Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెల్జియమ్ రాజు శ్రీ ఫిలిప్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి


బెల్జియమ్ రాజు శ్రీ ఫిలిప్‌తో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారుయువరాణి ఆస్ట్రిడ్ సారథ్యంలో బెల్జియం ఎకనామిక్ మిషన్ ఇటీవల భారత్‌ను సందర్శించడాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు.  ఇప్పటికే దృఢంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతపరుచుకోవడంవాణిజ్యాన్నీపెట్టుబడినీ  ప్రోత్సహించడంతోపాటు నవకల్పనస్థిరత్వం కోసం పరస్పర సహకారాన్ని ముందుకు తీసుకుపోవడం అనే అంశాలపై బెల్జియమ్ రాజుతో ప్రధాని చర్చించారు.

ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి  పొందుపరుస్తూ..
‘‘
బెల్జియమ్ రాజు శ్రీ ఫిలిప్‌తో మాట్లాడడం చాలా సంతోషాన్ని కలిగించిందియువరాణి ఆస్ట్రిడ్ నాయకత్వంలో  బెల్జియమ్ ఎకనామిక్ మిషన్ భారత్‌లో ఇటీవల పర్యటించడం అభినందనీయంమన బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస‌్తృతపరుచుకోవాలనివాణిజ్యానికీపెట్టుబడులకూ ప్రోత్సాహాన్ని అందించడంతోపాటు నవకల్పనస్థిరత్వపరంగా సహకారాన్ని ముందుకు తీసుకు పోవాలనే అంశాలపై  మేం చర్చించాం’’@MonarchieBe”