Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భగవాన్ మహావీర్ ఆదర్శాల విస్తృత ప్రభావాన్ని మహావీర్ జయంతి సందర్భంగా స్మరించుకొన్న ప్రధానమంత్రి


మహావీర్ జయంతి ఈ రోజు. కలకాలం ప్రేరణాత్మకంగా నిలిచే భగవాన్ మహావీర్ బోధనలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకొన్నారుఆయన ప్రబోధాలు తన జీవనాన్ని కూడా విస్తారంగా ప్రభావితం చేశాయని ప్రధాని అన్నారు.
మోదీ ఆర్కైవ్ ‘ఎక్స్‌’లో పొందుపరచిన ఒక సందేశంభగవాన్ మహావీర్ ప్రబోధాలతోనూజైన సముదాయంతోనూ ప్రధానికి చాలాకాలంగా ఉన్న ఆధ్యాత్మిక బంధానికి అద్దంపట్టింది.
మోదీ ఆర్కైవ్ ‘ఎక్స్‌’లో పొందుపరచిన సందేశానికి ప్రధాని ప్రతిస్పందిస్తూ:
‘‘
భగవాన్ మహావీర్ ఆదర్శాలు నాతో సహా అసంఖ్యాక ప్రజలకు ఎంతో ప్రేరణనందిస్తున్నాయిఆయన ఆలోచనలు శాంతియుతకరుణాభరిత ధరణిని ఆవిష్కరించగలిగే మార్గాన్ని చూపుతున్నాయి’’ అని పేర్కొన్నారు.‌