-2025 నుండి కాలానుగుణ మరియు నాన్-సీజనల్ వర్కర్లకు ఇంక్రిమెంటల్ రిజర్వ్‌డ్ కోటాలను అందించింది. జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జెడబ్ల్యుజీ) క్రింద చర్చించబడే ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య సేవల రంగాలలో భారతీయ అర్హత కలిగిన నిపుణులను యూత్ మొబిలిటీ మరియు రిక్రూట్‌మెంట్ సులభతరం చేయడంపై ఒప్పందాల ద్వారా భారతదేశం మరియు ఇటలీల మధ్య మార్గాలను మరింత మెరుగుపరచడంపై ఉమ్మడి సహకారంపై కూడా ఒప్పందం అధికారికం చేస్తుంది.
అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాటంలో రెండు దేశాల మధ్య సహకారం కూడా ఒప్పందం ద్వారా అధికారికం చేయబడింది.
ఈ ఒప్పందం అమలులోకి రావడానికి అవసరమైన అంతర్గత విధానాలను పూర్తి చేయడం గురించి పార్టీలు ఒకరికొకరు తెలియజేసుకునే రెండు నోటిఫికేషన్‌లలో చివరిది అందిన తేదీ తర్వాత రెండవ నెల మొదటి రోజున 5 సంవత్సరాల కాలానికి అమల్లోకి వస్తుంది. ఎవరైనా పాల్గొనేవారిచే రద్దు చేయబడకపోతే ఒప్పందం అదే వరుస వ్యవధిలో పునరుద్ధరించబడుతుంది.
ఈ ఒప్పందం జెడబ్ల్యూజీ ద్వారా పర్యవేక్షణ కోసం ఒక అధికారిక యంత్రాంగాన్ని అందిస్తుంది. ఇది కాలానుగుణంగా వర్చువల్ లేదా ఫిజికల్ మోడ్‌లో అమలును పర్యవేక్షిస్తుంది. సంబంధిత సమాచారాన్ని జెడబ్ల్యూజీ పంచుకుంటుంది. ఒప్పందం అమలును సమీక్షిస్తుంది. అమలుకు అవసరమైన మద్దతు ఇవ్వడానికి తగిన ప్రతిపాదనలన్నింటినీ చర్చిస్తుంది.
నేపథ్యం:
ఈ ఒప్పందంపై 2 నవంబర్, 2023న భారత విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్ మరియు ఇటలీ తరఫున ఆ దేశ విదేశీ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకార మంత్రి శ్రీ ఆంటోనియో తజానీ సంతకం చేశారు.
***