ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొన్నేళ్లుగా వివిధ సందర్భాల్లో భగవాన్ బిర్సా ముండాకు నివాళి అర్పిస్తూ చేసిన వ్యాఖ్యల సంకలనాన్ని పార్లమెంటు సభ్యుడు శ్రీ సుదర్శన్ భగత్ ట్వీట్ చేయడాన్ని శ్రీ మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇదెంతో అద్భుత సంకలనం! గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన భగవాన్ బిర్సా ముండా జీవితం, త్యాగాలతోపాటు ఆయన అంకితభావం దేశ ప్రజలకు సదా మార్గనిర్దేశం చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
महत्वपूर्ण संकलन! जनजातीय गौरव के प्रतीक भगवान बिरसा मुंडा जी का त्याग और समर्पण देशवासियों के लिए हमेशा पथ-प्रदर्शक बना रहेगा। https://t.co/H8DPlt3sZE
— Narendra Modi (@narendramodi) June 9, 2023