Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బీహార్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


బీహార్‌ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ

రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ సుసంపన్న వారసత్వాన్ని,

దేశ చరిత్రలో రాష్ట్రానికిగల ఉన్నత స్థానాన్ని, రాష్ట్ర ప్రగతికి

తోడ్పాటులో అక్కడి ప్రజల నిర్విరామ స్ఫూర్తిని ఈ సందర్భంగా ఆయన

ప్రశంసించారు.

 

 

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

 

 

“బీహార్‌ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఎందరో మహనీయులు, వీరులకు

జన్మనిచ్చిన ఈ పవిత్ర భూమి నివాసులైన సోదరసోదరీమణులకు నా హృదయపూర్వక

శుభాకాంక్షలు. భారతదేశ చరిత్రకు గర్వకారణమైన బీహార్‌ రాష్ట్రం నేడు

పురోగమన పథంలో కీలక ప్రయాణం సాగిస్తోంది. అందువల్ల కష్టజీవులు,

ప్రతిభావంతులైన ప్రజలు ఇందులో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. ఈ సమయంలో

మన సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుగొమ్మ వంటి ఈ రాష్ట్ర

సర్వతోముఖాభివృద్ధికి ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ శాయశక్తులా

కృషిచేద్దాం” అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.