Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిటన్ ప్రధానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కానుకలు

బ్రిటన్ ప్రధానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కానుకలు

బ్రిటన్ ప్రధానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కానుకలు

బ్రిటన్ ప్రధానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కానుకలు


బ్రిటన్ ప్రధాని శ్రీ డేవిడ్ కామెరాన్కు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అపురూపమైన కానుకలు అందజేశారు. చెక్క, పాలరాయి, వెండి పదార్థాల సాయంతో ప్రత్యేకంగా చేతితో తయారు చేసిన బుక్ ఎండ్స్ జత (పుస్తకాల దొంతరలు పడిపోకుండా అటూ ఇటూ అడ్డుగా ఉండే కళాకృతుల)ను బహుమతిగా అందజేశారు. ఈ బుక్ ఎండ్స్ తయారీలో ఒక విశిష్టత ఉంది. ప్రతి బుక్ ఎండ్ మధ్యలో ఒక వెండి గంటను అమర్చారు. మనిషిలోని అంతర్గత జ్ఞానానికి ఈ వెండి గంట ప్రతీకగా నిలుస్తోంది. ఈ గంట పైన భగవద్గీతలోని సంస్కృత శ్లోకాన్ని చూడవచ్చు. దాని ఇంగ్లీషు అనువాదాన్ని గంట లోపలి భాగంలో చెక్కారు. భగవద్గీత అధ్యాయం 13నుంచి తీసుకున్న 15, 16 శ్లోకాలను ఈ గంటలపై చెక్కారు. ఇవి అత్యున్నతస్థాయి ఆధ్యాత్మిక సత్యాలను చాటుతున్నాయి. ప్రతి గంట పైనా ఒక శ్లోకాన్ని చెక్కారు. ఆ శ్లోకాలు..

బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ |

సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్ |

అవిభక్తం చ భూతేషు విభక్తిమివ చ స్థితమ్ |

భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభువిష్ణు చ |

శ్లోకాలు 15, 16 ల అర్థం ఇలా ఉంది.

పరమాత్మ సర్వ ప్రాణుల సమాహారం కాకున్నా వాటిలో నిలచియుండును. సూక్ష్మత్వకారణంగా ఆయన భౌతికేంద్రియాలకు అగోచరుడు, అగ్రాహ్యుడును అయి ఉన్నాడు. అతి దూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపముననే ఉండును. (శ్లోకం 15)

సర్వేశ్వరుడు విడదీయగూడని వాడైనను జీవులన్నింటియందు ఆతని ఉనికి ఉన్నది; దీనినే సృష్టికర్తగా చెప్పుకోవలసి ఉన్నది; ఆతడే స్థితి, లయకారుడు కూడా అయి ఉన్నాడు. (శ్లోకం 16)

ఈ బహుమతులతో పాటు బ్రిటన్ ప్రధాని శ్రీ కామెరాన్ కు ఒక అరుదైన పుస్తకాన్ని శ్రీ నరేంద్ర మోదీ అందజేశారు. మొదటి ప్రపంచ యుద్ధంపై వెలువడిన శ్రీ రాబర్ట్ గ్రేవ్స్ రచన గుడ్ బై టు ఆల్ దట్ అంటే ప్రధాని శ్రీ కామెరాన్కు చాలా ఇష్టం. ఇది దృష్టిలో పెట్టుకొని ఆ పుస్తక ప్రతితో పాటు శ్రీ డేవిడ్ ఒమిస్సీ రచించిన ఇండియన్ వాయిసెస్ ఆఫ్ ది గ్రేట్ వార్ పుస్తకాన్నికూడా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ బహూకరించారు.

బ్రిటన్ ప్రథమ మహిళకు కేరళలో చేతివృత్తి కళాకారులు తయారు చేసిన అరుదైన అరన్ములా లోహ దర్పణాన్ని అందజేశారు. దీనితోపాటు నాణ్యమైన గొర్రెల ఉన్నితో నేసిన శాలువాలను కూడా బహూకరించారు.