నమస్కారాలు.
భగవాన్ బసవేశ్వర జయంతి సందర్భం లో మీకు అందరి కి శుభాకాంక్షలు.
కరోనా విశ్వమారి యావత్తు ప్రపంచానికి రువ్విన సంకటాన్ని దృష్టి లో పెట్టుకొని, భగవాన్ బసవేశ్వర మన అందరి పట్ల కృప ను చూపుతూ ఉంటారని, తద్ద్వారా భారతీయులు ఈ యొక్క ప్రపంచవ్యాప్త వ్యాధి ని ఓడించగలుగుతారని నేను ఆకాంక్షిస్తున్నాను. మరి మనం ఒక్క భారతదేశం యొక్క సంక్షేమానికే కాక యావత్తు మానవ జాతి యొక్క సంక్షేమానికి కూడా ను ఎంతో కొంత తోడ్పాటు ను అందించగలుగుతామని నేను ఆశిస్తున్నాను.
మిత్రులారా,
భగవాన్ బసవేశ్వర యొక్క ప్రబోధాలు మరియు సందేశాల నుండి నిరంతరమూ నేర్చుకొనే మహదవకాశం నాకు ప్రాప్తించింది. అది దేశం లోని 23 భాష ల లోకి అనువాదం అయినటువంటి ఆయన ఉపదేశాలు కావచ్చు, లేదా లండన్ లో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భం కావచ్చే, ప్రతి పర్యాయం నేను ఒక నూతనమైనటువంటి శక్తి యొక్క అనుభూతి ని పొందాను.
మిత్రులారా,
బసవన్న ప్రవచనాల డిజిటలీకరణ కు సంబంధించి 2017వ సంవత్సరం లో నేను ఇచ్చినటువంటి సలహా పై మీరు విస్తృతమైన కృషి ని చేసిన విషయం నా
దృష్టి కి వచ్చింది. నిజానికి, ఈ ఉత్సవం సైతం ఈ సారి ప్రపంచ వ్యాప్తం గా డిజిటల్ మాధ్యమం ద్వారానే నిర్వహించబడుతోంది.
ఒక రకం గా, ఇది లాక్ డౌన్ యొక్క నియమాల ను పాటిస్తూ ఆన్ లైన్ సమావేశాల ను నిర్వహించేటటువంటి ఒక మంచి ఉదాహరణ ను కూడా అందిస్తున్నది.
ఈ ప్రయాస తో, ప్రపంచం లో మరింత మంది బసవన్న యొక్క మార్గం తో మరియు ఆయన యొక్క ఆదర్శాల తో జోడింపబడ గలుగుతారు.
మిత్రులారా,
ప్రపంచం లో వేరు వేరు రకాల మనుషులు ఉన్నారు. కొంత మంది మంచి పనుల ను గురించి మాట్లాడి, ఆ పనుల ను వారు మాత్రం చేయక పోవటాన్ని మనం చూశాము. మరి కొంతమంది ఎవరికయితే ఏది సరి అయినది అన్నది తెలుసును కానీ, సరి అయినది ఏదన్నది చెప్పేందుకు మాత్రం వారు భయపడుతూ వుంటారు. అయితే బసవన్న ప్రబోధించే పంథా ను ఎన్నుకోవడం ఒక్కటే కాకుండా తాను సంఘం లో మరియు ప్రజల లో చూడదలచుకొన్న మార్పుల ను, సంస్కరణల ను స్వయం గా పాటించి చూపారు. మనం మార్పుల ను అనుససరించి, మరి మనమే ఉదాహరణలు గా మారినప్పుడు మాత్రమే మన చుట్టూరా కొన్ని సార్థకమైనటువంటి పరివర్తనల ను తీసుకు రాగలుగుతాము. బసవన్న యొక్క ధర్మజ్ఞాన స్వభావాల నుండి మీరు కేవలం నేర్చుకోవడమే కాకుండా, ఒక మంచి పరిపాలకుడిగా, ఒక మంచి సంస్కర్త గా ఆయన నుండి ప్రేరణ ను కూడా స్వీకరించవచ్చును.
భగవాన్ బసవేశ్వర ఆడిన మాట లు మరియ ఆయన యొక్క బోధ లు ఎంతటి మహనీయమైన జ్ఞానాని కి మూలం అంటే, అది కేవలం ఒక ఆధ్యాత్మికమైన మార్గదర్శి వంటిదే కాక మనం ప్రయాణించవలసిన దారి ని ఒక ఆచరణీయమైన మార్గదర్శి మనకు దర్శింపచేసే ఒక మాధ్యమం వంటిది కూడాను. ఆయన ప్రవచనాలు మనం ఒక మంచి మానవుని వలె మెలగాలని కూడా సూచిస్తాయి; అలాగే మన సంఘాన్ని మరింత ఉదారమైందిగా, కరుణాపూరితమైందిగా, ఇంకా సభ్యమైందిగా మలచుకోవడం లో మనకు సహాయపడుతాయి.
అలాగే మిత్రులారా, భగవాన్ బసవేశ్వర ఆడిన మాట లు ఆయన ఎంతటి దీర్ఘ దృష్టి ని కలిగిన వారనే విషయాన్ని కూడా మనకు చెబుతాయి. శతాబ్దాల క్రిందటే, భగవాన్ బసవేశ్వర సాంఘిక సమానత్వం మరియు పురుషులు-మహిళల మధ్య సమానత్వం వంటి విషయాల పైన సమాజం అనుసరించవలసినటువంటి దారి ని చూపించారు. బలహీన వర్గాలు సమాన హక్కుల ను మరియు గౌరవాన్ని పొందనిదే మన ప్రగతి అసంపూర్తి గానే మిగులుతుంది. ఆయన ఆ కాలం లోనే ఈ విషయాన్ని సంఘాని కి బోధించారు.
ఆ కోవ కు చెందిన ఒక సామాజిక ప్రజాతంత్రం కోసం- ఎక్కడయితే సమాజ శ్రేణుల లో అట్టడుగు స్థానాన ఉన్నటువంటి వ్యక్తి కి ప్రాధాన్యం ఉంటుందో- బసవన్న పునాది ని వేశారు. మానవ జీవనం లోని ప్రతి ఒక్క దృష్టికోణాన్ని బసవన్న తడిమి, మరి దాని ని మెరుగుపరచేందుకు పరిష్కార మార్గాల ను సూచించారు. బసవన్న ఎల్లప్పుడూ కఠోర శ్రమ పట్ల ఆదరణ ను కనబరచారు. ఆయన కఠోర శ్రమ కు మరియు పని పాటు లకు ప్రాముఖ్యాన్ని కట్టబెట్టారు. ప్రతి ఒక్క వ్యక్తి- సంఘం లో పెద్ద వారు గాని లేదా చిన్న వారు గాని- దేశ సేవ చేయడం లో ఒక శ్రామికుడే అని ఆయన అనే వారు.
ఆయన ప్రపంచ దార్శనికత దయ తోను, ప్రేమ తోను నిండి వుండింది. ఆయన అహింస ను మరియు ప్రేమ ను భారతీయ సంస్కృతి కి కేంద్ర స్థానం లో నిలబెట్టారు. అందుకని ఈ రోజు న, మన దేశమైన భారతదేశం వివిధ సవాళ్ల ను పరిష్కరించడం లో ముందడుగు వేస్తోంది అంటే, అటువంటప్పుడు బసవన్న ఆదర్శాలు సమ ప్రాసంగికత ను సంతరించుకొన్నాయన్న మాటే.
అది ఆయన దేవతాసంబంధి బోధ లు కావచ్చు లేదా ఒక ప్రజాస్వామిక వ్యవస్థ తాలూకు ఆయన ఆదర్శాలు కావచ్చు, లేదా స్వయం సమృద్ధి సాధన కోసం జరిగిన ప్రయత్నాలు కావచ్చు, బసవేశ్వర ఎల్లవేళ ల వాటి ని సమాజ నిర్మాణం లో ఒక ముఖ్యమైన భాగం గా పరిగణించారు. ఆయన సమాజం యొక్క ఏకత్వాన్ని, ప్రకృతి ని మరియు ప్రాకృతిక వనరుల, ఇంకా సాంఘిక వనరుల యొక్క ఆలోచనపూర్వక ఉపయోగాన్ని సదా నమ్ముతూపోయారు. వారి యొక్క భావాలు వందల సంవత్సరాల క్రితం మాదిరి గానే ఈనాటి కి కూడాను అంతటి ప్రాముఖ్యాన్ని కలిగివున్నవే.
మిత్రులారా,
21వ శతాబ్ది కి చెందిన భారతదేశం లో ఇవాళ సైతం, నేను నా యొక్క దేశ వాసుల లో మరియు నా తోటి పౌరుల లో ఒక అర్థవంతమైనటువంటి మార్పు ను కొనితేవాలన్న దృఢ సంకల్పాన్ని మరియు ఒక బలమైన ఇచ్ఛా శక్తి ని గమనించగలుగుతున్నాను. ఈ సంకల్ప శక్తి కి ప్రేరణ ను ఇచ్చింది బసవన్న యే.
ఈ రోజు న, భారతీయులు పరివర్తన అనేది నిజంగా వారి తోనే మొదలవుతోందని భావిస్తున్నారు. ఈ రకమైనటువంటి ఆశ మరియు విశ్వాసం దేశాన్ని అత్యంత కఠినమైనటువంటి సవాళ్ల బారి నుండి బయటపడవేసేందుకు సాయపడుతుంది; మరి అదే విధం గా ఇది ఎంత గానో దోహద పడుతున్నది కూడా.
మిత్రులారా,
మనం ఈ యొక్క ఆశ తో కూడినటువంటి మరియు నమ్మకం తో కూడినటువంటి సందేశాన్ని బలవత్తరం చేసి, దానిని ముందుకు తీసుకుపోవలసివుంది. ఇది మరింత గా కృషి చేసేటట్లుగా మరియు దానశీలత్వాన్ని అలవరచుకొనేటట్లుగా మనకు ప్రేరణ ను అందించగలదు. ఇది మన దేశాన్ని ఈ దశాబ్దం లో నూతన శిఖరాల కు తీసుకుపోగలదు.
భగవాన్ బసవన్న యొక్క మాటల ను మరియు ఆదర్శాల ను మీరందరూ ప్రపంచం అంతటా వ్యాపింపచేస్తూ ఉందురు గాక; మరి ఈ ప్రపంచాన్ని ఒక ఉత్తమమైన ప్రదేశం గా మలచుదురు గాక. ఈ అపేక్ష తో నేను నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను.
అవును మరి, ఈ కార్యాలన్నిటి నడుమ మీరంతా మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోండి; అంతేకాదు ‘రెండు గజాల దూరం’ తాలూకు నియమాన్ని పాటిస్తూ సాగి పోండి.
మరొక్క సారి, బసవ జయంతి సందర్భం లో మీకు నా యొక్క శుభాకాంక్షలు.
మీకు ఇవే ధన్యవాదాలు.
**
Shared my thoughts about the rich and noble ideals of Lord Basavanna in the video conference - Global Basava Jayanthi – 2020. https://t.co/RMDe2bTiMD
— Narendra Modi (@narendramodi) April 26, 2020