Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ‌ద‌ర్‌పూర్‌-ఫ‌రీదాబాద్ మెట్రోలైన్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

దేశం కోసం ప్రాణాల‌ర్పించిన వీర సైనికులు, సాయుధ ద‌ళాల‌కు చెందిన మాజీ అధికారుల ఆత్మ గౌర‌వాన్ని ప్ర‌భుత్వం కాపాడుతుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు. వారి సంక్షేమం యావ‌త్ జాతికి అత్యంత అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. సైనికోద్యోగుల్లో ఒకే ర్యాంకు వారికి ఒకే పింఛ‌న్ ఇస్తామ‌న్న‌తన హామీని గుర్తు చేస్తూ శ‌నివారం చేసిన ప్ర‌క‌ట‌న ద్వారా ప్ర‌భుత్వం ఆ హామీని నిల‌బెట్టుకుంద‌ని చెప్పారు. వాస్త‌వానికి ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఆర్థిక‌ భారం గ‌తంలో వేసిన అంచ‌నాల క‌న్నా చాలా ఎక్కువేన‌ని, ప్ర‌భుత్వంపై ఏటా ఎనిమిది వేల నుంచి ప‌ది వేల రూపాయ‌ల వ‌ర‌కు భారం ప‌డుతుంద‌ని ప్ర‌ధాని తెలిపారు. ఫ‌రీదాబాద్‌లో బ‌ద‌ర్‌పూర్‌-ఫ‌రీదాబాద్ మెట్రోను ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

దేశ పురోభివృద్ధి కోసం ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా దాన్ని రాజ‌కీయం చేయ‌డం ఒక ఫ్యాష‌న్‌గా మారింద‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క‌రూ జ‌వానుల‌ను, ప్ర‌జ‌ల‌ను త‌మ మాట‌ల‌తో త‌ప్పుదారి ప‌ట్టించ‌లేరని స్ప‌ష్టం చేస్తూ రాజ‌కీయాల‌తో (రాజ్‌నీతి) కాకుండా జాతీయవాద విధానాల‌తోనే (రాష్ర్ట నీతి) దేశం పురోగ‌మ‌న ప‌థంలో న‌డుస్తుంద‌ని ఆయ‌న అన్నారు. సైనికుల్లో ఎక్కువ మంది హ‌ర్యానాకు చెందిన వారేన‌ని, ఒకే ర్యాంకు ఒకే పింఛ‌ను నిర్ణ‌యం హ‌ర్యానా ఆర్థిక వ్య‌వ‌స్థకు ఎన‌లేని బ‌లాన్ని ఇస్తుంద‌ని ప్ర‌ధాని అన్నారు. స‌మ‌స్య‌ల‌న్నింటికీ అభివృద్ధి ఒక్క‌టే ప‌రిష్కార‌మ‌ని చెబుతూ భార‌తదేశం అభివృద్ధి కోసం కేంద్ర‌ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌పంచం మొత్తం తీవ్ర ఆర్థిక ఇక్క‌ట్లు ఎదుర్కొన్న వాతావ‌ర‌ణంలో కూడా ప‌టిష్ఠంగా నిల‌బ‌డింది భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఒక్క‌టేన‌ని ఆయ‌న అన్నారు. దేశం ప‌టిష్ఠంగా ఉండాలంటే కేంద్రం, అన్ని రాష్ర్ట‌ప్ర‌భుత్వాలు భుజం భుజం క‌లిపి న‌డ‌వాల‌ని ఆయ‌న సూచించారు. 2022 నాటికి అంద‌రికీ గృహ‌వ‌స‌తి క‌ల్పించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. ఈ స‌ర్వీసును ప్రారంభించిన మోదీ ఢిల్లీ సెంట్ర‌ల్ నుంచి ఫ‌రీదాబాద్‌కు, ఫ‌రీదాబాద్ నుంచి ఢిల్లీ సెంట్ర‌ల్‌కు మెట్రో రైలులో ప్ర‌యాణించారు. ఈ ప్ర‌యాణంలో భాగంగా ఆయ‌న ఆ రైలులో ప్ర‌యాణిస్తున్న‌ ప్ర‌జ‌ల‌తో ప్ర‌త్యేకించి యువ‌త‌తో మాట్లాడి ప‌ర‌స్ప‌రం భావాలు పంచుకున్నారు.