Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశంలో సెమీకండక్టర్ రంగం అభివృద్ధికి మరో ముందడుగు


భారతదేశంలో సెమీ కండక్టర్స్ డిస్ప్లే తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కింద మూడు సెమీకండక్టర్ యూనిట్ల స్థాపనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడు యూనిట్ల నిర్మాణం  వచ్చే 100 రోజుల్లో ప్రారంభమవుతుంది. 

దేశంలో సెమీకండక్టర్ రంగం , డిస్ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం  21.12.2021 న ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది.  మొత్తం  76,000 కోట్ల రూపాయల వ్యయంతో కార్యక్రమం అమలు జరుగుతుంది. .

గుజరాత్‌లోని సనంద్‌లో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి మైక్రోన్ ప్రతిపాదనకు  2023 జూన్ లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

ఈ యూనిట్ నిర్మాణం వేగంగా జరుగుతోంది.  సెమీకండక్టర్ రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైన సౌకర్యాలు యూనిట్ సమీపంలో అభివృద్ధి చెందుతున్నాయి. 

కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన  మూడు సెమీకండక్టర్ యూనిట్లు:

1. 50,000 wfsm సామర్థ్యంతో సెమీకండక్టర్ ఫ్యాబ్:

తైవాన్ కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్ (PSMC),తో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (“TEPL”) సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను నెలకొల్పుతుంది. 

పెట్టుబడి:  గుజరాత్‌లోని ధొలేరాలో .91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఫ్యాబ్‌ని ఎలకొల్పుతారు. 

సాంకేతిక భాగస్వామి:  తైవాన్ కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్ (PSMC) సాంకేతిక సహకారం అందిస్తుంది.. లాజిక్ మరియు మెమరీ ఫౌండ్రీ విభాగాలలో  పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్ (PSMC) గుర్తింపు పొందింది.  పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్ (PSMC)కు   తైవాన్‌లో 6 సెమీకండక్టర్ ఫౌండ్రీలు ఉన్నాయి.

సామర్థ్యం:  నెలకు 50,000 వేఫర్ స్టార్ట్స్ సామర్ధ్యంతో యూనిట్ ఏర్పాటు అవుతుంది.  (WSPM)

 విభాగాలు:

* 28 nm సాంకేతికతతో అధిక పనితీరు కంప్యూట్ చిప్స్

* ఎలక్ట్రిక్ వాహనాల (EV), టెలికాం, డిఫెన్స్, ఆటోమోటివ్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, డిస్‌ప్లే, పవర్ ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటికి అవసరమైన  పవర్ మేనేజ్‌మెంట్ చిప్‌లు. పవర్ మేనేజ్‌మెంట్ చిప్‌లు అధిక వోల్టేజ్, హై కరెంట్ అప్లికేషన్‌ కలిగి ఉంటాయి. 

2. అస్సాంలో సెమీకండక్టర్ ATMP యూనిట్:

టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (“TSAT”) అస్సాంలోని మోరిగావ్‌లో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది.

పెట్టుబడి: రూ.27,000 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు.

సాంకేతిక: TSAT సెమీకండక్టర్ ఫ్లిప్ చిప్ , ISIP (ప్యాకేజీలో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్) సాంకేతిక తో సహా స్వదేశీ అధునాతన సెమీకండక్టర్ ప్యాకేజింగ్ సాంకేతిక అంశాలను అభివృద్ధి చేస్తోంది.

సామర్థ్యం:  రోజుకు 48 మిలియన్లు

 విభాగాలు: ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, టెలికాం, మొబైల్ ఫోన్లు మొదలైనవి.

3. ప్రత్యేక చిప్‌ల కోసం సెమీకండక్టర్ ATMP యూనిట్:

 జపాన్‌కి చెందిన  రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, థాయ్‌లాండ్‌కి చెందిన  స్టార్స్ మైక్రోఎలక్ట్రానిక్స్ భాగస్వామ్యంతో గుజరాత్‌లోని సనంద్‌లోCG పవర్, సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది.

పెట్టుబడి: రూ.7,600 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు.

సాంకేతిక భాగస్వామి: రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్  ప్రత్యేక చిప్‌లపై దృష్టి సారించి పని చేస్తున్న  ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ. 12 సెమీకండక్టర్ సౌకర్యాలను నిర్వహిస్తున్న రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ మైక్రోకంట్రోలర్‌లు, అనలాగ్, పవర్, సిస్టమ్ ఆన్ చిప్ (‘SoC)’ ఉత్పత్తులలో ముఖ్యమైనసంస్థగా గుర్తింపు పొందింది. 

 విభాగాలు: వినియోగదారు, పారిశ్రామిక, ఆటోమోటివ్ , పవర్ అప్లికేషన్‌ల కోసం CG పవర్ సెమీకండక్టర్ యూనిట్ చిప్‌లను తయారు చేస్తుంది.

సామర్థ్యం  రోజుకు 15 మిలియన్లు

ఈ యూనిట్ల వ్యూహాత్మక ప్రాముఖ్యత:

* భారత  సెమీకండక్టర్ మిషన్ అతి తక్కువ సమయంలోనాలుగు పెద్ద విజయాలు సాధించింది. ఈ యూనిట్ల ఏర్పాటుతో , సెమీకండక్టర్ రంగం మరింత పటిష్టం అవుతుంది. 

*చిప్ రూపకల్పనలో భారతదేశం  సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ యూనిట్ల వల్ల దేశంలో  చిప్ తయారీ సామర్థ్యాలు మరింత  అభివృద్ధి చెందుతాయి. 

* మంత్రివర్గం ఆమోదించిన యూనిట్లు అవసరమైన  అధునాతన ప్యాకేజింగ్ సాంకేతిక పరిజ్ఞానం దేశీయంగా అభివృద్ధి అవుతుంది. 

ఉపాధి అవకాశాలు:

* ఈ యూనిట్లు 20 వేల అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉద్యోగాలకు ప్రత్యక్ష ఉపాధి, దాదాపు 60 వేల పరోక్ష ఉపాధి అవకాశాలు అందిస్తాయి. 

* ఈ యూనిట్లు  ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ తయారీ, టెలికాం తయారీ, పారిశ్రామిక తయారీ మరియు ఇతర సెమీకండక్టర్ వినియోగ పరిశ్రమల రంగంలో  ఉపాధి కఅవకాశాలను మెరుగు పరుస్తాయి. 

***