Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిక్స్ 13వ శిఖర సమ్మేళనానికి అధ్యక్షత వహించిన ప్ర‌ధాన మంత్రి

బ్రిక్స్ 13వ శిఖర సమ్మేళనానికి అధ్యక్షత వహించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వర్చువల్ పద్ధతి లో జరిగిన బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్’) శిఖర సమ్మేళనానికి అధ్యక్షత వహించారు.

ఈ శిఖర సమ్మేళనానికి ఇతివృత్తం గా బ్రిక్స్ @15: ఇంట్రా- బ్రిక్స్ కోఆపరేశన్ ఫార్ కంటీన్యూటీ, కన్సాలిడేశన్ ఎండ్ కన్ సెన్సస్ను భారతదేశం ఎంపిక చేసింది.

బ్రిక్స్ లోని ఇతర నేత లు అందరూ.. అంటే బ్రెజిల్ అధ్య‌క్షుడు మాన్య శ్రీ జాయిర్ బోల్ సొనారొ, రష్యా అధ్యక్షుడు మాన్య శ్రీ వ్లాదిమీర్ పుతిన్, చైనా అధ్యక్షుడు మాన్య శ్రీ శీ చిన్ పింగ్, ద‌క్షిణ ఆఫ్రికా అధ్య‌క్షుడు మాన్య‌ శ్రీ సాయిరిల్ రామాఫోసా లు.. ఈ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొన్నారు.

అధ్యక్ష పదవి బాధ్యత ను వహించిన ఈ సంవత్సరం లో, బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నుంచి అందిన సహకారం పట్ల ప్రధాన మంత్రి తన ప్రశంస ను వ్యక్తం చేస్తూ, ఈ సహకారం ఫలితం గా అనేక నూతన కార్యక్రమాల ను అమలుపరచడం సాధ్యపడిందన్నారు. ఆ నూతన కార్యక్రమాల లో బ్రిక్స్ ఒకటో డిజిటల్ హెల్థ్ సమిట్; బ్రిక్స్ ఒకటో మినిస్టీరియల్ జాయింట్ స్టేట్ మెంట్ ఆన్ మల్టిలేటరల్ రిఫార్మ్స్; ఉగ్రవాదాని కి ఎదురొడ్డే బ్రిక్స్ కార్యాచరణ ప్రణాళిక; రిమోట్-సెన్సింగ్ శాటిలైట్స్ రంగం లో సహకారానికి ఉద్దేశించినటువంటి ఒక ఒప్పందం; వర్చువల్ బ్రిక్స్ వ్యాక్సీన్ రిసర్చ్ & డెవలప్ మెంట్ సెంటర్; బ్రిక్స్ అలాయన్స్ ఆన్ గ్రీన్ టూరిజమ్ ల వంటివి భాగం గా ఉన్నాయి అని ఆయన అన్నారు.

కోవిడ్ అనంతర కాలం లో ప్రపంచ ఆర్థికవ్యవస్థ కోలుకోవడం లో బ్రిక్స్ సభ్యత్వ దేశాలు పోషించగలిగిన ప్రధానమైన పాత్ర ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ‘బిల్డ్-బ్యాక్ రిజిలియంట్ లీ, ఇన్నొవేటివ్ లీ, క్రెడిబ్లీ ఎండ్ సస్టెయినబ్లీఅనేదే బ్రిక్స్ ఇతోధిక సహకారాని కి నీతివాక్యం కావాలి అంటూ పిలుపునిచ్చారు.

ఈ ఇతివృత్తాల ను గురించి ప్రధాన మంత్రి విపులం గా చెప్తూ, టీకా మందు ను ఇప్పించే కార్యక్రమాన్ని జోరు గా అమలుపరుస్తూ, టీకా మందు ను అందరి కి అందుబాటు లోకి తీసుకు వస్తూ పునర్ నిర్మాణం చేయవలసిన (బిల్డ్- బ్యాక్) అవసరం ఎంతయినా ఉంది అన్నారు. అంతేకాక, అభివృద్ధి చెందిన దేశాల వెలుపల సైతం టీకా మందు ఉత్పత్తి సామర్థ్యాల ను కల్పించడం ద్వారా, ఔషధ నిర్మాణ సంబంధి వైవిధ్యానికి తావు ఇవ్వడం ద్వారా ప్రతిఘాతకత్వాన్నినెలకొల్పడం, ప్రజల హితం కోసం డిజిటల్ ఉపకరణాల ను ఉపయోగించడం ద్వారా నూతన ఆవిష్కరణలను పెంచడం, బహుపక్షీయ సంస్థల లో సంస్కరణ కు పూచీ పడడం ద్వారా వాటి విశ్వసనీయతను పెంచడం, ఇంకా పర్యావరణ సంబంధి అంశాలు, జల వాయు పరివర్తన అంశాల పై బ్రిక్స్ తరఫు న ఒక ఉమ్మడి స్వరాన్ని వినిపించడం ద్వారా నిరంతరఅభివృద్ధి ని ప్రోత్సహించడం గురించి కూడా ఆయన వివరించారు.

నేత లు అఫ్ గానిస్తాన్ లో ఇటీవలి పరిణామాలు సహా ముఖ్యమైనటువంటి ప్రాంతీయ అంశాల ను, అంతర్జాతీయ అంశాల ను కూడా చర్చించారు. ఉగ్రవాదం, అతివాదం ల ప్రాబల్యం రువ్విన బెదరింపు పై ఒకే విధమైన అభిప్రాయం వెల్లడి అయింది; దీనితో పాటు ఉగ్రవాదాన్ని ఎదురించడం కోసం బ్రిక్స్ కార్యాచరణ ప్రణాళిక ను త్వరిత గతి న అమలు పరచడానికి కూడా బ్రిక్స్ భాగస్వాములు అందరూ వారి వారి అంగీకారాన్ని వ్యక్తం చేశారు.

శిఖర సమ్మేళనం ముగింపు లో, నేత లు న్యూ ఢిల్లీ ప్రకటనకు అంగీకారం తెలిపారు.

***