Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బోడో సమాజాన్ని శక్తిమంతం చేయడానికి, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్రం, అస్సాంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి… మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి: ప్రధానమంత్రి


కోక్రాఝర్‌లో ఈ నెల 17న ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తున్న చారిత్రక సందర్భాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

బోడో సమాజాన్ని శక్తిమంతం చేయడానికివారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్రంఅస్సాంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారుమరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు.

 

కోక్రాఝర్‌లో నిర్వహించనున్న ఒక రోజు అసెంబ్లీ సమావేశం గురించి అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వ శర్మ చేసిన ప్రకటనకు ప్రతిస్పందిస్తూశ్రీ మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

బోడో సమాజానికి సాధికారత కల్పించడానికి అలాగే వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్రంఅస్సాంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయిమరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నాం.

కోక్రాఝర్‌ను సందర్శించిన సమయంలో అక్కడ నేను చూసిన‌ శక్తిమంతమైన బోడో సంస్కృతి ఈ సందర్భంగా నాకు గుర్తుకువస్తోంది.