ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నూతన దశాబ్దం లో తన తొలి నేడు జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో బ్రూ రియాంగ్ ఒప్పందం రెండు దశాబ్దుల పాతదైన శరణార్థి సంకటానికి స్వస్తి పలికి, మిజోరమ్ లో 34000 కు పైగా శరణార్థుల కు సహాయాన్ని మరియు ఉపశమనాన్ని అందిస్తుందన్నారు.
ఈ సమస్య ను శ్రీ మోదీ సమగ్రం గా వివరిస్తూ, ‘‘ఈ సమస్య 90వ దశకానికి సంబంధించింది. 1997వ సంవత్సరం లో జాతిపరమైనటువంటి ఉద్రిక్తత మిజోరమ్ ను వదలిపెట్టి త్రిపుర లో శరణు జొచ్చే స్థితి ని బ్రూ-రియాంగ్ ఆదివాసీ తెగ కు కల్పించింది. ఈ శరణార్థుల ను ఉత్తర త్రిపుర లో కంచన్ పుర్ లో తాత్కాలిక శిబిరాల లో ఉంచారు. బ్రూ-రియాంగ్ సముదాయం శరణార్థులు గా వారి జీవితం లో ఒక గణనీయమైనటువంటి భాగాన్ని కోల్పోవడం బాధాకరం. శిబిర జీవనం అంటే వారు కనీస సౌకర్యాల కు దూరం అయ్యారని అర్థం. 23 సంవత్సరాల పాటు వారి యొక్క కుటుంబ సభ్యుల కు ఇల్లు గాని, ఎటువంటి భూమి గాని, మరే వైద్య చికిత్స గాని, వారి యొక్క పిల్లల కు ఏ విధమైనటువంటి చదువుసంధ్యలు గాని లేకుండా పోయాయి’’ అన్నారు.
శరణార్తుల యొక్క వేదన కు మరియు ఈ సమస్య కు అనేక ప్రభుత్వాలు ఎటువంటి మందును కనుగొనలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశ రాజ్యాంగం పట్ల శరణార్థులు నమ్మకాన్ని పెట్టుకోవడాన్ని ఆయన అభినందించారు.
ఈ నెల లో ఢిల్లీ లో సంతకాలు అయిన చరిత్రాత్మక ఒప్పందానికి బాట ను పరచింది వారి యొక్క నమ్మకమే అని ఆయన అన్నారు.
‘‘వారి యొక్క జీవితం నేడు ఒక సరిక్రొత్త ఉషోదయం ముంగిట నిలచింది అంటే అది నమ్మకం యొక్క ఫలితం. ఒప్పందం ప్రకారం, ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం వారికి లభించింది. ఎట్టకేలకు 2020వ నూతన దశాబ్ది, బ్రూ-రియాంగ్ సముదాయం యొక్క జీవితంలోకి ఒక నూతన ఆశాకిరణాన్ని తీసుకువచ్చింది’’ అని ఆయన అన్నారు.
ఒప్పందం యొక్క లాభాల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ‘‘త్రిపుర లో దాదాపు 34000 మంది బ్రూ శరణార్థుల కు పునరావాసాన్ని కల్పించడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాక, వారి యొక్క పునరాశ్రయానికి మరియు సర్వతోముఖ అభివృద్ధి కి సుమారు గా 600 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం సమకూర్చుతుంది. ప్రతి ఒక్క నిరాశ్రయ పరివారానికి భూమి ని ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇంటి ని కట్టుకోవడం లో వారికి తోడ్పడటం జరుగుతుంది. దీనికి తోడు, వారు ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాల తాలూకు లబ్ధి ని పొందగలుగుతారు’’ అన్నారు.
ఈ ఒప్పందం సహకారాత్మక సమాఖ్యవాదం యొక్క స్ఫూర్తి కి ప్రతీక గా ఉన్నందువల్ల ఇది ప్రత్యేకమైనటువంటి ఒప్పందం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
‘‘ఈ ఒప్పందం భారతీయ సంస్కృతి లో అంతర్నిహితమై ఉన్నటువంటి కరుణ కు మరియు సూక్ష్మగ్రాహ్యత కు సారంగా కూడా ఉంటోంది’’ అని ఆయన అన్నారు.
హింస ను త్యజించి ప్రధాన స్రవంతి కి తిరిగి రండి
హింస ఏ సమస్యకైనా పరిష్కారాల ను అందించజాలదు అని ప్రధాన మంత్రి అన్నారు. అసమ్ లో వర్గాల కు చెందిన 644 మంది ఉగ్రవాదులు వారి యొక్క ఆయుధాలను అప్పగించి ప్రధాన స్రవంతి లోకి తిరిగిరావాలని నిర్ణయించుకొన్నారని ఆయన చెప్తూ, ఈ విషయాన్ని పొగడారు.
భవ్యమైనటువంటి ‘ఖేలో ఇండియా’ క్రీడల కు ఆతిథేయి గా ఉన్న అసమ్ మరొక గొప్ప కార్యసాధన కు సాక్షి గా నిలచింది. కొద్ది రోజుల కిందట, 8 రణప్రియ వర్గాల కు చెందిన 644 మంది ఉగ్రవాదులు కొద్ది వారి ఆయుధాల తో లొంగిపోయారు. హింస మార్గం దిశ గా దారి తప్పిపోయినటువంటి వారు శాంతి పట్ల వారి యొక్క నమ్మిక ను వెలిబుచ్చారు. దేశ ప్రగతి లో ఒక భాగస్వామి గా అయ్యి ప్రధాన స్రవంతి కి తిరిగి రావాలి అని వారు నిర్ణయించుకొన్నారు’’ అని ఆయన వివరించారు.
అదే విధం గా త్రిపుర లో 80 కి పైగా మంది హింస పథాన్ని వదలిపెట్టి ప్రధాన స్రవంతి కి తిరిగి చేరుకొన్నారు అని ఆయన తెలిపారు. ఈశాన్య ప్రాంతం లో ఉగ్రవాదం గణనీయ స్థాయి లో తగ్గింది అని ఆయన అన్నారు.
‘‘దీనికి పెద్ద కారణం ఏమిటి అంటే అది ఈ ప్రాంతం యొక్క ప్రతి సమస్య ను నిజాయతీ తోను, శాంతియుతంగాను సంభాషణ ద్వారా పరిష్కరించడమైంది’’ అని ఆయన అన్నారు.
ఇప్పటికీ హింస మార్గం లో ఉన్న వారిని కూడా ప్రధాన స్రవంతి లోకి తిరిగి రావలసింది గా ఆయన కోరారు.
‘‘ఈ పవిత్రమైనటువంటి గణతంత్ర దినం నాడు, దేశం లో ఏ మూలన ఉన్న ఎవరికి అయినా నేను విన్నవించేది ఏమిటి అంటే, ఇంకా ఆయుధాలు మరియు హింస ద్వారా సమస్యల కు పరిష్కారాల కోసం వెతుకుతున్న వారు ప్రధాన స్రవంతి కి తిరిగి రండి అనేదే. వారు వారి యొక్క స్వీయ సామర్థ్యాల పట్ల మరియు సమస్యల ను శాంతియుతమైన రీతి లో పరిష్కరిచడం లో ఈ దేశం యొక్క శక్తియుక్తుల పట్ల నమ్మకాన్ని ఉంచాలి’’ అని ఆయన అన్నారు.