ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు బీహార్‌లోని ఔరంగాబాద్‌లో రూ. 21,400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, కొన్నిటిని జాతికి అంకితం చేశారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టులలో రోడ్డు, రైల్వే, నమామి గంగే రంగాలు ఉన్నాయి. ప్రధాని ఫోటో గ్యాలరీని కూడా వీక్షించారు.
ఈ సభలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, బీహార్ విభూతి శ్రీ అనుగ్రహ నారాయణ్ వంటి మహానుభావులకు జన్మనిచ్చిన ఔరంగాబాద్ గడ్డపై ఈరోజు బీహార్ అభివృద్ధిలో కొత్త అధ్యాయం లిఖించబడుతోందని అన్నారు. దాదాపు రూ.21,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపనలు జరుగుతున్నాయని, ఆధునిక బీహార్‌ను ప్రతిబింబించే రోడ్డు, రైలు రంగాలతో సహా శంకుస్థాపనలు జరుగుతున్నాయన్నారు. అమాస్-దర్భంగా నాలుగు లేన్ల కారిడార్, దానాపూర్-బిహ్తా నాలుగు లేన్ల ఎలివేటెడ్ రోడ్డు మరియు పాట్నా రింగ్ రోడ్డు యొక్క షేర్పూర్-దిఘ్వారా ఫేజ్‌కు శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేసి అంకితం చేయడం ప్రస్తుత ప్రభుత్వ గుర్తింపు అని ప్రధాని అన్నారు. దేశానికి. నమామి గంగే కార్యక్రమం కింద అరా బై పాస్ రైలు మార్గానికి మరియు పన్నెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా, “ఇది మోడీ హామీ” అని ప్రధాన మంత్రి అన్నారు. బీహార్ ప్రజలు, ముఖ్యంగా ఔరంగాబాద్ పౌరులు వారణాసి-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్‌వే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఇది యుపి మరియు కోల్‌కతాకు ప్రయాణ సమయాన్ని కొన్ని గంటల వరకు తగ్గిస్తుందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ప్రధాన మంత్రి ప్రస్తుత ప్రభుత్వ వ్యవహార శైలిని ప్రకటించి, నేటి అభివృద్ధి పథకాలకు బీహార్ ప్రజలను అభినందించారు.
ఇటీవల ప్రభుత్వం భారతరత్నతో సత్కరించిన జన్ నాయక్ కర్పూరీ ఠాకూర్‌కు ప్రధాని నివాళులర్పించారు. “ఈ అవార్డు మొత్తం బీహార్ కి గౌరవం” అని ప్రధాన మంత్రి అన్నారు. అయోధ్య ధామ్‌లోని శ్రీరామ మందిరంలో ప్రాణ పతిష్ఠను కూడా ఆయన ప్రస్తావించారు. ఇది సీతమ్మ ప్రాంతమైనందుకు సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రాణ ప్రతిష్ఠలో బీహార్ ప్రజలు భారీ ఉత్సాహం, సంతోషకరమైన భాగస్వామ్యాన్ని ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని పునఃప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ, ఈ రోజు బీహార్ ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని ప్రధాని అన్నారు. బీహార్‌లో వంశపారంపర్య రాజకీయాలు చిన్నాభిన్నం కావడంపై కూడా ప్రధాని వ్యాఖ్యానించారు.
కేవలం ఒక్క రోజులో అభివృద్ధి ప్రాజెక్టుల స్థాయిని చూపుతూ, డబుల్ ఇంజన్ ప్రభుత్వ హయాంలో మార్పు వేగానికి ఇది నిదర్శనమని ప్రధాన మంత్రి అన్నారు. రోడ్డు ప్రాజెక్టులు పాట్నా, నలంద, జహనాబాద్, గయా, వైశాలి, సమస్తిపూర్, దర్భంగా వంటి నగరాల రూపురేఖలను మారుస్తాయని చెప్పారు. అదేవిధంగా, బుద్ధగయ, విష్ణుపద్, రాజ్‌గిర్, నలంద, వైశాలి, పావపురిలలో పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. రాబోయే దర్భంగా విమానాశ్రయం, బిహ్తా విమానాశ్రయాలు కూడా ఈ రహదారి మౌలిక సదుపాయాలతో అనుసంధానం అవుతాయి.
బీహార్ పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను ఉటంకిస్తూ, వందే భారత్, అమృత్ భారత్ వంటి ఆధునికీకరించిన రైళ్ల ప్రారంభం, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఒక్క సారి వెనక్కి చుస్తే యువత వలసలకు దారితీసే పౌరులలో పెరుగుతున్న అభద్రతా రోజులను కూడా శ్రీ మోదీ గుర్తు చేసారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కింద యువత శిక్షణ పొందుతున్న నేటి యుగాన్ని ప్రస్తావించారు. బీహార్ నుండి హస్తకళలను ప్రోత్సహించడానికి సుమారు రూ. 200 కోట్ల విలువైన ఏక్తా మాల్‌కు శంకుస్థాపన చేయడం గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇది రాష్ట్రానికి కొత్త దిశ, సానుకూల ఆలోచనను సూచిస్తుందని అన్నారు. “మేము బీహార్‌ను పాత కాలానికి తీసుకెళ్ళం. ఇది గ్యారెంటీ” అని ప్రధాన మంత్రి అన్నారు.
“బీహార్‌లోని పేదలు అభివృద్ధి చెందినప్పుడే బీహార్ అభివృద్ధి చెందుతుంది”, పేదలు, దళితులు, వెనుకబడినవారు, గిరిజనులు, అణగారిన వారిపై ప్రభుత్వ దృష్టిని ప్రధాని వివరించారు. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన తెలియజేశారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌ల వల్ల బీహార్‌లో కోటి మంది మహిళలు లబ్ధి పొందారు. 90 లక్షల మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులుగా రూ. 22,000 కోట్లు వారి ఖాతాలకు బదిలీ చేశారు. ఐదేళ్ల క్రితం వరకు కేవలం 2 శాతం ఇళ్లకు మాత్రమే పైపుల నీరు అందుతుండగా, ప్రస్తుతం 90 శాతానికి పైగా ఇళ్లలో నల్‌సే జల్ ఉందని చెప్పారు. బీహార్‌లో 80 లక్షల మంది ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు, బీహార్, జార్ఖండ్‌లోని 4 జిల్లాల్లో 1 లక్ష హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించే నార్త్ కోయల్ రిజర్వాయర్ యోజన త్వరలో పూర్తవుతుంది” అని ప్రధానమంత్రి తెలిపారు.
“బీహార్ అభివృద్ధి, శాంతిభద్రతలు, బీహార్‌లోని సోదరీమణులు, కుమార్తెలకు హక్కులు – ఇది మోడీ హామీ”, ఈ హామీలను నెరవేర్చడానికి, మూడవ దఫా ప్రభుత్వ పదవీకాలంలో వికసిత బీహార్‌ను రూపొందించడానికి కృషి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి ముగించారు. ప్రధాని అభ్యర్థన మేరకు, ఈ అభివృద్ధిని వేడుకగా సూచిస్తూ, ప్రజలు తమ మొబైల్ ఫ్లాష్‌లైట్‌లను ఆన్ చేశారు.
బీహార్ గవర్నర్ శ్రీ రాజేంద్ర వి అర్లేకర్, బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రులు శ్రీ సామ్రాట్ చౌదరి, శ్రీ విజయ్ కుమార్ సిన్హా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం:
రూ.18,100 కోట్లకు పైగా విలువైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. ప్రారంభమయ్యే ప్రాజెక్ట్‌లలో 63.4 కి.మీ పొడవు గల రెండు లేన్‌లు ఉన్నాయి ఎన్హెచ్ -131జి లో కన్హౌలీ నుండి రామ్‌నగర్ వరకు ఆరు లేన్ల పాట్నా రింగ్ రోడ్డు విభాగం; కిషన్‌గంజ్ పట్టణంలో ప్రస్తుతం ఉన్న ఫ్లై ఓవర్‌కు సమాంతరంగా 3.2 కి.మీ పొడవైన రెండవ ఫ్లైఓవర్; 47 కి.మీ పొడవు భక్తియార్‌పూర్-రాజౌలి నాలుగు లేనింగ్; ఎన్హెచ్–319 కి సంబంధించి 55 కి.మీ పొడవు గల అర్రా – పరారియా సెక్షన్ నాలుగు లేనింగ్.
అమాస్ నుండి గ్రామం శివరాంపూర్ వరకు 55 కి.మీ పొడవైన నాలుగు-లేన్ యాక్సెస్-నియంత్రిత గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంతో సహా ఆరు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు; శివరాంపూర్ నుండి రామ్‌నగర్ వరకు 54 కి.మీ పొడవైన నాలుగు-లేన్ యాక్సెస్-నియంత్రిత గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి; కళ్యాణ్‌పూర్ గ్రామం నుండి బల్భదర్‌పూర్ గ్రామం వరకు 47 కి.మీ పొడవు నాలుగు-లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే; 42 కి.మీ పొడవు నాలుగు-లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే బల్భదర్‌పూర్ నుండి బేలా నవాడ వరకు; దానాపూర్ – బిహ్తా సెక్షన్ నుండి 25 కి.మీ పొడవు నాలుగు లేన్ ఎలివేటెడ్ కారిడార్; మరియు బిహ్తా – కోయిల్‌వార్ సెక్షన్‌లో ఇప్పటికే ఉన్న రెండు లేన్‌లుగా నాలుగు లేన్‌ల క్యారేజ్‌వే అప్‌గ్రేడేషన్. రహదారి ప్రాజెక్టులు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి, పర్యాటకాన్ని పెంచుతాయి, అలాగే ఆ ప్రాంతం సామాజిక-ఆర్థిక అభివృద్ధికి అవకాశాన్నిస్తాయి.
పాట్నాలో యూనిటీ మాల్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్ల పైగా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ డిజైన్ పద్ధతులు, సాంకేతికత, సౌలభ్యం, ఆకర్షణకు అత్యాధునిక సదుపాయంగా భావిస్తారు. ఈ మాల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలకు ప్రత్యేక స్థలాలను అందిస్తుంది, తద్వారా వారు తమ ప్రత్యేక ఉత్పత్తులు, నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు 36 పెద్ద స్టాల్స్, బీహార్‌లోని ప్రతి జిల్లాకు 38 చిన్న స్టాల్స్ ఉంటాయి. యూనిటీ మాల్ బీహార్, భారతదేశం ఒక జిల్లా ఒక ఉత్పత్తులు, భౌగోళిక సూచికలు (జిఐ) ఉత్పత్తులు, హస్తకళల ఉత్పత్తుల స్థానిక తయారీ, ప్రమోషన్‌ను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు రాష్ట్రం నుండి ఎగుమతుల పరంగా గణనీయమైన సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.
ज्ञान की धरती बिहार आना मेरे लिए सौभाग्य की बात है। औरंगाबाद में विभिन्न विकास परियोजनाओं के लोकार्पण और शिलान्यास कार्यक्रम को संबोधित कर रहा हूं। https://t.co/9QekGLpEEW
— Narendra Modi (@narendramodi) March 2, 2024
कुछ दिन पहले ही बिहार के गौरव कर्पूरी ठाकुर जी को देश ने भारत रत्न दिया है।
— PMO India (@PMOIndia) March 2, 2024
ये सम्मान पूरे बिहार का सम्मान है। pic.twitter.com/Vnp2zsh0QN
हमारी सरकार देश के हर गरीब, आदिवासी, दलित, वंचित का सामर्थ्य बढ़ाने में जुटी है: PM @narendramodi pic.twitter.com/wi63tGcSZB
— PMO India (@PMOIndia) March 2, 2024