Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిటన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం

బ్రిటన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం


హిరోషిమాలో  జి7 దేశాల శిఖరాగ్ర సభ వేదిక వద్ద  ఆదివారం  బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ రిషి సునాక్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.  

ఇండియా – బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలలో ప్రగతితో సహా రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి ఇద్దరు నేతలు సమీక్షించారు.

వాణిజ్యం & పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగం, ఉన్నత విద్య మరియు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో పాటు వివిధ  రంగాలలో సహకారాన్ని మరింత పెంచాలని వారిద్దరూ అంగీకరించారు.  

జీ20 అధ్యక్ష హోదా గురించి కూడా చర్చలు జరిపారు.   న్యూఢిల్లీలో జరిగే జి-20 సభకు సునాక్ వస్తారని ఆశిస్తున్నట్లు, తన రాకకై ఎదురుచూస్తున్నట్లు  ప్రధానమంత్రి తెలిపారు.  

 

***