Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ‌స‌వేశ్వ‌ర విగ్ర‌హం, డాక్ట‌ర్ అంబేద్క‌ర్ స్మార‌క చిహ్న‌ల‌ని లండ‌న్ లో ఆవిష్క‌రించిన ప్ర‌ధాని

జాగ్వార్ – లాండ్ రోవ‌ర్ కార్ల ప్లాంట్ సంద‌ర్శ‌న‌

లండ‌న్‌లోని లంబెత్‌లో బ‌స‌వేశ్వ‌ర విగ్ర‌హాన్ని ప్ర‌ధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ పారిస్‌లో జ‌రిగిన పాశ‌విక‌మైన ఉగ్ర‌వాద దాడులు త‌న‌కు తీవ్ర‌మైన బాధ క‌లిగించాయ‌న్నారు. ఈ దాడి పారిస్ ప్ర‌జ‌లొక్క‌రి పైనే జ‌రిగిన‌ది కాద‌ని, యావ‌త్ మాన‌వాళిపై జ‌రిగిన దాడి అని ప్ర‌ధాని పేర్కొన్నారు. ఈ అంత‌ర్జాతీయ దౌష్ట్యానికి వ్య‌తిరేకంగా ప్ర‌పంచంలోని మాన‌వ‌తా శ‌క్తుల‌న్నీ ఏకం కావ‌ల‌సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని మోదీ పిలుపునిచ్చారు. ఐక్య‌రాజ్య‌స‌మితి సైతం త‌న వంతుగా ఉగ్ర‌వాదానికి స్ప‌ష్ట‌మైన నిర్వ‌చ‌నం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ప్ర‌ధాని అన్నారు.

భార‌త్‌కు చెందిన గొప్ప‌ త‌త్వ‌వేత్త‌, సంఘ సంస్క‌ర్త బ‌స‌వేశ్వ‌ర అని ప్ర‌ధాని అభివ‌ర్ణించారు. బ‌స‌వేశ్వ‌ర తాను జీవించి ఉన్న కాలంలో స‌మాజం అనుభ‌విస్తున్న రుగ్మ‌త‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడార‌ని, గ్రామ స్థాయి నుంచి ప్ర‌జాస్వామ్యాన్ని ప‌టిష్ఠం చేయ‌డానికి కృషి చేశార‌ని ప్ర‌ధాని చెప్పారు.

లండ‌న్‌లోని కింగ్ హెన్రీ రోడ్‌లో డాక్ట‌ర్ అంబేద్క‌ర్ స్మార‌క చిహ్నాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్రారంభించారు. అంబేద్క‌ర్ విగ్ర‌హం ముందు కొవ్వొత్తి వెలిగించి, ఈ స్మార‌క మందిరాన్ని ప్ర‌జ‌ల‌కు అంకితం ఇస్తున్న‌ట్టు తెలియ‌చేసే ఫ‌ల‌కాన్ని ప్ర‌ధాన్నిఆవిష్క‌రించారు. “త‌న ముందున్న క‌ష్టాల‌ను అధిగ‌మించేందుకు, అవ‌రోధాల‌న్నింటినీ దాటేందుకు, జ్ఞాన స‌ముపార్జ‌న‌కు డాక్ట‌ర్ అంబేద్క‌ర్ కృషి మొద‌లుపెట్టిన ప‌విత్ర ప్ర‌దేశం ఇది, స‌మాజంలో అణ‌చివేత‌కు గుర‌వుతున్న వ‌ర్గాల‌కు అవిశ్రాంతంగా శ్ర‌మించిన గొప్ప మ‌నిషి ముందు నా శిర‌సు వంచి అభివాదం చేస్తున్నాను” అని ప్ర‌ధాని సంద‌ర్శ‌కుల పుస్త‌కంలో రాశారు. ”

లండ‌న్ స‌మీపంలోని సోలీహ‌ల్‌లో ఉన్న జాగ్వార్ – లాండ్ రోవ‌ర్ కార్ల త‌యారీ ప్లాంట్‌ను ప్ర‌ధాని సంద‌ర్శించారు.