ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 23న దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహాన్నెస్‌బర్గ్ లో ప్రారంభమైన ‘బ్రిక్స్’ 15వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, ఆఫ్రికాసహా దక్షిణార్థ గోళ దేశాలతో భాగస్వామ్యం తదితర అంశాలపై కూటమి దేశాల అధినేతలు ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ‘బ్రిక్స్’ కార్యాచరణ జాబితాలోని అంశాల అమలులో ఇప్పటిదాకా పురోగతిని వారు సమీక్షించారు.
ప్రధానమంత్రి తన ప్రసంగంలో భాగంగా- మరింత బలమైన ‘బ్రిక్స్’ కోసం ముందడుగు వేయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కూటమికి కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ మేరకు:
బి – అవరో్ధాలను అధిగమించడం (బ్రేకింగ్ బారియర్స్)
ఆర్- ఆర్థిక వ్యవస్థలకు పునరుత్తేజం (రీవైటలైజింగ్ ఎకానమీస్)
ఐ – ఆవిష్కరణ స్ఫూర్తి (ఇన్స్పైరింగ్ ఇన్నొవేషన్)
సి – అవకాశాల సృష్టి (క్రియేటింగ్ ఆపర్చునిటీస్)
ఎస్- భవిష్యత్తుకు రూపం (షేపింగ్ ది ఫ్యూచర్)
అదేవిధంగా వివిధ చర్యలకు సంబంధించి కింది అంశాలను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు:
*****
My remarks at Plenary Session I of BRICS Summit in Johannesburg. https://t.co/JqJPCv045R
— Narendra Modi (@narendramodi) August 23, 2023